Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అదరగొట్టే తలనొప్పి! భరించలేని ఒత్తిడి?

1. మైగ్రేన్ - అధిక శారీరక వేడి లేదా కంటికి శ్రమ అధికం అవటం వలన, హార్మోన్ల స్ధాయిలో అసమతుల్యత వలన మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి తలకు ఒకే పక్క వస్తుంది. నొప్పి కళ్ళకు కూడా పాకుతుంది. వికారం, వాంతులవడం, అలసట, నోటి చేదు మొదలైనవి లక్షణాలు. మరి ఈ నొప్పి రాకుండా వుండాలంటే....నిద్ర మంచిదే. కాని తగిన మందు, యోగ, మ్యూజిక్ ధిరపీ వంటివి కూడా సహకరిస్తాయి.
2. టెన్షన్ తలనొప్పి - ఈ తలనొప్పి మెడ, భుజం నొప్పులతో కలసి వస్తుంది. అలసిన కండరాలు తలకు ఒత్తిడి కలిగించి తల, కణతలు, మెడ వంటివి భారంగా వుండేలా చేస్తాయి. ఆఫీసు పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు వంటివి దీనిని కలిగిస్తాయి. ఆల్కహాల్ బాగా తాగడం, కాఫీ అధికం కావటం వంటివి నొప్పి తీవ్రతను పెంచుతాయి.
3. క్లస్టర్ తలనొప్పి - ఇది పై రెంటివలే సాధారణం కాదు. కొద్దిపాటిగా నొప్పి రావటం, పోవటం గా వుంటుంది. కళ్ళ వెంట నీరు, మూసుకుపోతున్న కను రెప్పలు, అలసట, మొదలైన లక్షణాలుంటాయి. బ్రెయిన్ లో కలిగే మార్పుల వలన ఇది వస్తుంది. మందులు తప్పనిసరి.
రూట్ కెనాల్ సమస్యలు, ఎసిడిటీ, ఖాళీ పొట్ట, తలచర్మం పొడారిపోవటం, ఎండకు అధికంగా గడపటం వంటి వి కూడా కొన్ని రకాల తలనొప్పులు తెప్పిస్తాయి. వీటిని పెయిన్ కిల్లర్ లేదా ఇంటి చికిత్సలతో తగ్గించవచ్చు. వీటికి తలకు, మెడకు, భుజాలకు వేడి నూనె మర్దన, వేడినీటి స్నానం, అల్లం, పసుపు పేస్టు రాయటం వంటివి రిలీఫ్ ఇస్తాయి. లేదా యూకలిప్టస్, కర్పూరం మొదలైనవి కూడా రాస్తే బాగా పనిచేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications