Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఆ రోజును మనం ఎలా ప్రారంభిస్తున్నామనేది చాలా ముఖ్యం. ఉదయం పూట మనం పాటించే లైఫ్ స్టైల్ ఆ రోజు ఎలా ఉంటున్నాం.. ఎంత చురుగ్గా పనిచేస్తున్నామనేది నిర్ణయిస్తుంది. అందుకోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, డైట్ పాటించడం మాత్రమే కాదు.. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ చిన్న అలవాటును రోజువారీ జీవితంలో చేర్చుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని.. ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. రాత్రి సమయంలో నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల శరీరానికి సరిపడా నీరు అందదు. దీంతో ఉదయాన్నే నిద్ర లేవగానే డీహైడ్రేడెట్‌గా అనిపిస్తుంది. అందుకే నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటంటే..
అదుపులో శరీర ఉష్ణోగ్రత
మార్నింగ్ ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మన బాడీకి పోషకాలు సరిగ్గా అందడానికి, మెరుగైన జీవక్రియ కంసో శరీరం తేమగా ఉండాలి. అందుకే పరగడుపున నీళ్లు తాగడంతో పాటు రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల మెటబాలిజం మెరుగవుతుంది. ఖాళీ కడుపున నీరు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగై మలబద్ధకం సమస్యను నివారించవచ్చు.
అలసట, నీరసం
సరిపడా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కి దారితీస్తుంది. పదేపదే దాహం వేయడం, నోరు ఎండిపోవడం, అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం, నీరసం వంటి లక్షణాలు బాధిస్తాయి. అందుకే వ్యాయామం తర్వాత తప్పనిసరిగా సరిపడా నీళ్లు తాగి మీ డైలీ రొటీన్‌ను ప్రారంభించండి.

శరీరంలో నీటి శాతం తగ్గితే మెదడు పనితీరు సరిగా ఉండదు. ఏకాగ్రత లోపించడంతో పాటు మానసికంగా సమస్యలు తలెత్తుతాయి. ఉదయాన్నే సరిపడా నీటిని తాగడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. నిద్రలేమి సమస్యను సైతం నివారిస్తుంది.
శరీరంలో వ్యర్థాలను తొలగించేందుకు, శరీరంలో నీటి సమతుల్యతను కాపాడేందుకు మూత్రపిండాలు బాగా పనిచేయడం అవసరం. అందుకే సరైన మోతాదులో నీటిని తీసుకోవాలి. దీని ద్వారా మూత్రపిండా పనితీరు మెరుగవతుంది. అయితే కిడ్నీ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు శరీరానికి సరిపడా మంచి నీరు తీసుకోవాలి. పరిమితికి మించితే కిడ్నీలు రిస్క్‌లో పడే ప్రమాదం ఉంది. సోడియం లెవెల్స్ పెరిగి మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
