Latest Updates
-
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
రోజువారీ ఆహారంలో ప్రొటీన్ తప్పనిసరి. కండరాల నిర్మాణానికి, బలమైన శరీరం కోసం, కణజాలాల మరమ్మత్తు, ఎంజైమ్‌లు, హార్మోన్ల ఉత్పత్తి, ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు, మెటబాలిజం ఇలా ప్రతిదానికీ ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రొటీన్ కోసం చికెన్ ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. కానీ ప్రొటీన్ కోసం చికెన్ ఒక్కటే కాదు.. వివిధ రకాల ఆహార పదార్థాల్లోనూ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. చికెన్ తినని వారు వీటిని ఆహారంలో చేర్చుకుంటే ప్రొటీన్ పుష్కలంగా అందుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో చూద్దాం..

గ్రీక్ యోగర్ట్
గ్రీక్ యోగర్ట్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. సుమారు 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్‌లో 10 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. పుష్కలంగా కాల్షియం కూడా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు, నట్స్‌తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పార్మిజాన్ చీజ్
100 గ్రాముల చీజ్‌లో 30- 35 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం, పాస్ఫరస్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు, కొవ్వులు అధికంగా ఉన్న కారణంగా దీనిని మితంగా తీసుకోవడం మంచిది. సలాడ్లు, పాస్తా, సూప్‌లలో మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కాటేజ్ చీజ్
నాన్‌వెజ్ తినని వారు తమ ఆహారంలో కాటేజ్ చీజ్ చేర్చుకోవడం ద్వారా ప్రతి 100 గ్రాముల చీజ్‌లో 12 గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది. ఇందులో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలతో వీటిని తీసుకోవడం ద్వారా పోషకాలు బాగా లభిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్‌లోకి మంచి ఆప్షన్.
యెల్లోఫిన్ ట్యూనా
సముద్రపు ఆహారం యెల్లోఫిన్ ట్యూనాలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల వండిన ట్యూనాలో 30 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. ఇంకా ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. సలాడ్లు, శాండ్‌విచ్‌లతో వీటిని తీసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో సరైన మొత్తంలో ప్రొటీన్ తీసుకోవడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, శరీరం బలంగా ఉండేందుకు దోహదపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications

