Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధులకు లైఫ్‌స్టైల్‌లో మార్పులే ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం మొదట్లో కనిపించకపోయినా వాటి తాలూకు ప్రభావాలు జీవితాంతం వెంటాడుతాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన విధానాలు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో పురుషులు చేసే ఈ పొరపాట్లు వారిలో గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి ఆ పొరపాట్లు ఏంటి.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలి.. తెలుసుకుందాం..

వారాంతాల్లో భోజన వేళలు
చాలా మంది పురుషుల జీవనశైలి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒకేవిధంగా సాగుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం ఇలా అన్నీ ఆ ఐదు రోజుల పాటు క్రమ పద్ధతిలో సాగుతాయి. కానీ వారాంతాలు శని, ఆదివారాలు వచ్చేనాటికి ఆ రెండు రోజులు డైలీ రొటీన్ మొత్తం మారిపోతుంది. ఆలస్యంగా నిద్ర లేవడం, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం, ఏకంగా లంచ్ చేయడం, రాత్రి ఆలస్యంగా డిన్నర్ చేయడం చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఈ రెండో రోజులు స్వేచ్ఛగా ఉండాలనుకునే వారి అభిప్రాయం శరీరంపై ఊహించని రీతిలో పరిణామాలు తీసుకువస్తుందని అంచనా వేయలేరు. ఈ చిన్నపాటి వారాంతపు అలవాట్లు వారిలో తీరని ప్రమాదాలకు దారితీస్తాయని కార్డియాలజిస్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈటింగ్ జెట్ లాగ్
వారాంతాల్లో స్వేచ్ఛగా ఉండాలని జీవనశైలి మార్చుకుంటే అది మొదటికే ముప్పుగా మారుతుంది. ఫ్రాన్స్‌లో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలపై ఎనిమిదేళ్ల పాటు జరిపిన పర్యవేక్షణలో వారి జీవనశైలి గుండె ఆరోగ్యంపై ఎలా ఉంటుందో వెల్లడైంది. వీక్ డేస్‌కి, వీకెండ్ డేస్‌కి భోజన సమయాల్లో వచ్చే మార్పను 'ఈటింగ్ జెట్ లాగ్’ అంటారు. సాధారణ రోజుల్లో రాత్రి 9 లోపు భోజనం చేస్తే వారాంతాల్లో మాత్రం రాత్రి 10 తర్వాత భోజనం చేసే అలవాటును గుర్తించారు.

ఈ క్రమంలో వారం మొత్తం ఒకే సమయంలో భోజనం చేసే వారితో పోలిస్తే ఆలస్యంగా చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. ప్రతి గంట తేడా గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 14 శాతం పెంచితే, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం 21 శాతం పెరిగినట్లు కనుగొన్నారు.

అయితే మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. అయితే పురుషుల్లో గుండె జబ్బులకు ఇదే ప్రధాన కారణం కాదని.. గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం కూడా కొంత ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో పురుషులు తమ జీవనశైలి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
