నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్‌లో ఏం తినాలో తెలుసా.?

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మంది గుండె పోటుకి గురవుతున్నారు. ఒకప్పుడు 50, 60 ఏళ్లు దాటిన వారిలో గుండె సంబంధిత సమస్యలు కనిపించేవి. కానీ ఇప్పుడు ముప్పై ఏళ్లు అయినా నిండకముందే దీని బారిన పడుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఎక్కువగా నిద్రలోనే గుండెపోటుకి గురవుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆలోచనే భయంకరంగా ఉంటుంది. అసలు నిద్రలో హార్ట్‌ స్ట్రోక్‌ ఎందుకు వస్తుంది.. ఈ సమస్యను ఎలా నివారించాలి.. నిపుణుల సలహాలు తెలుసుకుందాం..

These foods must be in your dinner to prevent a heart attack during sleep

నిద్రలో హార్ట్‌స్ట్రోక్‌

నిద్రలో వచ్చే సడెన్‌ హార్ట్‌ అటాక్‌కి, రాత్రి భోజనానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సమస్య బారి నుంచి కాపాడుకునేందుకు రాత్రి భోజనం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాసెస్‌డ్ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌, శారీరక శ్రమ లేకపోవడం వంటివి గుండెపోటుకి దారితీస్తాయి. డిన్నర్‌లో ఏం తింటున్నాం.. ఏం తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు.

ఎంతో ఇష్టంగా మటన్‌ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్‌ తిన్నారో ఇక అంతే సంగతులు.!ఎంతో ఇష్టంగా మటన్‌ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్‌ తిన్నారో ఇక అంతే సంగతులు.!

రాత్రి భోజనం

రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఫైబర్‌, ఆకుకూరలు తీసుకోవడం ద్వారా గాఢమైన నిద్ర పడుతుందని.. దీని ద్వారా హార్ట్‌ బీట్‌ మెరుగువుతుందని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఈ ఆహారం ద్వారా శరీరానికి సరిపడా విశ్రాంతి లభిస్తుంది. బీన్స్‌, కాయగూరలు, పండ్లు, నట్స్‌ వంటి మొక్కల ఆధారిత పదార్థాలను భోజనంలో చేర్చుకుంటే మంచి నిద్రకు సహకరిస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.

అయితే కేవలం రాత్రి భోజనం మాత్రమే గుండెపోటు ప్రమాదాన్ని నివారించదని.. ఆహారపు అలవాట్లు, నిద్ర, రాత్రిసమయంలో హార్ట్‌ బీట్‌ రేట్‌కి సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్రతో పాటు గుండె ఆరోగ్యం కోసం రోజంతా ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం, జీవనశైలి, షుగర్‌ లెవెల్స్‌ ఇవన్నీ కీలకపాత్ర పోషిస్తాయి.

These foods must be in your dinner to prevent a heart attack during sleep

డిన్నర్‌లో ఏం తీసుకోవాలి..

ముఖ్యంగా డిన్నర్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉండే చిక్కుళ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పోషకాల సమ్మేళనం నిండిన బాదం, వాల్‌నట్స్‌ను సరైన మోతాదులో తీసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ప్రాసెస్‌ చేయకుండా ఉండేలా చూసుకోవడం ద్వారా వాటి సత్ఫలితాలు అందుతాయి.

రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!

ఈ క్రమంలో భోజనంలో ఎక్కువగా ఫైబర్‌ తీసుకున్న వారిలో గాఢ నిద్ర 0.59 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా హార్ట్‌బీట్‌ రేటు కూడా నిమిషానికి సుమారు 1.14 బీట్స్‌ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో రాత్రి శరీరం బాగా విశ్రాంతి తీసుకుని యాక్టివ్‌గా నిద్ర లేవడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా భోజనానికి, నిద్రకి మధ్య కనీసం గంట సేపైనా విరామం ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే యాసిడ్‌ రిఫ్లక్స్‌, గుండెలో మంటకి దారితీయవచ్చు.

కేవలం రాత్రి భోజనంపైనే దృష్టి సారించకుండా పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, షుగర్ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉండటం చాలా అవసరం. రోజూ కొంత సమయం వ్యాయామం కూడా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, September 26, 2026, 10:50 [IST]
Desktop Bottom Promotion