నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా..

Posted By:

సాయంత్రం కాగానే ఏదైనా వేడిగా, రుచిగా, కొద్దిగా స్పైసీగా తినాలనిపించడం సహజం. అలాంటప్పుడు వంటగదిలో ఎక్కువ గంటలు కష్టపడకుండా, కేవలం నిమిషాల్లో తయారు చేసుకోగలిగే అద్భుతమైన స్నాక్ కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్. కరకరలాడే బ్రెడ్, కరిగిన చీజ్, తియ్యటి స్వీట్ కార్న్, స్పైసీ చిల్లీ ఫ్లేక్స్ కలయికతో ఇది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది.

పిల్లల స్కూల్ బాక్స్ నుంచి పెద్దల ఈవినింగ్ టీ టైమ్ వరకు ప్రతి ఒక్కరూ దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే. ఈ రుచికరమైన స్నాక్‌ను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Quick Easy Corn Chilli Cheese Toast Recipe for Evening Snack

కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్ తయారీకి కావలసిన పదార్థాలు

బ్రెడ్ స్లైసెస్ - 3 లేదా 4
తురిమిన చీజ్ - అర కప్పు
ఉడికించిన స్వీట్ కార్న్ - అర కప్పు
క్యాప్సికమ్ - అర కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
మిక్స్డ్ హెర్బ్స్ - 1 టీస్పూన్
ఒరెగానో- అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
చాట్ మసాలా - అర టీస్పూన్
వెన్న - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు

కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్ తయారీ విధానం

-ముందుగా స్వీట్ కార్న్‌ ను కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడకబెట్టి చల్లారనివ్వండి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఉడికించిన స్వీట్ కార్న్, తురిమిన చీజ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఆ తర్వాత అందులోనే మిక్స్డ్ హెర్బ్స్, ఒరెగానో, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి.. అన్ని పదార్థాలు బాగా కలిసేలా మిక్స్ చేయండి.

-ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. మీకు ఇష్టమైతే బ్రెడ్ చుట్టూ ఉన్న గోధుమ రంగు అంచులను కత్తిరించుకోవచ్చు. ఇష్టం లేకపోతే అలాగే ఉంచేయొచ్చు.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ లేదా పెనం పెట్టండి. దానిపై కొద్దిగా వెన్న వేసి కరిగించండి. బ్రెడ్ స్లైసెస్‌ను పాన్‌ పై ఉంచి, ఒక వైపు కొద్దిగా కాల్చండి.

-బ్రెడ్ కాలిని వైపున.. ముందుగా సిద్ధం చేసుకున్న కార్న్-చీజ్ మిశ్రమాన్ని బ్రెడ్ అంతటా సమానంగా పరచండి. ఇప్పుడు పాన్‌ పై ఒక మూత పెట్టి, మంటను తక్కువగా ఉంచండి. కచ్చితంగా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచితే, బ్రెడ్ పైభాగంలో ఉన్న చీజ్ చక్కగా కరిగిపోయి, కింద బ్రెడ్ క్రిస్పీగా మారుతుంది.

-అంతే గుమగుమలాడే వేడివేడి కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ. దీన్ని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని, మీకు నచ్చిన ఆకారం కత్తిరించుకోండి. టొమాటో కెచప్ లేదా సాస్‌ తో అద్దుకుని తింటే దీని రుచి అమోఘం.

[ of 5 - Users]
Story first published: Monday, September 28, 2026, 20:45 [IST]
Desktop Bottom Promotion