Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
నిద్రలో పెద్దగా గురక పెడుతున్నారా? అయితే మీకు 71% గుండెపోటు ముప్పు ఉన్నట్లే!
మీ ఇంట్లో ఎవరైనా నిద్రలో పెద్దగా గురక పెడుతున్నారా? పాపం, రోజంతా కష్టపడి అలిసిపోయారు, అందుకే అంత గాఢంగా నిద్రపోతున్నారు అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నట్లే.గురకను తేలికగా తీసుకోవడం అంటే, ప్రాణాలను పణంగా పెట్టడమే అని తాజా పరిశోధనలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఒక భారీ శాస్త్రీయ అధ్యయనం గుండె జబ్బులకు, గురకకు మధ్య ఉన్న భయంకరమైన సంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస ఆగిపోవడం) అనే సమస్యతో బాధపడేవారికి, సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర కారణాల వల్ల అకాల మరణం సంభవించే ప్రమాదం ఏకంగా 71 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)అంటే ఏమిటి?
ఇది నిద్రకు సంబంధించిన ఒక ప్రమాదకరమైన రుగ్మత. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు మన గొంతులోని కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. కానీ ఈ సమస్య ఉన్నవారిలో ఆ కండరాలు అవసరానికి మించి సడలిపోయి, శ్వాసనాళాలకు అడ్డుపడతాయి. దీనివల్ల గాలి ఆడుకోక నిద్రలో పదేపదే శ్వాస ఆగిపోయి, మళ్లీ వస్తుంటుంది.
ఈ ప్రక్రియలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు..నిద్రలో భయంకరమైన శబ్దంతో గురక పెట్టడం, శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవ్వడం, రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పి, రోజంతా విపరీతమైన నిద్రమత్తు, అలసట ఆవహించడం.
ఊబకాయం..ఈ సమస్యకు ఆజ్యం పోసే ప్రధాన కారణం
స్లీప్ అప్నియాకు, అధిక బరువుకు అవినాభావ సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లండన్‌లోని ప్రసిద్ధ ఇంపీరియల్ కాలేజ్ హెల్త్ పార్ట్‌నర్స్ కు చెందిన ప్రముఖ పరిశోధకురాలు, ఈ అధ్యయన సహ రచయిత్రి హీథర్ ఫిట్జ్ కే మాట్లాడుతూ..ఊబకాయంతో బాధపడేవారికి ఈ వ్యాధి ముప్పు అత్యధికంగా ఉంటుందని హెచ్చరించారు.
గణాంకాలను పరిశీలిస్తే, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వారిలో దాదాపు 40 నుండి 70 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నవారే కావడం గమనార్హం. అంతేకాకుండా,సాధారణ బరువు ఉన్నవారికంటే లావుగా ఉన్నవారిలో ఈ స్లీప్ అప్నియా లక్షణాలు మరింత తీవ్రంగా, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
నమ్మలేని నిజం
ఈ నిర్ధారణకు రావడం కోసం శాస్త్రవేత్తలు చాలా లోతైన విశ్లేషణ చేశారు. ఏకంగా 29 లక్షల మంది ప్రజల ఆరోగ్య రికార్డులను వారు అధ్యయనం చేశారు. ఇందులో స్లీప్ అప్నియాతో బాధపడుతున్న 20,300 మంది రోగుల డేటాను, 97,412 మంది సంపూర్ణ ఆరోగ్యవంతుల డేటాతో సరిపోల్చి చూశారు.
ఈ విశ్లేషణలో ఒక నమ్మలేని నిజం బయటపడింది. స్లీప్ అప్నియా ఉన్నవారిలో సగానికి పైగా, అంటే 57.2 శాతం (11,613 మంది) తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్నవారే. అమెరికా వెలుపల ఈ వ్యాధిపై ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత భారీ అధ్యయనం ఇదేనని హీథర్ ఫిట్జ్ కే స్పష్టం చేశారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
