Latest Updates
-
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు!
నోటి పూతలతో ఏం తినాలన్నా ఇబ్బందే.. ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో ఇట్టే రిలీఫ్.!
నోటి పూతలు చూడటానికి సాధారణంగానే కనిపిస్తాయి. కానీ అత్యంత సున్నితమైన ప్రాంతంలో కలిగే ఈ నోటిపూత నిరంతరం బాధిస్తూ ఉంటుంది. నాలుకపై, పెదవుల లోపల, చిగుళ్లు, బుగ్గల లోపల చిన్న చిన్న పుండ్ల మాదిరిగా ఏర్పడతాయి. వీటినే మౌత్ అల్సర్లు అంటారు. ఇవి కలిగినప్పుడు తినడం, మాట్లాడటంతో నీళ్లు తాగినా నొప్పితో విలవిల్లాడుతుంటారు.

లో ఫీవర్ వచ్చినప్పుడు, ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోవడం, నోటికి దెబ్బ తగలడం, విటమిన్ బి12 లోపం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ తగ్గిపోవడం కారణంగా నోటి పూతలు ఏర్పడే అవకాశం ఉంటుందని డెంటిస్ట్ నిపుణులు అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
నోటి పూతలు ఏర్పడినప్పుడు చాలా వరకు వారం నుంచి రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు, సరైన సంరక్షణ ద్వారా వేగవంతంగా నొప్పిని తగ్గించడంతో పాటు పుండ్లు మానేలా చేయవచ్చుు. అందుకు సంబంధించిన సలహాలను నిపుణుల అభిప్రాయం మేరకు చూద్దాం..
వీటికి దూరంగా ఉండండి..
నోటిలో పుండ్లు ఏర్పడినప్పుడు మసాలా, కారంలాంటి ఘాటైన పదార్థాలకు దూరంగా ఉండండి. వీటిని తింటే పుండ్లపై ప్రభావం మరింత పడుతుంది. సాధారణ సమయాల్లో కంటే ఎక్కువగా రోజుకు నాలుగు సార్లు గోరు వెచ్చని నీటితో నోటిని పుక్కిలించండి. దీని ద్వారా పుండ్లు త్వరగా మానిపోయే అవకాశం ఉంటుంది. డీ హైడ్రేషన్‌కి గురైతే నోరు తడారిపోయి మంట పుడుతుంది. అందుకే రోజుకి 3 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి.
గట్టిగా ఉండే ఆహార పదార్థాలను తినకండి. దీని వల్ల పుండ్లపై ఒత్తిడి పడుతుంది. మెత్తగా ఉండే చల్లటి ఆహారం తీసుకోవడం ద్వారా పుండ్లపై బలం పడకుండా ఉంటుంది. సిట్రస్ పండ్లను నొప్పి తగ్గే వరకు తినడం మానుకోండి. ధూమపానం, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలి. వేడిగా ఉన్న టీ లేదా కాఫీ తాగడం మానుకోండి. ముఖ్యంగా నోటి పరిశుభ్రత పాటించాలి. బ్రష్ చేసేటప్పుడు మృదువైన పళ్లు ఉన్న టూత్ బ్రష్‌ను మాత్రమే వాడండి. నోటి నొప్పీ తీవ్రంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. వారి సలహా మేరకు నొప్పి నివారణ జెల్‌ను పూయడం ద్వారా ఉపశమనం ఉంటుంది.

నివారణకి ఇంటి చిట్కాలు
గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు కలిపి నోటిని బాగా పుక్కిలించండి. ఇలా చేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్ ప్రభావం తగ్గుతుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగి పుండ్లు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
నోటి పూతలకి తేనె సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నోటి పుండ్లపై రోజుకి 3 సార్లు తేనెను పూయడం వల్ల ఉపశమనం కలిగి పుండ్లు త్వరగా మానడానికి దోహదపడుతుంది. తేనె అందుబాటులో లేనప్పుడు కొబ్బరి నూనెని సైతం వాడవచ్చు. ఇది వాపును తగ్గిస్తుంది.
గ్లాసు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలిపి నోటితో పుక్కిలించాలి. దీని వల్ల మీ బాడీలో pH సమతుల్యంగా ఉండి పుండ్లు మానడానికి దోహదపడుతుంది. పుండ్లు ఉన్న ప్రాంతాల్లో చల్లని నీరు, ఐస్ ముక్కలు పెట్టడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇంటి నివారణ చిట్కాలతో ఫలితం కలగనప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. నోటి పూత రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉన్నా.. బొబ్బలు పదే పదే ఏర్పడుతున్నా, పెద్దగా ఉన్నా అజాగ్రత్త వహించొద్దు. ఈ సమయంలో అధిక జ్వరంతో బాధపడుతున్నా.. భోజనం, నీరు మింగడంలో ఇబ్బంది పడుతున్నా.. వెంటనే వైద్యుడిని సంప్రదించి వారి సలహాలు పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications