Latest Updates
-
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!
ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని మాటలను మన్ కీ బాత్ అనే రేడియో కార్యక్రమం ద్వారా దేశప్రజలతో పంచుకుంటారు. ఈ క్రమంలో సెప్టెంబర్ నెల చివరి ఆదివారం రోజు అయిన సెప్టెంబర్ 27న జరిగిన 138వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ..ఉసిరికాయ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తరతరాలుగా మన ఇళ్లలో ఉసిరి.. ఊరగాయలు, జామ్ లు, జ్యూస్, చ్యవన్‌ప్రాష్ రూపంలో ఎలా భాగమైందో మోదీ గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ ఉసిరి సాగుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని, ఇది రైతులకు, ముఖ్యంగా మహిళలకు కొత్త ఆర్థిక అవకాశాలను కల్పిస్తోందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

ఉసిరి కేవలం పండు కాదు, పోషకాల గని. ఆయుర్వేదంలో దీనికి విశేష స్థానం ఉంది. ఒక నారింజ పండుతో పోలిస్తే ఉసిరిలో ఏకంగా 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఉసిరితో మన శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూడండి.
రోగనిరోధక శక్తికి బ్రహ్మాస్త్రం
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక వ్యవస్థను ఉక్కులా మారుస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా లోపలి నుంచి శరీరాన్ని బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థకు దివ్యౌషధం
ఉసిరిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించి, జీర్ణ ఎంజైమ్ లను చురుకుగా మారుస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి పొట్టను సహజంగా చల్లగా ఉంచుతుంది.

యవ్వనమైన చర్మం, ఆకర్షణీయమైన జుట్టు
ఉసిరిలోని యాంటీ ఏజింగ్ గుణాలు వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతాయి. అంతేకాదు, చిన్న వయసులోనే జుట్టు నెరవడాన్ని అరికట్టి, కేశ కుదుళ్లను దృఢంగా మార్చి, చుండ్రును సమూలంగా తరిమికొడుతుంది.
మధుమేహానికి చెక్
ఉసిరిలో ఉండే క్రోమియం అనే ఖనిజం కణాలు ఇన్సులిన్ కు వేగంగా స్పందించేలా చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఇది ఒక వరం లాంటిది.
గుండెకు శ్రీరామరక్ష
ఉసిరి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి, ధమనుల్లో పూడికలు (పాచి) పేరుకుపోకుండా కాపాడుతుంది.
ఐరన్ శోషణను పెంచుతుంది
పాలకూర, చిక్కుళ్లు, రాగులు వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటు ఉసిరిని తీసుకుంటే.. శరీరానికి అవసరమైన ఐరన్ మన దేహం చాలా సులభంగా, వేగంగా గ్రహిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
ఉసిరిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా తేలిక. ఉదయాన్నే ఉసిరి రసం తాగడం ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. ఇది కాకుండా.. మీ ఇష్టానుసారం ఉసిరి చట్నీ, తీయ్యటి ఉసిరి మురబ్బా, ఉసిరి ఊరగాయ లేదా ఉసిరి పొడి రూపంలో కూడా ప్రతిరోజూ తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
