Latest Updates
-
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య!
శరీర వాడిని పరీక్షించే వేసవి వేడి!

వేసవి ఆరోగ్య సమస్యలు ఎలా? చూడండి....
1. ఎండకు చర్మం నల్లబడటం - చర్మం నల్లబడటమే కాదు బాధాకరమైన పొక్కులు వస్తాయి. కొన్ని సార్లు అవి స్కిన్ కేన్సర్ వంటివి కూడా కలిగిస్తాయి. ఎండ నలుపు వలే కాకుండా ఈ సమస్యలు ఇంటి చిట్కాలతో నివారించలేము. వీటికి వైద్యం తీసుకోవాల్సిందే.
2. ఎండ(వడ) దెబ్బలు - వేసవిలో ఈ సమస్య సాధారణంగా వుండేదే. అయితే, అవి సాధారణమని మనం వాటిని నిర్లక్ష్యం చేయరాదు. ఎండకు అధికంగా గురైతే వడదెబ్బ అధికమైతే మరణించే ప్రమాదం కూడా వుంది.
3. మూత్రం మంట, జ్వరం - వాస్తవానికి ఇది జ్వరం కాదు. వళ్ళు అంతా వేడెక్కి పోతుంది. అధికంగా మధ్యాహ్న ఎండవేడిమికి గురవ్వటం వలన శరీరంలోని అవయవాలు వేడెక్కి ఈ స్ధితి ఏర్పడుతుంది.
4. జలుబు వ్యాధులు - గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటివి వేసవిలో కూడా వుంటాయి. శరీరంలో వేడి అధికమైతే కూడా ఇవి వస్తాయి. వేడి అధికంగా వుంటే, ప్రత్యేకించి తేమ వాతావరణంలో స్నానాలు ఎక్కువ చేస్తారు. సరైన సమయంలో స్నానం చేయకుంటే, చేసి వెంటనే ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషనర్లముందు కూర్చుంటే అది ప్రమాదం. అది జలుబు తెప్పిస్తుంది.
5. కళ్ళు మంటలు - సరైన సన్ గ్లాసెస్ వాడకుంటే కళ్ళు ఎరుపెక్కడం, నీరు కారడం కూడా జరుగుతుంది. అల్ట్రా వయోలెట్ కిరణాలు కళ్ళకు హాని కలిగిస్తాయి. కనుక యు.వి. రక్షిత గ్లాసులను వాడి కళ్ళను రక్షించుకోండి.
6. ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త - వేడి, చెమట, వంటి వాటితో చర్మ సంబందిత వ్యాధులు వస్తాయి. చికెన్ పాక్స్ లేదా మీసిల్స్ వంటివి రావచ్చు. వేక్సినేషన్ తప్పక చేయించండి. వ్యక్తిగత ఆరోగ్య శుభ్రతలు పాటించండి.
వేసవిలో వచ్చే ఈ ఆరోగ్య సమస్యలను దూరం చేయాలంటే, మీరు నీరు అధికంగా తాగండి. అది శరీర వేడిని తొలగించి వ్యాధులను రాకుండా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
