Latest Updates
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్
ప్రస్తుత ఆధునిక కాలంలో సహజంగా ప్రకతి సిద్దంగా లభించే ఆహారాలకు స్వస్తి పలుకుతున్నారు. రసాయనాలతో పండించి ఆహారాలే మార్కెట్లో ఎక్కువగా లభ్యం అవుతున్నాయి. అవి తింటూనే జీవనం సాగిస్తున్నారు ప్రజలు. ఇలా రసాయనాలతో పండించిన ఆహారాలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావం చూపెట్టకపోయినా ముందు ముందు ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపెడుతాయి.
కొన్ని ఆసక్తి కరమైన పండ్లు అన్యదేశపు కూరగాయలు సెక్స్ లైఫ్ కు చాలా సహాయపడుతాయి. అటువంటి కొన్ని రకాలా ఆహారాల పట్టికను మీకు అందిస్తున్నాం. ఇవి కనుక మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే రక్త సరఫ, కండరపుష్టికి, మంచి లైంగిక వాంఛ మరియు లైంగిక శక్తిని పెంచడానికి మార్గాన్ని సుగమం చేయడానికి సహాయపడుతాయి. వీటిని తినడం వల్ల సెక్స్ పవర్ ను పెంచడంలో కొన్ని పవర్ ఫుడ్స్ ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం

అవొకాడో: ఇది బట్టర్ ఫ్రూట్జ. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది

ఆస్పరాగస్: ఆస్పరాగస్ దీన్ని ఆహారంగా పురాతన కాలం నుండే తీసుకుంటున్నారు. ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండారాలకు బూస్ట్ వంటిది. తగినంత శక్తిని అందిస్తుంది.

పుచ్చకాయ: పుచ్చకాయను సెక్స్ బూస్టర్ అంటారు. ఎర్రగా ఉండే వాటర్ మెలోన్ లో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రిలాక్స్ పొందడానికి రక్త ప్రసరణకు బాగా సహాయపడుతాయి. సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్తప్రసరణను అందిస్తుంది.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాపడుతుంది.

రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

గుడ్లు: గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి.

గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో అధికంగా జింక్ మరియు ఐరన్ మరియు కావల్సినన్ని విటమిన్లు ఉండి శారీరక ఆరోగ్యానికి మరియు లైంగికజీవితానికి బాగా సహాయపడుతాయి.

ఓయిస్ట్రెస్: ఇవి ఒక విచిత్రమైన టేస్ట్ ను కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి కూడా విచిత్రంగా ఉంటాయి కానీ, ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఆయిల్స్ ఆరోగ్యానికి లైంగిక జీవితానికి బాగా సహాయపడుతాయి.

నట్స్: నట్స్ లో కావల్సినన్ని ఎసెన్సియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల్లో టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి. దాంతో సెక్స్ లైఫ్ సుఖవంతం అవుతుంది.

అంజీర: ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

అరటి: అరటి పండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి6 హార్మోనుల అసమతుల్యతను క్రమబద్ద చేయడానికి, శరీరానికి కావల్సిన ఎనర్జీ అందివ్వడానికి లైంగి జీవితానికి బాగా సమాయపడుతాయి.

ఆయిల్ ఫిష్: ఆయిల్ ఫిష్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఎసెన్సియల్ ఆయిల్ మగవారి సెక్స్ లైఫ్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

స్ట్రాబెర్రీ: కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్ లో విటిమన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ కు అద్భుతంగా సహాయపడుతాయి.

దానిమ్మ జ్యూస్: దానిమ్మలో అనేక పోషకాంశాలతో పాటు.. పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫీరాడికల్స్ ను తొలగించడంతో పాటు, శరీరంలో రక్త ప్రసరణ బాగా మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications