Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
అల్పాహారంలోనే అసలైన శక్తి...!

1. ముందుగా బ్రేక్ పాస్ట్ చేసేటందుకు ప్రతిరోజూ ఒక సమయం నిర్దేశించండి. సరైన సమయాలలో తీసుకోకుంటే బరువు తగ్గే అవకాశాలు తగ్గుతాయి.
2. బరువు తగ్గాలంటే, సన్నగా వుండాలంటే, ఓట్ మీల్స్ ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఆహారం కాగలదు. ఆరోగ్యమే కాక కడుపు నిండుతుంది. దీనితో పచ్చి కూరలు కూడా కలిపి వేడిగా తినవచ్చు.
3. బ్రేక్ ఫాస్ట్ గా రెండు అరటిపండ్లు కడుపు నింపేస్తాయి. వెన్నతీసిన పాలు లేదా పండ్ల రసాలు కూడా వీటితో పాటు వుంటే కడుపు నిండటమే కాదు రోజంతా చురుకుదనం శక్తి కొనసాగుతాయి.
4. ఉడికించిన గుడ్డు మరో ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని రోస్టెడ్ బ్రెడ్ లేదా బ్రెడ్ టోస్ట్ తో కలిపి తీసుకుని ఒక గ్లాసెడు పండ్ల రసం తాగండి. ఆమ్లెట్ కంటే కూడా ఉడికించిన గుడ్డులో పోషకాలు బాగా వుంటాయి.
5. కార్న్ ఫ్లేక్స్ (మొక్కజోన్న విత్తులు) బ్రేక్ ఫాస్ట్ గా బాగుంటుంది. చేయటం కూడా తేలిక. బరువు తేలికగా తగ్గిస్తాయి. పాలతో కలిపి తినవచ్చు. అరటిపండు, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటివి కూడా చేరిస్తే కడుపు నిండిపోతుంది.
6. వెజిటబుల్ శాండ్ విచెస్ సాధారణంగా తింటారు. మంచి బ్రెడ్ లో ఉడికించిన వెజిటబుల్స్ లేదా తక్కువ కొవ్వుకల ఛీస్, బటర్ వంటివి పెట్టి తింటే బాగుంటుంది.
7. ఓట్స్ - అలసి పోయినట్లు, నీరసపడ్డట్లు భావిస్తూంటే, దేనిపైనా ఆసక్తి చూపకపోతే, మీ శరీరంలో కొన్ని బి విటమిన్లు లోపించాయని చెప్పాలి. ఈ విటమిన్లు బ్రెయిన్ సరిగ్గా పనిచేయటానికే కాక కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ గా మార్చి శరీరానికి ఇంధనం చేకూరుస్తాయి. ఉదయం వేళలో ఒక కప్పుడు ఓట్స్ తింటే అవసరమైన బి విటమిన్ శరీరానికి చేకూరుతుంది.
8. చాక్లెట్ - డార్క్ చాక్లెట్ లో గుండెకు శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అవి మీ మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.
9. బీట్ రూట్ - బీట్ రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాదు అధికమైన తక్షణ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇందులో షుగర్ అధికంగా వుండి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, నైట్రేట్ వంటివి కూడా వుంటాయి. బీట్ రూట్ ఏ రూపంలో తిన్నప్పటికి ఆరోగ్యమే.
ఈ ఆహారాలను ఉదయంవేళ మితంగా తినాలి. అధికంగా తింటే, జీర్ణ క్రియకే శక్తి అంతాపోయి మీలో బద్ధకం ఏర్పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
