Latest Updates
-
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.!
స్వీట్ సిక్స్ టీన్ కి - 6 మార్గాలు!

చర్మ సంరక్షణ - ముడుతలు రావడం సహజం. ప్రత్యేకించి కళ్ళ చుట్టూ, ముక్కు పక్కనా లైన్లు వచ్చేస్తాయి. ఎండల కారణంగా రంగు కూడా మారుతుంది. వీటికి మీరు చేయాల్సింది...ఆ భాగాలను బాగా రుద్దటం, తగినంత సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు వాడటం చేయాలి. ముడతలకు బొటాక్స్ వాడచ్చు. ముడుతలు పోవాలంటే ఆలివ్ ఆయిల్ ఎంతో ఉపయోగిస్తుంది.
బరువు - ఎప్పటికపుడు బరువు సరిచూసుకుంటూ వ్యాయామాలు చేయండి. రోజూ కనీసం 30 నిమిషాలు చేస్తే శరీర ఎదుగుదల అదుపులో వుంటుంది. మీ వ్యాయామం యోగా, అరబిక్స్, స్విమ్మింగ్ ఏదైనా కావచ్చు. ఏదో ఒక శారీరక వ్యాయామం మొదలుపెట్టి దానిని కొనసాగించాలి. ముఖానికి సంబంధించిన వ్యాయామాలు కూడా చేసి ముఖ కండరాలను మెరుగుపరచండి.
ఆహారం - మీ ఆహారంలో అధికంగా పచ్చటి కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గింజలు, బీన్స్ మొదలైనవి వుండాలి. 75 శాతం మొక్కల నుండి వచ్చిన ఆహారంగా వుండాలి. మిగిలినది. పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసంగా వుండాలి. ఈ రకమైన ఆహారం మీకు ఎముకల అరుగుదల, డయాబెటీస్, గుండె వ్యాధులు రాకుండా చేస్తుంది.
కాల్షియం అధికంగా - కాల్షియం, విటమిన్ డి లు వుండే తక్కువ కొవ్వుకల పాల ఉత్పత్తులు, సోయా మిల్స్, ఆరెంజ్ జ్యూస్, చేపలు, వైద్యుల సలహా మేరకు ఇతర అదనపు ఆహారాలు తీసుకోండి.
లిక్కర్ - తాజా పరిశోధనలమేరకు ఆల్కహాల్ మితంగా తీసుకుంటే గుండెను సంరక్షిస్తుందట. కనుక అతిగా కాకుండా రోజుకు 30 మి.లీ. చొప్పున ఒక్కసారిగా తీసుకోవడం ఆరోగ్యాన్ని సంరక్షించగలదు.
నిద్ర తగినంతగా - చాలా మంది రోజుకు 5 లేదా 6 గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఇది చాలదు. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలపాటు రాత్రి నిద్ర అవసరం. అవసరమనుకుంటే పగటిపూట మధ్యాహ్నం వేళ 10 నుండి 15 నిమిషాలపాటు నిద్రించటం కూడా మంచిదే.
షుగర్, ఉప్పు - ఈ రెండు పదార్ధాలు, ఆరోగ్యానికి హానికరమని గుర్తించండి. వీలైనంత తక్కువగా వీటిని ఉపయోగిస్తే, మీ ఆరోగ్యం బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
