Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
ఆరోగ్యకరమైన శ్వాస ఎలా తీయాలి?

శ్వాసించటం ఎలా? అనేది మనకు తెలుసా?
1. శ్వాస ప్రాధమికతలు - శ్వాసించటం మీకు ఎవరైనా నేర్పించారా? బహుశ ఎవరికి ఇది అవసరంలేదు. పుట్టినప్పటినుండి మానవుడు శ్వాసిస్తూనే వుంటాడు. మానవ ఏర్పాటు ప్రక్రియలో అది సహజమైన చర్య. కాని నేడు పెరిగిపోతున్న శ్వాస సంబంధిత సమస్యలు చూస్తే, శ్వాసించటం ఎలా? అనే ప్రాధమిక అంశాలు తెలుసుకోవడం సమంజసంగానే భావించవచ్చు.
2. శ్వాసించటానికి కూడా మనం బిజీయే - తరచుగా మనం గాలి పీల్చటానికి కూడా సమయం లేదంటాం. అది నిజమే. ఎపుడూ అంతర్గత ఆందోళన, సమయం ఇవ్వలేము. గాఢంగా శ్వాసించలేము. కాని ప్రతిసారి కనుక మనం దానిమీద ధ్యాసపెట్టి పూర్తిగా, గాఢంగా శ్వాస తీసుకోగలిగితే...ఎంతో శక్తి పొందుతాము.
3. గాఢ శ్వాస - చాలావరకు మనం మనకు తెలియకుండానే శ్వాస తీసుకుంటాం. అందుకే గాలి పీల్చగలిగినంతా పీల్చలేము. గాఢ శ్వాస తీసుకోవటం చాలా ప్రధానమైనది. ప్రతిరోజూ కనీసం దానిని గమనిస్తూ 30 నిమిషాలు కేటాయించండి. గాలి లోపలికి పీల్చటం, బయటకు వదలటం చేస్తూ లెక్కించండి.
4. శక్తి కొరకు శ్వాస తీయుట - గాఢ శ్వాసలో మీకు ఆక్సిజన్ గరిష్టంగా లోపలికి వెళుతుంది. శరీరంలో జీవక్రియ మెరుగవుతుంది. అది మంచి శక్తిని కలిగిస్తుంది. తీవ్ర అలసట వంటివి సరిగ్గా శ్వాస తీసుకుంటే మాయమైపోతాయని గ్రహించండి.
5. శ్వాస తీసుకోలేకపోతున్నారా? బిగువైన దుస్తులు ధరించారేమో చూడండి. వాటిని తీసివేసి వదులైనవి వేసుకొని సరిగ్గా శ్వాసించండి. శ్వాస హాయిగా తీయాలంటే, సౌకర్యమైన దుస్తులు కూడా వేయాలి.
6. ఏదో ఒక మాదిరిగా శ్వాస - ఆందోళన అనేది మీ గాఢ శ్వాసను అడ్డగిస్తుంది. భయం, ఆందోళన, ఒత్తిడి శ్వాసను మరచిపోయేలా చేస్తాయి. సరిగ్గా శ్వాసించటం ఎలా అనేది తెలుసుకోవాలంటే, ముందుగా రిలాక్స్ అవటం నేర్చుకోవాలి. పీల్చే ప్రతి శ్వాస గమనించండి. అపుడే మీరు గాఢ శ్వాసలు తీయగలరు.
గాలి ఎలా శ్వాసించాలి అనేది యోగాలో ఒక వ్యాయామం కాదు, వైద్యం అంతకంటే కాదు. సరిగా, మెరుగైన రీతిలో శ్వాసించటం మీ జీవితానికి ప్రాధమిక అవసరం. ఈ ఆరోగ్య చిట్కాలు పాటించి గాఢ శ్వాసలతో మంచి శక్తిని అనుభవించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
