Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
ఈ విధంగా నడిస్తే అద్భుతాలు జరుగుతాయ్..భుజాల, నడుము నొప్పికి గుడ్ బై!
ఏదో ఒక విధంగా మనం రోజూ నడుస్తుంటాం. ఆఫీసులో అటు ఇటూ తిరగడం లేదా ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లడం లేదా పనుల మీద బయటకు వెళ్లడమైనా ఏదో ఒకరంగా రోజులో కొంతసమయం నడుస్తాం. నడక వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అని తరుచుగా డాక్టర్లు, నిపుణులు కూడా చెబుతుంటారు. రోజూ నడక వల్ల ఆరోగ్యానికి మంచిదని,చాలా ప్రయోజనాలుంటాయని తరచూ చెబుతుంటారు. అయితే మనం ఎప్పుడూ ముందడుగే వేస్తుంటాం. కానీ ఎప్పుడైనా వెనక్కి నడవడం గురించి ఆలోచించారా?
వెనక్కి నడవడాన్ని రెట్రో వాకింగ్ అంటారు. ముందుకు నడవడంతో పాటుగా వారానికి 3 సార్లు అయినా కనీసం 15 నిమిషాల పాటు వెనక్కి నడవడం వల్ల అంటే రివర్స్ లో నడవడం వల్ల అద్బుతాలు జరుగుతాయని, మోకాళ్లుకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని, ఆర్థ్రరైటిస్ తగ్గుతుందని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హార్ట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ముఖర్జీ మదివాడ ఓ వీడియోలో తెలిపారు. అంతేకాకండా వెనక్కి నడవడం వల్ల బ్యాలెన్స్ పెరుగుతుందని, కో ఆర్టినేషన్ పెరుగుతుందని చెప్పారు. వయస్సు పెరిగే కొద్ది రివర్స్ వాకింగ్ వల్ల చాలా ప్రయోజనముంటదని తెలిపారు. రెట్రో వాకింగ్ వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

నిద్రిస్తున్న కండరాలకు కొత్త ఉత్సాహం
సాధారణంగా మనం ముందుకు నడిచేటప్పుడు మన తొడ వెనుక కండరాలు, పిరుదుల కండరాలు పనిచేస్తాయి. అయితే వెనక్కి నడిచేటప్పుడు..సాధారణంగా అంతగా ఉపయోగపడని తొడ ముందు కండరాలు(క్వాడ్రిసెప్స్),పిక్కలు, షిన్ కండరాలు యాక్టివ్ గా పనిచేస్తాయి. దీంతో శరీరంలోని కండరాల మధ్య బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఇది కండరాల బలాన్ని పెంచడమే కాకుండా కండరాల నొప్పులు,గాయాల బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. మీ కాళ్లలో కొత్త శక్తి వచ్చిన అనుభూతి వస్తుంది.
ఎక్కువ కేలరీల ఖర్చు
సాధారణ నడకతో పోల్చితే వెనక్కు నడవడం వల్ల దాదాపు 40 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇది మన శరీరానికి కొత్త సవాలు కాబట్టి గుండే వేగంగా కొట్టుకుంటుంది, ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. బరువు తగ్గాలనుకునేటోళ్లకు ఇది అద్భుత మార్గం. వెనక్కి నడిచేటప్పుడు మనం నేచురల్ గానే మన వెన్నుముకను నిటారుగా ఉంచుతాం. ఇది మన శరీర భంగిమను మెరుగుపర్చడానికి సాయపడుతుంది. రోజంతా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల వచ్చు భుజాల నొప్పులు, నడుము నొప్పిని తగ్గించడంలో కూడా రెట్రో వాకింగ్ ప్రభావవంతంగా సాయపడుతుంది.
మోకాళ్ల నొప్పులకు చెక్
వయస్సు పెరిగే కొద్దీ చాలామందికి ఉండే సమస్య మోకాళ్ల నొప్పులు. ముందుకు నడిచేటప్పుడు మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అయితే వెనక్కి నడిచేటప్పుడు మనం ముందుగా కాలి వేళ్లపై అడుగు వేసి ఆ తర్వాత మడమను నేలపై ఉంచుతాం. ఈ ప్రక్రియ మోకాళ్ల కీళ్లపై ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా మోకాళ్లకు సపోర్ట్ గా ఉండే క్వాడ్రిసెప్స్ కండరాలు బలపడటం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఫిజియోథెరపిస్టులు కూడా మోకాళ్ల గాయాల నుంచి కోలుకుంటున్నోళ్లకు ఈ వ్యాయామాన్ని సూచిస్తుంటారు.
మెదడుకు మేత, శరీరానికి వ్యాయామం
ముందుకు నడవడం మన మెదడుకు ఒక ఆటోమేటిక్ ప్రక్రియ. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కానీ వెనక్కి నడవాలంటే మన మెదడు చాలా అప్రమత్తంగా ఉండాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాలి, అడుగులో అడుగు వేయాలి. ఈ ప్రక్రియ మెదడులోని కొత్త నరాల కనెక్షన్లను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఏకాగ్రత, శరీర సమతుల్యత, సమన్వయం మెరుగుపడతాయి. ఇది ఒకేసారి శారీరక, మానసిక వ్యాయామం లాంటిది.
ఇది గుర్తుంచుకోవాలి
వెనక్కి నడుస్తున్నప్పుడు సేఫ్ ప్లేస్ చూసుకోవడం చాలా ముఖ్యమని కూడా గుర్తుంచుకోవాలన్నారు. లేకుంటే వెనక్కి పడిపోయి లేనిపోని ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి వెనకాల ఏవీ అడ్డంకులు లేకుండా చూసుకొని నడవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల గుండె పరంగా, మోకాళ్ల పరంగా కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభాస్తాయని చెప్పారు. మొదట 5 నిమిషాలతో ప్రారంభించి, నెమ్మదిగా సమయాన్ని పెంచుకోండి. మీ సాధారణ వాకింగ్ లో భాగంగా కొన్ని నిమిషాలు వెనక్కి నడవండి. మీ వీపును నిటారుగా ఉంచి, తల పైకి ఎత్తి, అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ నడవండి. అవసరమైతే ప్రారంభంలో గోడ పట్టుకుని లేదా స్నేహితుడి సహాయంతో నడవండి. బ్యాలెన్స్ అలవాటయ్యాక సొంతంగా ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications