Latest Updates
-
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.! -
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.!
బిగువైన బ్రాసరీలు ధరిస్తే....!

1. గాలి చొరదు - ఈ విషయాన్ని మనం సరిగా గ్రహించం. ఫ్యాషన్ కొరకు ఆ మాత్రం అసౌకర్యం భరించాలనుకుంటాం. కాని గుండె సంబంధిత జబ్బులు రావటానికి ఇది ఒక అవకాశం. చిన్నదైన బ్రా ధరించి పెద్ద జబ్బు తెచ్చుకోవటమవుతోంది. మహిళలు దీర్ఘకాలం ఇటువంటి బిగువైన చిన్న సైజు బ్రాసరీలు వాడితే, డయాఫ్రం పై ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు రావటం తప్పని సరి.
2. మలబద్ధకం - స్తనాలను పైకి ఎత్తి వుంచే బ్రాసరీలు ధరిస్తే, ప్రత్యేకించి అడుగున వైర్లు వున్న బ్రాలు మీ పక్కటెముకలను పట్టి వుంచి జీర్ణ ప్రక్రియకు అవరోధం కలిగిస్తాయి. దీని ఫనలితంగా మలబద్ధకం, బవుల్ కదలికలు సరిగా లేకపోవటం జరుగుతుంది. పొట్టకూడా ఒక కండరం వంటిదే దానిని ఎపుడూ నొక్కిపట్టి వుంచితే అది సరిగా పనిచేయని స్ధితికి వస్తుంది.
3. వెన్ను నొప్పి - బ్రా ఎందుకు ధరించాలంటే ముందు బరువును పై కెత్తి వెన్నును సమతుల్యం చేసి భారం తగ్గించాలి. బిగువైన బ్రా ఈ పని చేయకపోగా మెడకు, భుజాలకు లింక్ అయివున్న టిష్యూలపై ఒత్తిడి తెచ్చి నొప్పి పెడుతుంది.
4. బ్లడ్ సర్కులేషన్ - మీ వక్షోజాల క్రింద ఎర్రగా వుండటం ఎపుడైనా గమనించారా? స్తనాలు, కంక భాగాలు ఏదో గుచ్చుకున్నట్లు అవటం గమనించారా? ఇవన్నీ రక్త సరఫరా సరిలేకపోవటం వలన అని తెలుసుకోండి. రక్తం స్తనాలచుట్టూ నిలువ వుండిపోతుంది. ఇక నొప్పి, దద్దుర్లు, శాశ్వతంగా స్తనాలు నష్టపోవటం జరుగుతుంది.
5. బ్రాసరీ వల్ల బ్రెస్ట్ కేన్సర్ - బ్రాసరీలు సరిగా లేకుంటే కేన్సర్ వస్తుందని సైంటిఫిక్ గా కూడా రుజువయింది. స్తనాలు పూర్తిగా పాల నాళాలు, రక్త నాళాలు, ఇతర కణజాలం. మెత్తటి మాంసం. ఎముకలు వుండవు. ఈ మెత్తటి భాగాలకు ఒత్తిడి అధికమైతే గడ్డలు కట్టడం, అవి పుండ్లుగా మారటం జరుగుతుంది. ఈ పరిస్ధితి సరిగా ఫిట్ కాని బ్రాసరీ వలనే వస్తుంది.
ఫ్యాషన్ల కొరకు ఆరోగ్యాన్ని బలిపెట్టకండి. సౌకర్యవంతమైన లోపలి దుస్తులు ధరించి ఆరోగ్యంగా వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
