Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కడుపులో మంటా...? తగ్గించండిలా...?

పొట్ట మంటకు లక్షణాలెలావుంటాయి?
ముందస్తుగా వచ్చే చిహ్నాలు - వేడి పుడుతోందంటే ముందుగా పొడిబారుతుంది. పొట్టలోని ద్రవాలు ఊరక, దాహం, ఎండిన నోరు, మలబద్ధకం కలుగుతాయి. ఈ పొడిబారటం తీవ్రమైతే, నోరు, గొంతు వంటివి ఎండిపోయి ఏదైనా తాగాలి అనే భావన కలుగుతుంది.
పొట్టలో గల మంట, మీ ఆకలిని తగ్గిస్తుంది. ఎపుడూ కడుపు నిండుగా వున్నట్లు, కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దానికి కారణం పొట్టలోకి చేరిన ఆహారాన్ని జీర్ణం చేసేందుకు తగినన్ని రసాలు ఊరకపోవటమే. ఇదే కొనసాగితే, మరిన్ని ఆరోగ్య సమస్యలు అంటే జ్వరం వంటివి కూడా రావచ్చు.
పొట్టలో మంట, అజీర్ణం నొప్పిని కూడా కలిగించవచ్చు. అది మరింత మండిస్తుంది. గ్యాస్ ఏర్పడుతుంది. పొట్ట వేడి శక్తిని ఖర్చు చేసి ఆహారాన్ని తీలికగా జీర్ణం చేయటంతో తరచుగా ఆకలి భావిస్తారు. పొట్టలోని వేడికి వికారం, వాంతులవంటి సమస్యలు కూడా వస్తాయి. పొట్టలోని మంట, మీలో చెడు శ్వాసను, నొప్పిపెట్టే, రక్తం కారే నోటి చిగుళ్ళను కూడా కలిగిస్తుంది.
పొట్ట సమస్యలకు చికిత్స ఎలా?
ఈ రకమైన పొట్ట సమస్యలకు వేడి లేదా ఘాటైన ఆహారాలు, కూల్ డ్రింకులు తీసుకోరాదు. పొట్ట వేడిని తగ్గించి లోపలి లైనింగ్ కాపాడాలి. చల్లగా వుండి తేలికగా జీర్ణమయ్యే దోస, అవకాడో, తోటకూర, గోంగూర వంటివి తినాలి. మామిడిపండు, అరటిపండు, పైన్ ఆపిల్ వంటివి తినాలి. వికారం, వేడి తగ్గించేందుకు పెప్పర్ మింట్ కూడా పనిచేస్తుంది. పచ్చి కేబేజీ రసం తాగి పొట్ట ఎసిడిటీ తగ్గించవచ్చు.
పొట్టలో మంట అధిక ఎసిడిటీ వలన ఏర్పడుతుంది. ఎసిడిటీ అజీర్ణానికి దోవతీస్తుంది. ఇటువంటపుడు ఓట్స్, రైస్, గ్రీన్ టీ వంటివి తీసుకోవచ్చు.
ఎసిడిటీ వుందా లేదా తెలుసుకోడానికి మీ వేలి గోళ్ళకు తెల్లటి మచ్చలు వున్నాయో లేదో పరిశీలించండి. పండ్లరసాలు, సూప్ లు, పచ్చి కూరల రసం వంటి ద్రవాలు అధికంగా తీసుకుంటే ఎసిడిటీ తగ్గుతుంది. ఈ ఆహారాలు పొట్టలోని ద్రవాలు, ఇతర పదార్ధాలు కు నష్టం కలుగకుండా చేస్తాయి.
పొట్ట వేడి తగ్గించాలంటే మరో సహజ మార్గం గాఢ శ్వాసలు తీసే వ్యాయామం చేయడం. పొట్టనిండా గాలి పీల్చండి. ఊపిరితిత్తులతో కంటే కూడా పొట్టతో గాలి తీయండి. మానసికంగా మీరు పీల్చేగాలి మీ పొట్టనను చల్లపరుస్తోందని, హాయి కలిగిస్తోందని భావించండి. ఈ రకమైన చర్య మీ గుండె మంటను, పొట్ట సమస్యలను కూడా చక్కబరుస్తుంది.
చల్లగా, తేలికగాజీర్ణమయ్యే ఆహారాలు పొట్ట మంటను తగ్గిస్తాయి. ఈపద్ధతులు మీ పొట్ట సంబంధిత సమస్యలకు పరిష్కారాలు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
