అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా?

భారతీయ వంటకాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రకరకాల మసాలాలు. కానీ ఆ మసాలాల రుచిని రెట్టింపు చేయడంలో మన దేశంలో వాడే వివిధ రకాల వంట నూనెల పాత్ర కూడా చాలా ఉంది. వాటిలో ఆవ నూనె స్థానం అత్యంత ప్రత్యేకమైనది. రోజువారీ వంటల నుంచి నోరూరించే పచ్చళ్ల తయారీ వరకు, అలాగే ఎన్నో సాంప్రదాయ వంటకాల్లోనూ దశాబ్దాలుగా ఆవ నూనెదే పైచేయి.

అయితే మన ఇళ్లలో వంటల కోసం ఎంతో ఇష్టంగా వాడే ఈ ఆవ నూనెను అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వంటనూనెగా వాడటంపై నిషేధం ఉందన్న ఆశ్చర్యకరమైన విషయం మీకు తెలుసా?

Is Mustard Oil Safe for Cooking The Truth Behind the FDA Ban in America

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిబంధనల ప్రకారం..ఆవ నూనెను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందుకే అక్కడ సూపర్ మార్కెట్లలో దొరికే ఆవ నూనె బాటిళ్లపై కేవలం బాహ్య వినియోగానికి మాత్రమే (For External Use Only) అని స్పష్టంగా రాసి ఉంటుంది.

ఇంతకీ FDA ఎందుకు అలా చెబుతోంది?

ఎరుసిక్ యాసిడ్ అనేది ఒక మోనోఅన్‌ శాచురేటెడ్ ఒమేగా-9 కొవ్వు ఆమ్లం. ఇది ఆవాలు, రేప్‌ సీడ్ వంటి గింజల నూనెల్లో సహజంగానే ఉంటుంది. అసలు సమస్య ఆ నూనెలో ఆమ్లం ఉండటంతో కాదు, అది ఉండే మోతాదుతోనే వస్తోంది.

ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. జంతువులపై చేసిన కొన్ని ప్రయోగాల్లో.. ఎరుసిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకుంటే గుండె కండరాలలో కొవ్వు పేరుకుపోయి, గుండె జబ్బులకు దారి తీస్తుందని తేలింది. ఈ భయంతోనే అమెరికా, యూరప్ దేశాలు దీనిని తమ వంటగదుల నుంచి దూరం పెట్టాయి.

మన్ కీ బాత్‌ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!మన్ కీ బాత్‌ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!

భారత్ లో రోజూ వాడే ఆవ నూనె ప్రమాదకరమేనా?

అస్సలు కాదు. ఎందుకంటే, కేవలం జంతువులపై చేసిన ప్రయోగాల ఫలితాలను నేరుగా మనుషులకు ఆపాదించడం శాస్త్రీయంగా సరైనది కాదని కొందరు నిపుణులు స్పష్టం చేశారు.

ఎరుసిక్ యాసిడ్ భయాలన్నీ కేవలం జంతువుల అధ్యయనాల నుంచే పుట్టుకొచ్చాయని, అంతేకాకుండా భారతదేశంలో పండే ఆవాలు, దొరికే ఆవ నూనె రకాలు, మనం వంటల్లో దానిని ఉపయోగించే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మనం నూనెను పొగ వచ్చేలా మరిగించి, మితమైన పరిమాణంలో వాడతాం కాబట్టి ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు.

సహజంగానే ఏ దేశానికి ఉండే ఆహార భద్రతా చట్టాలు ఆ దేశానికి ఉంటాయి. అమెరికా కేవలం ఒక ఆమ్లం శాతాన్ని బట్టి నిర్ణయం తీసుకుంది. కానీ,భారతదేశంలో వందల ఏళ్లుగా ఆవ నూనెను వంటల్లో అత్యంత సురక్షితంగా వాడుతున్నారు. మన దేశపు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) ఆహార ప్రమాణాలకు ఇది అనుగుణంగా ఉంటుంది. కాబట్టి అమెరికాలో బ్యాన్ చేశారని మన ఆవ నూనెను చూసి భయపడాల్సిన పనే లేదు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, September 28, 2026, 21:45 [IST]
Desktop Bottom Promotion