Latest Updates
-
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
రాత్రి సమయంలో మీ నిద్రను పాడు చేసే ఆహార పదార్థాలు..!?
ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోకపోతే పోషకాహార లోపం వస్తుంది. దీని వల్ల రక్తహీనత, అజీర్తి, గుండెలో మంట, కడుపులో నొప్పి, అధికబరువు, ఎముకలు, కండరాల సమస్యలు... ఇలా ఎన్నో... చెప్పలేనన్ని మొదలవుతాయి. సరైన ఆహారం, సరైన వేళలో తీసుకోవడం మనిషి సాధారణ హక్కు. దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఉదయం నిద్ర లేచిన గంట రెండు గంటల లోపు అంటే 8, 9 గంటలకు అల్పాహారాన్ని, మధ్యాహ్నం పన్నెండు లోపు భోజనాన్ని, రాత్రి ఆరు, ఏడు లోపు భోజనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సమయాలలో ఎన్ని క్యాలరీలు తీసుకున్నా అంతగా నష్టం ఉండదు. పైగా బరువు పెరగకపోవడం, అనారోగ్య సమస్యలు దరిచేరకపోవడం వంటివి అదనపు ప్రయోజనాలు. భోజనానికి... భోజనానికి మధ్య కనీసం 4- 5 గంటల వ్యవధి ఉండాలి.

రాత్రిపూట శరీరం నిద్రావస్థలో ఉంటుంది కాబట్టి తక్కువ శక్తి అవసరం అవుతుంది. కడుపు నిండుగా తిని పడుకుంటే అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కేలరీలు ఖర్చయ్యే అవకాశం తక్కువ కాబట్టి బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని రాత్రి పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయాలి. అదీ తక్కువ మోతాదులో... !
ఇక అసలు విషయానికి వస్తే రాత్రి సమయంలో మీ నిద్రను పాడు చేసే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆశ్చర్యం కదా...? కొన్ని పదార్థాలను రాత్రిల్లో తినడం వల్ల ఎసిడిటి, ఛాతీలో మంట, కడుపులో వికారం వంటి సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి రాత్రి సమయంలో మీ నిద్రను పాడుచేయకుండా ఉండేందుకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదో చూద్దాం...
పండ్లు: పండ్లు ఆరోగ్యానికి మంచిదే. అయితే అవి తినడానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. పండ్లను రాత్రి సమయంలో ఎందుకు తీసుకోకూడదంటే చాలా రకాల పండ్లలో యాసిడ్స్ మరియు జ్యూస్ లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గాస్ట్రిక్ మొదలవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సిట్రస్ కలిగినటువంటి ద్రాక్ష, ఆరంజ్, పైనాపిల్, బెర్రీస్ పండ్లను అవాయిడ్ చేయాలి. ఇటువంటి పండ్లను తినడానికి మధ్యహాన్నం మంచి సమయం. ఉదయం 11 నుండి సాయంత్రం 4గంటల సమయంలోపల తీసుకొంటే అవి సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే పండ్లను ఖాలీ కడుపుతో తినకూడదు. ఇలా చేయడం వల్ల గాస్ట్రి ప్రాబ్లమ్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
పిజ్జా: మీరు రాత్రి భోజనం బయట ఇటాలియన్ ఫుడ్ తినాలనుకొన్నప్పుడు, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే పిజ్జాలో స్పైసీస్, టమోటో సాస్ మరియు చీజ్ వంటివి మీ జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలుగజేస్తాయి. ఇది ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండుగా, భారంగా అనిపిస్తుంటుంది. కాబట్టి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకొని బరువు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి పిజ్జా బర్గర్లను నైట్ టైమ్ అవాయిడ్ చేయడమే మంచిది.
రెడ్ మీట్(మాంసాహారం): మాంసాహార ప్రియులు బయట అందంగా అలంకరించిన నాన్ వెజ్ ఐటమ్స్ ను చూసి ఆకర్షింపబడి రాత్రి డిన్నర్ కి కొంచెం ఎక్కువగా లాగించేస్తారు. దాంతో ఏమవుతుంది? మాంసాహారంలో అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయంలో జీర్ణం అవడానికి కష్టం అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో అతి తక్కువగా తినడం లేదా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా డిన్నర్ బెగ్గర్ లా తినాలి. బ్రేక్ ఫాస్ట్ కింగ్ లా తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది.
స్వీట్స్: భోజనం తర్వాత స్వీట్ తినడం అంటే సంతృప్తికర భోజనమే. మంచిదే. అయితే స్వీట్స్ ను రాత్రి భోజనం తర్వాత తినకూడదు. రాత్రిల్లో స్వీట్స్ తినడం వల్ల వంట్లో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను పెంచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
