Latest Updates
-
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!
ఫైబర్ హెల్త్ బెనిఫిట్స్:పీచు పదార్థం యొక్క ప్రాముఖ్యత
ఆధునిక కాలంలో తిండి దగ్గర నుంచి శారీరక శ్రమ వరకూ మన అలవాట్లన్నీ మారిపోయాయి. గతంలో ముతక ధాన్యాలు, తృణ ధాన్యాలు, రకరకాల పండ్లు, ముడి పప్పుల వంటివన్నీ తినేవారు. వాటితో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలీష్ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్ పదార్ధాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. అలాగని మళ్లీ పూర్తిగా ముతక ధాన్యాలు, దంపుడు బియ్యం, రొట్టెల్లాంటి వాటికి పూర్తిగా మారిపోవటం కష్టం కాబట్టి.. మనం తినే ఆహారంలోనే 'పీచు' మోతాదు పెంచుకునేదెలా? అన్న అవగాహన పెంచుకుని.. అందుకు తగ్గట్టుగా మంచి అలవాట్లు పెంచుకోవటం ముఖ్యం!
ఎంత పీచు అవసరం?
మనం తీసుకునే ఆహారంలో రోజుకి 40-45 గ్రాముల పీచు ఉండటం అవసరం. ఇందులో కరిగే పీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు అందరికీ అవసరమే కానీ.. కొందరు ప్రత్యేకించి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవారు, మధుమేహులు, గుండె జబ్బున్నవాళ్లు, స్థూలకాయులు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండేవాళ్లు, మాంసాహారం తరచూ తీసుకునేవారు తప్పకుండా పీచు ఎక్కువగా తీసుకోవాలి. తరచూ విరేచనాలకు వెళ్లాల్సి వచ్చే.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ బాధితులకు సబ్జాగింజల వంటివి బాగా ఉపయోగపడతాయి. ఇవి వెంటనే మల విసర్జన జరగకుండా కొంతసేపు పట్టి ఉంచటానికి దోహదం చేస్తాయి. త్వరత్వరగా విరేచనం కాకుండా, నీటిని పట్టి ఉంచటం వల్ల నీళ్ల విరేచనాలూ ఎక్కువ కావు. గర్భిణులకు మలబద్ధకం తలెత్తే అవకాశం ఎక్కువ. వీరికి పీచు ఎంతో మేలు చేస్తుంది.

పీచు.. ప్రత్యేకత ఏంటి?
మల బద్ధకం వదులుతుంది: ఆహారంలో మనం తిన్న పీచు- నీటిని, ఇతర పోషకాలను పట్టి (బైండ్) ఉంచుతుంది. కరగని పీచు- పదార్ధాలతో నీటిని పట్టి ఉంచుతుంది, మల పరిమాణం పెంచటానికి ఉపయోగపడుతుంది. కరిగే పీచు.. నీటిని గ్రహించి ఉబ్బుతుంది. దాంతో మల పరిమాణం (బల్క్) పెరిగి, అది మృదువుగా కూడా తయారవుతుంది. మల విసర్జన సాఫీగా జరగటానికి ఈ ప్రక్రియలు ఎంతో దోహదం చేస్తాయి. దీనివల్ల మలబద్ధకం, మొలలు, పేగుల్లో తిత్తులు రావటం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి.

పీచు.. ప్రత్యేకత ఏంటి?
పేగుల ఆరోగ్యం: సబ్జాగింజలు, మెంతుల వంటివి ఉబ్బి, జిగురుగా మారతాయి. వీటివల్ల లోపల జీర్ణపదార్ధాల కదలికలు మృదువుగా, పేగుల్లో మృదువైన వాతావరణం నెలకొంటుంది. పెద్దపేగుల్లో సమస్యలు (క్రాన్స్ డిసీజ్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) వంటివి తలెత్తకుండా, ఉపశమనంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి.

పీచు.. ప్రత్యేకత ఏంటి?
గ్లూకోజు, కొలెస్ట్రాల్ నియంత్రణ: పీచు నీటితో పాటు గ్లూకోజు వంటి పిండి పదార్ధాలనులు, స్టిరాల్స్ వంటి కొవ్వుల వంటివాటినీ పట్టి ఉంచి.. అవి త్వరగా రక్తంలో కలిసిపోకుండా చూస్తుంది. కరిగేపీచు.. గ్లూకోజు వెంటనే రక్తంలో కలవకుండా చూస్తుంది. ఇది మధుమేహులకు చాలా మంచిది. కరగని పీచు- మధుమేహం రాకుండా నివారించటంలోనూ కీలకం. అందుకే మధుమేహుల ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూడటం అవసరం. అలాగే రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ మోతాదూ పెరగకుండా చూడటంలో కరిగే పీచుకు ప్రాముఖ్యం ఉంది. ఈ పీచుపదార్ధాన్ని మాంసాహారంతో కలిపి తీసుకుంటే అందులోని కొలెస్ట్రాల్‌ను కూడా పట్టి ఉంచుతుంది. బైల్ యాసిడ్స్‌ను పట్టి ఉంచి- శరీరంలో సహజంగాఉండే కొలెస్ట్రాల్ కూడా విడుదల కాకుండా ఆపుతుంది. కొన్ని రకాల పీచు అయితే కొలెస్ట్రాల్ తయారు కాకుండానూ అడ్డుకుంటుంది.

పీచు.. ప్రత్యేకత ఏంటి?
బరువు నియంత్రణ: పీచు త్వరగా కడుపు నిండిన భావన కలజేస్తుంది. అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేం. పీచు పూర్తిగా జీర్ణమైపోదు కాబట్టి దీన్నుంచి శరీరానికి వచ్చే శక్తీ చాలా చాలా తక్కువ. ఆ కొద్దిపాటి శక్తి కూడా నెమ్మదిగా విడుదలవుతుంది, ఇది కొవ్వుగా మారటానికి అవకాశం తక్కువ. వీటన్నింటివల్లా బరువు తగ్గటానికి, బరువు పెరగకుండా ఉండటానికి పీచు దోహదం చేస్తుంది.

పీచు.. ప్రత్యేకత ఏంటి?
గుండెకూ మేలు: ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ వంటి వాటినీ పీచు పట్టి ఉంచి మల విసర్జన ద్వారా బయటకు వెళ్లేలా చేస్తుంది. గుండె రక్తనాళాలు త్వరగా దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తపోటు తగ్గించటానికి, గుండెపోటు రాకుండా, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండానూ చూస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.

పీచు.. ప్రత్యేకత ఏంటి?
క్యాన్సర్ల నివారణ: మలద్వారం, పెద్దపేగు క్యాన్సర్లే కాదు.. శరీరంలో రకరకాల క్యాన్సర్ల నివారణలో పీచు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు అధ్యయనాల్లో గుర్తిస్తున్నారు.

పీచు.. ప్రత్యేకత ఏంటి?
పీచు దేనిలో ఎక్కువ దొరుకుతుంది...?
ఈ ప్రశ్న ఎవరిని అడిగినా వెంటనే.. బీరకాయ, పొట్లకాయ, బీన్స్, చిక్కుళ్లు, అనాసపండు.. ఇలా పీచుపీచుగా కనబడే పదార్ధాల పేర్లు టకటకా చెప్పేస్తారు. కానీ వాస్తవానికి పైకి పీచుపీచుగా కనిపించే వాటిలోనే పీచు ఎక్కువగా ఉంటుందనుకోవటం సరికాదు.
పీచు లభించే పదార్థాలు
రోజు ౩౦ గ్రాముల పీచు అవసరమని వైద్యులు అంటున్నారు .అందులో కరిగే పీచు ఉంటె మంచిది .సాదారణంగా ప్రతి ఒక్కరు పీచు ఉండే పదార్థాలు తినడం మంచిది.మధుమేహం ,గుండె జబ్బులు ,మలబద్దకం బాధ పడేవారు ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకుంటారు . పీచు లభించే పదార్థాలు గోధుమలు ,రాగులు, జొన్నలు,సజ్జలు,కొర్రలు ..వీటిలో కరిగేరకం పీచు ఎక్కువగా ఉంటుంది .మనమే గోదుమలు తెచ్చుకొని పిండి పట్టిచడం మంచిది.మిగతా ధాన్యాలతో పోలిస్తే ఓట్స్ లో పీచు ఎక్కోవగా ఉంటుంది.పప్పుల్లో ముడి సెనగలు ,పెసలు ,మినుమలు ,అలసందలు బతనిలు..వీటిలో ఎక్కోవ పీచు ఉంటుంది.



Click it and Unblock the Notifications
