Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవడం ఎలా?

మీ స్వభావం ఎటువంటిది, ప్రతి చిన్న దానికి తేలికగా గాయపడటం, దానిని మరచేందుకు అధిక సమయం తీసుకోవడమా? అలాగయితే, మీకు మానసిక నివారణ అవసరం అధికమే. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే మార్గాలు కొన్ని పరిశీలించండి.
మానసిక ఆరోగ్యం మెరుగుపరచే మార్గాలు
మానసిక అనారోగ్యానికి అభధ్రత అనేది మొదటి కారణం. ఇతరులు ఏ ది చెప్పినా సరే తేలికగా గాయపడటం మంచిదికాదు. అది మీ అభధ్రతను సూచిస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే, ఎవరైనా వచ్చి హాస్యానికి నీవు లావు ఎక్కిపోతున్నావు? అన్నారనుకోండి. అది మిమ్మల్ని గాయపరుస్తుంది. అదే మీరు కనుక వారి మాటలు లక్ష్యపెట్టని వారైతే, అసలు పట్టించుకోని వారైతే, ఎవరూ కూడా మీ మనసుకు నొప్పి కలిగించలేరు.
పెడచెవిని పెట్టండి - చెపటం తేలికే, సాధనలో కష్టం. మరి మానసిక ఆరోగ్యం పొందాలననుకుంటే ఏది విన్నప్పటికి పట్టించుకోనట్లుండాలి. ఎందరో ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు. వాటికి మనం ప్రాధాన్యత ఇస్తే వారికి మనం పవర్ ఇచ్చినట్లవుతుంది. కనుక ఆ పవర్ లేదా ఆధిక్యత మీరే ఉంచుకోండి. మిమ్మల్ని మీరు ప్రపంచంనుండి కాపాడుకోండి.
మీలోని లోపాలకు మీరే నవ్వుకోండి - మీరు బట్టతల కలిగివుంటే, మీ స్నేహితులు ఎగతాళి చేస్తే, అవును నాది బట్టతలే అంటూ ఆనందంగా నవ్వేసుకోండి. ఇక మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు. ఆపై మిమ్మల్ని ఏమీ చేయలేమనే దానిని వారు తర్వాత గ్రహిస్తారు. అది మీ మనసుకు పట్టకుండా మీకు మీరు ఆనందంగా ఉంటారు. అది ఒక వాస్తవం కూడాను.
ఇవ్వటంలో ఆనందం చాలా గొప్పది - ఒక రోగం తర్వాత మీ శారీరక ఆరోగ్య అవసరాలవలెనే, మానసికంగా దెబ్బ తిన్నపుడు కూడా మీకు మానసిక నివారణ అవసరమవుతుంది. మరి లోపలినుండి మీరు కుదుటపడటానికిగాను ఏ మాత్రం కల్మషం లేని ఆనందాన్ని మీరు పొందాలి. అది కామసూత్ర కానివ్వండి లేదా పబ్ కి వెళ్ళి బీరు తాగటం కాని, మీరు లోపలినుండి ఆనందం పొందండి.
అయితే, జీవితంలో అన్నిటికి మించిన ఆనందం అంటే....నిస్వార్ధంగా ఏదైనా మరొకరికి ఇవ్వడం. అటువంటపుడు మీరు ఏం చేయాలి? మీ వద్ద వున్న పాత దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు వంటి వస్తువులను వాటి అవసరం ఉన్న వారికి ఉదారంగా ఇచ్చేయండి. అంతే, మీకు లోపలినుండి ఉపశమనం కలుగుతుంది.
మరో రకంగా మానసిక దెబ్బను ఎదుర్కొనాలంటే, మీరు అందంగా అలంకరించుకొని బయట తిరగండి. ఇక మీకు వచ్చే డిప్రెషన్ కూడా రాకుండా దూరం అయిపోతుంది. మీరు కనుక బాధ పడుతూ, ఏడుస్తూ, ఏ అలంకరణ లేకుండా కూర్చుంటే మీకు మనో వేదన కలిగి మరింత దిగజారిపోయే పరిస్ధితి ఏర్పడుతుంది. కనుక మొదటి చర్యగా అందంగా అలంకరించుకొని గ్రేట్ గా భావిచండి. అది ఒక కొత్త డ్రస్ వేసుకోవటం కావచ్చు లేదా, ఒక నెక్లెస్ కొనుక్కోవటం కావచ్చు. లేదా చివరకు మీ హెయిర్ కటింగ్ చేయించుకోవటం కావచ్చు. గంభీరంగా ముఖం పెట్టి గ్రేట్ ఆచరిస్తే ప్రపంచంలో మీరు మరింత కుంగిపోయినట్లు అనిపించదు.
చిన్నపాటి ఈ చర్యలు మీ మానసిక అనారోగ్యాన్ని దూరం చేయటానికి తోడ్పడతాయి. మీకు గనుక ఈ అంశంగా మరిన్ని చిట్కాలు తెలిస్తే మాతో పంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
