నైట్ షిఫ్ట్ చేసేవారికి 10 ముఖ్యమైన హెల్త్ టిప్స్

ప్రస్తుత కాలంలో నగరాల్లో కార్పెరేట్ కంపెనీలు పెరగడంతో డే అండ్ నైట్ పనిచేసే వారి సంఖ్య కూడా పెరింగింది. అయితే నైట్ షిప్ట్ పనిచేసే వారు సమయపాలనతో సౌకర్యవంతంగా ఉండాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కాల్ సెంటర్లు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగులు రాత్రి సమయాల్లో కూడా పనిచేస్తుంటారు. అయితే ఆ పనివేళలు సౌకర్యవంతంగా మలచుకోవడం మీ చేతుల్లోనే ఉన్నది. ఎందకంటే రాత్రుల్లో ముఖ్యంగా రాత్రి మొత్తం పనిచేయడం అంటే అంత సులభమైన పని కాదు! నైట్ షిఫ్ట్ లు చేయడం అంటే మనంతకు మనం కొన్ని జబ్బులను (డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, నిద్రలేమి, ఒత్తిడి మరికొన్ని వ్యాధులను)ఆహ్వానిస్తున్న సమయం అని మనం ఖచ్చితంగా గుర్తించాలి. అనేక మంది నిపుణులు, పనిచేసే ఉద్యోగుల ప్రకారం,టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.

ఇటువంటి జీవన విధానం ముఖ్యంగా అనారోగ్యకరమైనది. నైట్ టైమ్ పనిచేసే ఉద్యోగస్తులు ఫాస్ట్ ఫుడ్ లేదా ప్రాసెస్ ఫుడ్స్ మీద ఆధారపడి ఉంటారు. రాత్రిసమయంలో మేల్కోవడం వల్ల ఆకలి ఎక్కువగా కలిగినప్పుడు, ఆకలిని అరికట్టడానికి ప్రతీదీ లేదా ఏదైనా సరే తినడానికి సిద్దపడుతారు. అంతేకాక, రాత్రుల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కాఫీ, నీటి కంటే ఒక ప్రధాన పానీయంగా మారుతుంది. అలాగే, రాత్రుల్లో పనిచేసే ఉద్యోగస్తులు చాలా పూర్ డైట్(నాణ్యత లేని ఆహారం)మీదా ఆధారపడుతారు. అదే విధంగా పనిచేసే సమయం వారి పూర్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది.

రాత్రుల్లో పనిచేసే ఉద్యోగస్తులు యాక్టివ్ గా ఉండాలంటే, కొన్ని హెల్త్ టిప్స్ ఖచ్చితంగా పాటించాలి. నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులు ఆరోగ్యంగాను మరియు జాగ్రత్తగాను ఉండాలి. ఉదా: ఒక కప్పు కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఒక కప్పు కాఫీ తాగడం వల్ల నిద్ర రాకుండా మినిమం 7-8గంట వరకూ మేల్కోనుండేలా చేస్తుంది. నివ్వచేసిన లేదా ప్యాక్ చేసిన ఆహారాలను తినడానికి బదులు, తాజా ఆహారాలను తీసుకోవాలి. ఒక వేళ అది సాధ్యం కానప్పుడు ఇంటి నుండే కొన్ని హెల్తీ స్నాక్స్ ను తీసుకెళ్ళాలి. హెల్తీ స్నాక్స్ అంటే బాదం, గ్రిల్డ్ పన్నీర్ లేదా చికెన్ వంటివి సాధరణం మరియు ఆరోగ్యం కూడా...ఇటువంటి హెల్త్ టిప్స్ మరికొన్ని నైట్ షిఫ్ట్ చేసే వారికోసం క్రిందివిధంగా ఉన్నాయి పరిశీలించండి....

ఆరోగ్యకరంగా తినాలి:

ఆరోగ్యకరంగా తినాలి:

ఆరోగ్యకరంగా తినాలి. అందులో ఆరోగ్యకరమైన సూపర్ ఫుడ్ ఆకుకూరలు, బెర్రీస్ మరియు బ్రొకోలీ మొదలగునవి పోషకాలు మరియు ఆరోగ్యకరమైనవి కూడా.

కాఫీ తగ్గించాలి:

కాఫీ తగ్గించాలి:

అలసిన కళ్ళు, నిద్రమత్తును పోగొట్టాలంటే ఒక కప్పు కాఫీ తాగాల్సిందే. అయితే, నైట్ షిఫ్ట్ చేసే వారు, ఒక కప్పు కంటే ఎక్కుంగా కాఫీ తాగకూడదని ఒక సలహా. ఒది డీహైడ్రేషన్ మరియు స్లీపినెస్ ను పెంచవచ్చు.

ఎక్కువ నీళ్ళు తాగాలి:

ఎక్కువ నీళ్ళు తాగాలి:

నీళ్ళు రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరాన్ని తేమగా ఉంచతుుంది. రాత్రుల్లో పనిచేయడం వల్ల ఎనర్జీ మరియు నీటిశాతం తగ్గుతుంది. కాబట్టి, శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి మరియు అలసటను తొలగించుకోవడానికి నీరును ఎక్కువగా తాగాలి.

ఆయిల్ ఫుడ్స్ నివారించాలి:

ఆయిల్ ఫుడ్స్ నివారించాలి:

ఆయిల్ ఫుడ్స్ జీర్ణక్రియను తగ్గిస్తాయి మరియు అలసటను పెంచుతాయి. ముఖ్యంగా వీటిలో ఆరోగ్యానికి హాని చేసే ఆయిల్ ఫుడ్స్ లో క్యాలరీలను మరియు కొలెస్ట్రాల్ ను అధికంగా కలిగి ఉంటాయి. బరువు పెరగడాన్ని మరియు గుండె జబ్బులను నివారించాలంటే ఆయిల్ ఫుడ్స్ ను తినడాన్ని నివారించండి.

నడక:

నడక:

నైట్ షిఫ్ట్ పనిచేసే వారు తప్పకుండా పనిచేయాల్సిన ఒక ఎఫెక్టివ్ హెల్త్ టిప్ నడక. మద్యలో బ్రేక్ తీసుకోవడం లేదా నవడం వల్ల కళ్ళకు మరియు మైండ్ కు శ్వాంతన లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచడంతో పాటు, ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది.

తింటుండాలి:

తింటుండాలి:

రాత్రుల్లో పనిచేసే వారికి ఇది ఒక బెస్ట్ హెల్త్ టిప్. మద్య మద్యలో నట్స్ బాదాం, పిస్తా, ఖర్జూరం వంటి వాటిని తింటుండాలి.

షుగర్ ను కంట్రోల్ చేయాలి:

షుగర్ ను కంట్రోల్ చేయాలి:

ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల బరువు దారితీస్తుంది. అధికబరువు అనేది నైట్ షిఫ్ట్ చేసే వారికి చాలా సాధారణం.

హెల్తీ స్నాక్స్:

హెల్తీ స్నాక్స్:

హెల్తీ స్నాక్స్ అంటే వెజిటేబుల్ సాండ్విచ్ (చీజ్ లేకుండా), ఉడికించిన మామూస్ వంటివి ఆరోగ్యకరమైన స్నాక్ ఐడియా.

ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకూడదు:

ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకూడదు:

మేల్కొని ఉండటానికి ఎనర్జీ డ్రింక్స్ ను తాగకూడదు. మీను నిద్రపోవడానికి ఇవి మరింత ప్రేరేపిస్తాయి. . ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్ లో కెఫిన్ అధికంగా ఉంటుంది.

 సాధ్యమైతే నిద్రపోవాలి:

సాధ్యమైతే నిద్రపోవాలి:

సాధ్యమైతే, పనిచేసే సమయంలో కొంత సమయం నిద్రపోవాలి. చిన్న కునుకు తీయడం వల్ల కింత విశ్రాంతి కలుగుతుంది మరియు కొన్ని కంపెనీల్లో రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి.

Story first published: Saturday, August 31, 2013, 17:33 [IST]
Desktop Bottom Promotion