Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కూల్ ...కూల్....హాయ్ ...హాయ్ సమ్మర్?

సహజ గాలి ప్రసరణ పొందండి. ఇంటి కిటికీ తలుపులు, ద్వారాలు తెరవండి, సహజ గాలి సర్కులేట్ అయ్యేలా చేసుకోండి. తడి గుడ్డలు విండోలకు కట్టడం ఆ నీరు ఆవిరి అవడంతో సహజ కూలింగ్ ఎయిర్ మీ గదులలోకి వస్తుంది. ఫ్యాన్ వేసి వేడి గాలిని బయటకు పంపండి. ఫ్యాన్ రెగ్యులేటర్ ఉపయోగం ఎనర్జీ వాడుకను తగ్గిస్తుంది. గది కూడా కొంత చల్లపడుతుంది.
మీ పని ప్రణాళిక వేయండి -
రోజులో వేడిగా వున్న గంటలలో తక్కువగా శ్రమించండి. తక్కువ వేడి అంటే ఉదయం, సాయంత్రాలలో మీ పనులన్నీ పూర్తి చేసుకోండి.
సరైన ఆహారం తినండి -
ఆహారంలో మీరు చేసే కొద్దిపాటి మార్పులు మీకు వేసవినుండి రక్షణ కలిగిస్తాయి. సిట్రస్ పండ్లు, పుచ్చకాయ, మొదలైన వేసవి ఫలాలు తినండి. వాటిలోని నీరు మీ శరీరాన్ని హాయిగా వుంచుతుంది. చెమట పట్టే కొలది అది ఆవిరై శరీరం చల్లబడుతుందని గ్రహించండి. ప్రొటీన్లు అధికంగా తీసుకోవద్దు. మీ ఆహారం కొద్ది కొద్దిగా తినండి.
నీటిని తాగండి -
నీరు అధికంగా తాగండి. ప్రతిరోజూ కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తప్పక తాగండి. గ్లూకోజ్ వంటి ఎనర్జీ డ్రింకులు తీసుకోండి. సహజ పండ్లరసాలు తాగండి. కేఫైన్ పానీయాలు, ఆల్కహాల్ ఈ కాలంలో వదలండి.
మధ్యాహ్నాలు -
స్కూల్, కాలేజ్ వంటివి మానకుండా, సమయం దొరికితే ఎయిర్ కండిషన్డ్ ధియేటర్ లో నూన్ షో చూడండి. సమ్మర్ వేడి తగ్గుతుంది. ఎక్కడ చెట్ల నీడ దొరికితే అక్కడ చల్లబడండి. మీ కిష్టమైన సాయంకాలాలు చెట్లనీడన గడపండి. చెట్లు నీడనివ్వటమే కాదు, వేడిని పీలుస్తాయి.
దుస్తులు -
సరైన దుస్తులు ధరించండి. వేసవ దుస్తులుగా కాటన్ లేదా లినెన్ బాగుంటాయి. అవి గాలి చొరనిచ్చి శరీరాన్ని చల్లబరుస్తాయి. ఈ గుడ్డలు తేలికగా వుండి వాటి రంగులతో సూర్య రశ్మిని అధిగమిస్తాయి.
నీరు వాడండి -
రోజులో ప్రతిగంటకు అవకాశం వుంటే మణికట్టుపై నీరు తో కడగండి. శరీరం కూల్ గా వుంటుంది. ముఖం, నుదురు, కణతలు చల్లని నీటితో కడగండి. పాదాలు చల్లని నీటిలో కొంత సమయం వుంచండి. తడి షర్టు ఇంటివద్ద వేసుకోండి నీటిని వెదజల్లే ఫ్యాన్ వుంటే ఉపయోగించండి.
తల - వెంట్రుకలు -
అన్నిటికి మించి, మీ బ్రెయిన్ అతిగా వేడెక్కేలా ఆలోచనలు చేయక, ప్రశాంతంగా, కూల్ గా వుండేలా చూసుకోండి. త్వరపడి పనులు చేసి తప్పులు చేసి ఆందోళనలకు గురికాకండి. పురుషులకు, అవసరమనుకుంటే మహిళలకు ...తమ వెంట్రుకలను వీలైనంత కురచగా కత్తిరించుకోండి అది మీ తల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మరింత వేడిగా అనిపిస్తే ఇక చివరగా తక్కువ టెంపరేచర్లతో మీ ఎయిర్ కండిషన్ మెషీన్ వాడండి. అయితే, పర్యావరణ ప్రేమిగా మీ వంతుగా ఎనర్జీ పొదుపు చేయటానికి సాధ్యమైనంత మేరకు ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications