Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
మీ బరువు పెరగడానికి కారణమైన దైనందిన అలవాట్లు
మీరెందుకు హఠాత్తుగా బరువు పెరుగుతున్నారని మీరు ఆశ్చర్యపోతుంటే లేదా మీ బరువును నియంత్రించుకోవడం కష్టమౌతుంటే, దీనికి మీరు తీసుకొనే ఆహారం, మీ జీవనశైలి కారణమని ఖచ్చితంగా చెప్పవచ్చు. మనం ప్రతిరోజు తీసుకొనే చాలా సాధారణమైన ఆహారమే మనకు తెలియకుండానే మన జీవక్రియపై ప్రభావం చూపుతుంది. అనవసరమైన బరువు పెరుగుదలను నియంత్రించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోవడానికి ఇవి చదవండి.
నిత్య యవ్వనస్తులు మీరు కావాలనుకుంటే..ఇలా చేయండి:క్లిక్ చేయండి

కావలసినంతగా నిద్రపోకపోవడం
మీరు నిద్రను పోగొట్టుకొంటుంటే లేదా తగినంతగా నిద్రపోకపోతే, మీరు బరువు పెరిగే సూచనలు ఉన్నాయి. దీనికి కారణం సరిపడనంతగా నిద్రపోని వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది.

ఆల్కహాల్ తీసుకోవడం
మగవారు చాలామంది రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత స్థానిక పబ్బులో ఒక డ్రింకు లేదా రెండు డ్రింకులు తీస్కుంటారు. దీని వలన ఒత్తిడి తగ్గినప్పటికీ లేదా కొద్ది సమయం పాటు మనసుకు హాయిగా అనిపించినప్పటికీ ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా బరువు పెరుగుతుంది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం
రోజులోని ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ ఎంతో ముఖ్యమైంది. ఒక రాత్రి మంచినిద్ర తర్వాత మీ శరీరానికి కొంత ఇంధనం ఇవ్వడం ముఖ్యం. కాని ఏది తీసుకోకపోవడం వలన, మీ జీవక్రియను నిర్లక్షం చేసినట్లే.

ఎంత తింటున్నామో గమనించకపోయినట్టైతే
నాణ్యత ఎంత ముఖ్యమో మోతాదు కూడా అంతే. టేబుల్ మీద భోజనం వడ్డించారని అంతా తినాల్సిన అవసరం లేదు.

వ్యాయామం
ఇది పెద్దగా దృష్టి పెట్టదగినది కాదు, అయినా ప్రస్తావించవలసినదే. కౌచ్ పై నుండి లేవండి. టివిని ఆపండి. కొంత వ్యాయామం చేయండి. ఆటలు, జిమ్ కి వెళ్ళడం లేదా కొంత నడక కొన్ని కేలరీలను కరిగించడానికి ఎంతో ఉత్తమమైనవి. మీరు చక్కగా కనబడతారు, ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు.

రాత్రి భోజనం తర్వాత
రాత్రి భోజనం తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, అది సాధారణంగా ఏదో ఒక తీపి వస్తువు అయి ఉంటుంది. దీనికి బదులుగా ఒక కప్పు వేడి కాఫీ, చల్లటి నీరు, కేలరీలు లేనిది ఏదో ఒకటి తీసుకొండి. అతి ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఇంకేమీ తినకండి.

ఉపవాసం
ఉపవాసంతో కూడిన కొనుగోలు చేయండి. దీనిని చవిచూడండి. కిరాణా స్టోరు, మంచి ఆకలి ఈ రెండింటిని కలపకండి. మొట్టమొదటగా దృష్టి పడిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాస్త తగ్గండి. ఏమన్నా కొద్దిగా తినండి - ఆరోగ్యకరమైనది - కిరాణా స్టోరుకు వెళ్లేముందు. సూచన: కిరాణా స్టోరు కు వెళ్ళేప్పుడు ఒక శాండ్ విచ్ తీసుకొని వెళ్ళండి - గ్రిల్ చేసిన చికెన్ బ్రెస్ట్ లాంటిది. " మీకు ఆకలి వేయదు, ప్రలోభానికి లోను కారు", అని జెల్మన్ అంటున్నారు. అంతేకాక, సరుకుల జాబితాను తీసుకొని వెళ్లి దానికి కట్టుబడి, కొనుగోలు చేయండి.

స్నాక్స్
ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. మీరు పనిలో ఉన్నారు. విమానాశ్రయంలో ఉన్నారు, ఆకలి మొదలైంది. తేలికైన పని దగ్గరగా ఉన్నదాన్ని అందుకోవడం - పైగా తరచుగా, జంక్ ఆహారమే గెలుస్తుంది. ఉత్తమమైనది సాధించడం: ఇంట్లో తయారు చేసిన సాండ్విచ్, కొన్ని కారెట్లు, తాజా పండ్లు, ఒక జ్యూస్ లేదా ట్రయల్ మిక్స్. ముందుగానే ప్రణాళిక వేసుకోండి. ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని మీకు దగ్గరగా ఉంచుకోండి.

భాగాన్ని వక్రీకరించడం.
భాగాన్ని వక్రీకరించడం. మనకు వడ్డించిన ప్రతిదీ మనం తినాలనుకుంటాం - అది ఇంటి దగ్గర లేదా ప్రయాణంలో ఉన్నప్పుడైనా. భాగాలు ఈ మధ్య కాలంలో పెద్దవిగా ఉంటున్నాయి. చిన్న భాగం అంటే ఏమిటో తెలుసుకోండి. దానికే కట్టుబడి ఉండండి.

లో ఫ్యాట్
"కొవ్వు లేని" దాన్ని "కేలరీలు లేని" దానితో పోల్చుకొని అయోమయంలో పడటం. ఆరోగ్యకరమైన కుకీలు, ఇతర అల్పాహారాలు నిజానికి స్వచ్చమైనవి కావు. "కేలరీలు కేలరీలే". లేబుల్ చదవండి. కొవ్వులేని కుక్కీలు తిన్నంత మాత్రాన మీ నడుము వెడల్పు ఏమి తగ్గదు.

సాండ్విచ్
మయోతో సాండ్విచ్ ను తయారు చేయడం. ఆవాలు లేదా తక్కువ - కొవ్వు లేదా కొవ్వు లేని మయోనీస్ ను కేలరీలను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. శాండ్ విచ్ లో రుచి, అధిక పోషణను జోడించడానికి కరకరలాడే కూరముక్కలను ఎక్కువ పొరలుగా పెట్టండి.

వారాంతంలో మోతాదు మించి తినడం
మీరు పూర్తి వారంలో ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకొంటుంటే, వారాంతంలో మిమ్మల్ని మీరు సంతృప్తి పరచవచ్చు. కాని ఎక్కువ కాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. వారాంతంలో అతిగా తినడం వారమంతటి మీ స్వీయ క్రమశిక్షణకు విలువ లేకుండా పోతుంది. దీనిని నిరోధించడానికి, వారంలో ప్రతి రోజు కొంత అనుమతించండి. అందువలన మీ ప్రయత్నాలు వమ్ము కాకుండా మీరు గట్టి ప్రలోభానికి లొంగకుండా ఉండగలరు.

మీరు కృత్రిమ చక్కెరలను వాడతారు
ఇంతకంటే ఏం కావాలి, కృత్రిమ చక్కెరలు, సహజ చక్కెరలకంటే 7000 రెట్లు తీపిని కల్గి ఉంటాయి. ఇవి మన రుచి మొగ్గల సహజగుణాన్ని పోగొడతాయి.
సాధారణంగా కృత్రిమ చక్కర అందించే ప్యాకెట్ల కంటే, కృత్రిమ చక్కెరలు మనం ప్రతి రోజు చూసే జాబితాలో ప్రకటించని తృణధాన్యాలు, విటమిన్లు, సాస్, పిల్లల ఆహారంలో కూడా ఉంటాయి. కృత్రిమ ప్రత్యామ్నాయాలను తెలుసుకోవడానికి ఆహార జాబితాల పై ఈ కింద తెలిపిన ముఖ్య పదాలను చూడండి.
శాక్రిన్
అస్పర్టాం
సుక్రలోస్
నియోటం (బేక్ చేసిన నిల్వ వస్తువులలో ఉపయోగిస్తారు)
అసిసల్ఫాం ( ఆహారంతో తీసుకొనే సోడాలలో ఉంటుంది)

ప్యాకెట్ నుండి మీరు నేరుగా తింటారు
సంచుల నుండి నేరుగా తినడం వలన మీరు ఎంత తింటున్నారో తెల్సుకోవడం అసాధ్యమౌతుంది. అంతంలేని ప్యాకెట్ నుండి మీరు తింటుంటే, మీరు తిన్నాదాని కంటే దాదాపు మీరు తక్కువగా అంచనా వేస్తారు.

మీరు ఇతరులతో కలసి తింటారు
మీరు ఇతరులతో కలసి తిన్నప్పుడు, మీరు ఎంత తింటున్నారనే దారిని తప్పుతారని పరిశోధనలు తెల్పుతున్నాయి. ఉదాహరణకు, మీరు మరొక వ్యక్తితో కలసి తింటే సాధారణంగా మీరు తినేదాని కంటే 35% ఎక్కువగా తింటారు. అదే నలుగురితో కల్సి తింటే 75% ఎక్కువగా తింటారు. ఏడుగురు లేదా అంత కంటే ఎక్కువ మందితో కలసి అయితే మీరు వంటరిగా తిన్నప్పటి కంటే 96% ఎక్కువగా తింటారు.
అతి ముఖ్యంగా ఆలోచించవలసిన మెదడుకు మేత: ఒక వ్యక్తి సరాసరిన ఒక సమూహంతో తిన్నప్పుడు ఒక వారంలో తినేదానికి మూడు రెట్లు ఎక్కువ తింటాడు. అంటే అర్ధం మీరు జాగ్రత్తగా లేకపోతే, ఏడాది మొత్తం మీద మీరు 72,000 ఎక్కువ కేలరీలను తీస్కుంటారు. దీని వలన మీరు 20 పౌండ్ల బరువు పెరుగుతారు.
మీ దైనందిన జీవితం నుండి బరువును పెంచే ఈ చెడ్డ అలవాట్లను దూరం చేసుకొంటే, మీరు మీ బరువును తగ్గించుకొందామనుకొనే లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు. పెద్దగా ప్రయత్నించకుండానే మీ బరువును ఆదర్శ౦గా అలాగే నిర్వహించుకుంటారు.



Click it and Unblock the Notifications