Latest Updates
-
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా?
యుక్తవయసు బాలికలలో శారీరక మార్పులు!

టీనేజ్ బాలికలకవసరమైన కొన్ని ప్రధాన ఆరోగ్య జాగ్రత్తలు పరిశీలించండి:
తినే తిండ్లను గమనించండి - తినే పదార్ధాలు సరిలేకుంటే పిల్లలు లావుగా అవుతారు. నేటి రోజుల్లో ఈ సమస్య అధికమైంది. మగ పిల్లలు లావెక్కినా పరవాలేదు. కాని సమాజంలో ఆడపిల్లలు లావెక్కితే సమస్యలుంటాయి. కనుక జంక్ ఫుడ్ దొరికే ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్ కు అతి తక్కువగా వెళ్ళండి.
ఎముకల ఆరోగ్యం - బాలికలు ఎదుగుతున్న కొలది వారి ఎముకలు కాల్షియం కోల్పోతాయన్నది తెలుసుకోండి. ఈ సమస్య వారి మెట్యూరిటీ నుండి మొదలై జీవితాంతం వుంటుంది. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసెడు పాలు, ఒక అరటిపండు టీనేజ్ బాలికకు తప్పక తినిపించండి. ఇపుడు తినిపించకపోయినా పరవాలేదు. కాని దీని ప్రభావం వారి 40 సంవత్సరాల వయసు తర్వాత కనపడుతుంది.
రుతుక్రమం (పిరీయడ్స్), శుభ్రత - జననాంగ శుభ్రతలు, మూత్ర సంబంధిత ఇన్ ఫెక్షన్స్ రావచ్చు. కనుక పిరీయడ్స్ లో శుభ్రత అత్యవసరం. ఇది ప్రతి నెలా వచ్చే సమస్య కనుక దానిని సరిగా నిర్వహించడం నేర్చుకోండి.
రుతుక్రమ నొప్పులు, బలహీనత - నెలకు ఒక సారి వచ్చే రుతుక్రమం టీనేజ్ పిల్లల ఆరోగ్యాన్ని కొద్దిపాటిగా మెతక పడేయవచ్చు. దీనిని తప్పించే మార్గం లేదు. అయితే, పిల్ల పిరీయడ్స్ లో తినకూడని తిండి పదార్ధాలను మానివేయాలి. ద్రవ పదార్ధాలను అధికంగా తీసుకోవాలి.
పిరియడ్స్ రికార్డు చేయండి - రుతుక్రమం తేదీలు తప్పక రికార్డు చేయండి. సైకిల్ కనుక 28 నుండి 31 రోజుల మధ్య వుంటే అది సాధారణ రుతుక్రమమేనని గుర్తించండి.
పిరియడ్స్ సక్రమంగా లేకుంటే - నేటి రోజులలో ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. కారణాలు... చెడు తిండి అలవాట్లనుండి జీవన విధానాలు సరిలేకపోవటం, పరీక్షల ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యతల వరకు వుంటాయి. ఏది ఏమైనప్పటికి సమస్యను సరి చేయటానకి సరి అయిన గైనకాలజిస్టును సత్వరమే సంప్రదించండి.
గర్భ నిరోధక సాధనాలు - వయసుకు అవసరంలేని ఆనందాలు పొందకండి. చాలామంది టీనేజ్ బాలికలు సరిగా లేని గర్భ నిరోధక మాత్రలు లేదా ఎమర్జెన్సీ సాధనాలుపయోగించి సమస్యల్లో పడతారు. వీటివలన ఇప్పటికే వారిలో పెరిగిన హార్మోన్ల స్ధాయి మరింత అధికమయ్యే ప్రమాదాలుకూడా వున్నాయి. కనుక సరి అయిన లైంగిక విద్యను నేర్చుకోండి. వయసు పెరగకుండానే పెద్దల ఆనందాలను ఆచరించకండి.
ఈ చిట్కాలు ఆచరించి ముందస్తు జాగ్రత్తలతో టీనేజ్ బాలికలు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications