Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
పిచ్చిమొక్కలా కనిపించే దీని ప్రయోజనాలు అద్భుతం..హైబీపీ,లివర్,షుగర్ వ్యాధులకు నేచురల్ మెడిసిన్ ఇదే
మన ఇంటి చుట్టుపక్కల, రోడ్ల పక్కన కనబడే కొన్ని ఆకులు లేదా మొక్కలను పిచ్చి మొక్కలుగా భావించి వాటి గురించి పట్టించుకోరు చాలామంది., కొందరు అయితే పీకి అవతల పడేస్తుంటారు. అయితే చాలామంది పిచ్చివని భావించే మొక్కల్లో కొన్ని ఆరోగ్యానికి అమృతంలా పనిచేసేవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో తిప్ప తీగ ఒకటి. తిప్ప తీగ అనేది ఒక రకమైన తీగ మొక్క. ఇది ఇతర చెట్లపై పాకుతూ పెరుగుతంది. గ్రామాల్లో అయితే ఇళ్ల చుట్టుపక్కల,ఇతర బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తుంది.
తిప్పతీగ ఆకులు అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క ముక్కల్లో చెప్పిలంటే తిప్పలన్నింటినీ తిప్ప తీగ మాయం చేసేస్తుంది. ఆయుర్వేదంలో కూడా డీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనిని ఆయుర్వేదంలో అమృతవల్లి అని పిలుస్తుంటారు..దీనర్థం అమృతాన్ని అందించేదని. తిప్పతీగనే కాదండోయ్..దాన్ని కాండాన్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి క్యాప్యూల్స్, జ్యూస్, పౌడర్ తయారుచేస్తుంటారు. అసలు తిప్ప తీగ వల్ల మనకు కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏంటీ?దానిని ఎలా వాడాలు వంటి వివరాలను ఇక్కడ చూడండి.

షుగర్ కంట్రోల్
ప్రస్తుతం మనదేశం షుగర్ పేషెంట్లకు రాజధానిగా మారిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో షుగర్ పేషెంట్లు ఉన్నారు. షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గంచే ఏ మెడిసిన్ ఇప్పటిదాకా లేదు..దఇది ఒక్కసారి వస్తే కంట్రోల్ లో ఉంచడమే మార్గం. అయితే తిప్పతీగ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచి, షుగర్ పేషెంట్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.
విష జ్వరాలకు దివ్యౌషధం
వానాకాలంలో వచ్చే చాలా వ్యాధులకు ఇది సంజీవనిలా పనిచేస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలు..ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి విష జ్వరాలను తగ్గించడంలో తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఆకుల కషాయం తాగడం వల్ల శరీరంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగి జ్వరం త్వరగా అదుపులోకి వస్తుంది.
రోగనిరోధక శక్తికి రక్షణ కవచం
తిప్పతీగలో ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేసి, తరచుగా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
ఇతర ప్రయోజనాలు
ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, అజీర్తి, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి, చర్మ సమస్యలను నివారించి చర్మానికి కొత్త నిగారింపును ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
వాడే విధానం
తిప్పతీగ కాండాన్ని లేదా ఆకులను నీటిలో మరిగించి కషాయంలా తాగవచ్చు. దీని పొడి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అయితే, దీనిని వాడే ముందు డాక్టర్ లేదా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
