Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గ్రీన్ టీ తాగితే తదుపరి పరిణామాలు?

తాజాగా తీసుకోండి - తయారు చేసిన తర్వాత గంటకు మించి నిలువ వుంచకండి. వేడి ఎక్కువగా వుంటే కేన్సర్ వస్తుంది. కనుక అధిక వేడికల గ్రీన్ టీ తాగకండి. ఎక్కువసమయం నిలువ వుంచితే, దానిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి. అధిక సమయం నిల్వ వుండటంతో హానికలిగించే బాక్టీరియా దానిలో చేరే ప్రమాదం వుంది. కనుక ఎల్లపుడు తాజాగా తాగండి.
భోజనానికి 1 గంట ముందర - డైటింగ్ చేసేవారు గ్రీన్ టీ ని భోజనానికి ముందర తాగుతారు. అది ఆకలిని చాలాసేపు నియంత్రిస్తుంది. కనుక భోజనానికి 1 గంట ముందర తీసుకుంటే, అధికంగా తినరు. దీనిలో వుండే కేఫైన్ ఆకలి చంపుతుంది. సాయంకాలం వేళ గ్రీన్ టీ తీసుకునేవారు దానితోపాటు కొవ్వు తక్కువకల బిస్కట్లు కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉదయంవేళ గ్రీన్ టీ తాగకండి.
గ్రీన్ టీ మందులతో తీసుకోరాదు - ఏదేని మెడిసిన్ వేసి గ్రీన్ టీ తాగకండి. దానివలన సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా వుంటాయి. మెడిసిన్ ఎపుడూ నీటితోనే తీసుకోవాలి లేదా వైద్యలు చెప్పిన విధంగా తీసుకోవాలి.
స్ట్రాంగ్ గా తాగకండి - గ్రీన్ టీ స్ట్రాంగ్ గా తాగవద్దు. దీనిలో కేఫైన్ మరియు పాలీఫెనాల్స్ వుంటాయి. ఇవి శరీర ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్టులు కలిగిస్తాయి. స్ట్రాంగ్ గా తాగితే అజీర్ణం, నిద్రలేమి, గుండె ఆగి ఆగి కొట్టుకోవడం కలిగిస్తుంది.
రెండు కప్పులు మాత్రమే - అధికంగా తాగితే ఏదైనా హాని కలిగిస్తుందని తెలుసుకున్నారు. కనుక దీనిలో వుండే కేఫైన్ కారణంగా ప్రతిరోజూ రెండు లేదా మూడు కప్పులకు మించి గ్రీన్ టీ తాగకండి.
ఇవి గ్రీన్ టీ సరిగా తాగకపోయినా లేదా అధికంగా తగినా కలిగే నష్టాలు. ఇది బరువు తగ్గేందుకు సహకరించే పానీయం కనుక తగినంత మోతాదులో ఎప్పటికపుడు తాజాగా తయారు చేసుకుంటూ తాగితేనే శరీరానికి ఆరోగ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications