Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
స్టామినా వృద్దిచేసుకొనేందుకు 20 వండర్ ఫుల్ టిప్స్
సాధారణ వ్యక్తుల విషయానికొస్తే.. కొంతమంది వయస్సు ఎంత ఉన్నప్పటికీ మూడు పదులు దాటనట్లే కనిపిస్తారు. అంతేకాదు యువతకంటే ఎంతో చురుకుగా పనిచేస్తుంటారు. అదే మరికొందరూ ఎంత తిన్నప్పటికీ నీరసం, అలసట వంటివాటితో బాధపడుతుంటారు. ఆఫీసుకు వెళ్లినప్పటికీ కూనికిపాట్లు పడుతుంటారు. నిస్సత్తువుగా ఉంటారు. ఇది ఏ ఒక్క మహిళ సమస్యో కాదు చాలామంది మహిళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి వయస్సుతో సంబంధం లేదు. ఎంత తిన్నప్పటికీ అలసట, నీరసంగా అనిపిస్తే మీ శారీరక శక్తి తగ్గుతోందన్నమాట.
శక్తికి తీసుకునే ఆహారం ఒక్కటే సరిపోదు ఆహారంతో పాటు. కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. స్టామినా అనేది బలంగా లేదా ఎనర్జీతో మాత్రమే కనబడటం కాదు. అనారోగ్యంతో పోరాటం మరియు అత్యధిక ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది . మరి మీ స్టామినాను అన్నివిధాలుగా ఉపయోగపడే విధంగా పొందాలంటే ఈ స్టామినా బూస్టింగ్ టిప్స్ ను పాటించాల్సిందే...

భౌతిక పరీక్షపొందండి:
మీరు మీ స్టామినా పెంచుకొనే ఉద్దేశ్యంతో ఉంటే, మీరు ఒక ప్రామానిక వైద్య పరీక్ష ప్రారంభించాలి. ఇది మీరు ఎంత వరకూ ఫిట్ గా ఉన్నారన్న విషయాన్ని తెలుపుతుంది. అలాగే మీకు ఏర్పడ్డ గాయాలు, అలసట మరియు ఇతర ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఇది బాగా సహాయపడుతుంది. భౌతికంగా వైద్యపరీక్షలు పొండం చాలా అవసరం.

బ్యాలెన్స్ డైట్:
మీరు తీసుకొనే ఆహారం మీద తగినంత శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. మరియు మీ రెగ్యులర్ డైట్ లో లోఫ్యాట్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు లీన్ మీట్ వంటివి అధికంగా చేర్చడం వల్ల ఇవి మీ స్టామినా పెంచడంలో ఉత్తమ పద్దతి. రెగ్యులర్ డైట్ లో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల అవి మీ శరీరం ఆరోగ్యంగా మరియు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది.

మీకు ఇష్టమైన ఆట ఆడండి:
మీ అలసటను పారద్రోలి మీకు ఎనర్జీ లెవల్స్ అందించే అన్ని అవుట్ డోర్ గేమ్స్ ను ఆడండి. ఎందకంటే ఇవి ఒక ఏరోబిక్ వ్యాయామాలవంటివి. ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, మరియు పరుగుతో రిలేటెడ్ గా ఉన్న గేమ్స్ వంటి క్రీడలు ఆడటం వల్ల శరీరంలో గుండె మరియు ఇతర అన్ని ముఖ్య భాగాలకు ఆక్సిజన్ అందేలా చేస్తుంది.

నెమ్మదిగా ప్రారంభించండి:
మీరు స్టామినా పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మొదట కఠినమైన, తీవ్రమైన వాటిని పాటించకుండా, బేబీ స్టెప్ ను ముందుగా ఫాలో అవ్వాలి. మీరు అనుకొన్న సమయానికి మీరు చేరుకోవడానికి పరుగు పెట్టాలంటే ముందుగా మీరు తక్కువ దూరంను చేరడానికి నిర్ధారించాలి. దానికి మీరు నడకతో ప్రారంభించాలి లేదా చిన్నగా పరుగు తీయ్యాలి.

హృదయ సంబంధిత వ్యాయామము:
మీ స్టామినా పెంచుకోవడం కోసం ఒక ఉత్తమ మార్గం కార్డియో వ్యాస్కులర్ వ్యాయామాలు. పరుగెత్తడం, స్విమ్మింగ్, జంపింగ్ వంటి వ్యాయామాలను మొదలు పెట్టాలి.

రెస్ట్ డేస్ తగ్గించండి:
మీరు స్టామినా పొందాలంటే, మీరు రెస్ట్ డేస్ ను నివారించడం అవసరం. కానీ మీరు అధిక ఒత్తిడికి గురైనప్పుడు మద్యలో కొంత సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

చాలా సార్లు..కొద్దికొద్దిగా తినాలి:
మీ శరీరానికి నిరంతరం కావల్సిన శక్తి పొందడానికి, తక్కువగా తినాలి. అదికూడా తక్కువతక్కువ ఎక్కువ సార్లు, మద్యమద్యలో గ్యాప్ తీసుకొంటూ తినాల్సి ఉంటుంది.

నీళ్ళు:
అలసట మరియు డీహైడ్రేషన్ తగ్గించుకోవడం కోసం ప్రతి రోజూ తగినన్ని నీళ్ళు త్రాగడానికి నిర్ధారించుకోండి. మీ శరీరంలో తక్కువ నీరు కలిగి ఉంటే, అది మీ రక్తం curldle చేస్తుంది. అందువలన రక్త ప్రవాహం వేగాన్ని తగ్గిస్తుంది మరియు శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది. కాబట్టి తగినన్నీ నీరు తాగడం మంచిది.

సోడియం స్థాయి:
వేడి వాతావరణంలో రోజంతా కఠినమైన వ్యాయామం చేస్తే, మీకు మరింత చెమటలు పట్టే అవకాశం ఉంది, ఫలితంగా, శరీరంలోని సోడియంను చెమట రూపంలో కోల్పోతారు. సోడియం లోపం వల్ల ఎలక్ట్రోలైట్ అసమానతలను తగ్గి, అది మీ స్టామినా తగ్గించడానికి మరియు అలసట మరియు కళ్ళు తిరిగినట్లు ఉండటం అనిపిస్తుంది. ఇటువంటి సమస్యలను నివారించడం కోసం మీరు తగినంత సోడియం పొందేలా జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఎటువంటి రక్తపోటు లేకుండా, జాగ్రత్త తీసుకోవాలి.

కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి:
మీ రెగ్యులర్ డైట్ లో పిండిపదార్థాలు అధికంగా ఉన్నవి చేర్చుకోవాలి. అందువల్ల మీ శరీరానికి అవసరం అయ్యే స్ట్రాచ్ మరియు షుగర్స్ అందుతాయి. దాంతో కండాలు వాటిని ఎనర్జీరూపంలో మార్చుకొంటాయి. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ సెరెల్స్, బ్రెడ్, పండ్లు, వెజిటేబుల్స్, పాస్తా మరియు పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

మీ పరిమితులు తెలుసుకోండి:
మీరు చేయలేనంతంగా ఎక్కువ భారాన్ని తీసుకోకండి. అలా చేస్తే శరీరం గాయపడటం లేదా కండరాల తిమ్మిరిలకు దారితీస్తుంది.

చెడు అలవాట్లు మానుకోండి:
మనందరిలో మంచి అలవాట్లు మరియు చెడు అలవాట్లు అనేవి ఉంటాయి. మనకు తెలిసిన చెడు, మంచి అలవాట్లను రెండూ ఒక పట్టిక తయారు చేయండి. వాటిలో చెడు అలవాట్లు స్మోకింగ్, అతిగా మద్యం సేవించడం, జంక్ ఫుడ్ వంటి వాటికి మానుకోవడానికి ప్రయత్నించాలి. ఈ అలవాట్లను మానుకోవడం వల్ల మీరు ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది . దాంతో మీ స్టామినా పెరుగుతుంది.

రికార్డ్ నిర్వహణ:
రికార్డ్ బుక్ మెయింటైన్ చేయడం మీ పురోగతిని ట్రాక్ చేయడానికి ఉత్తమమైన మార్గం. ఇంకా మీరు ప్లాన్ చేసుకోవడానికి బాగా సహాయపడుతుంది.

కార్డినల్ రూల్స్ ను పాటించండి..
సాధారణంగా ఏపని ప్రారంభించడానికి ముందు, వ్రాప్ అప్, స్ట్రెచ్ మరియు చల్లబర్చడం తెలుసుకోవాలి. దాంతో గాయాలు కాకుండా నివారించవచ్చు.

బరువు శిక్షణ జోడించండి:
స్టామినా పెంచుకోవడంలో బరువు శిక్షణ చాలా ముఖ్యం. బరువు శిక్షణ తీసుకొనేటప్పుడు మొదటి తక్కువ బరువు ఉన్న డంబెల్స్ తో ప్రారంభించండి. తర్వాత రెండో వారంలో మరికొంత బరువును ఎంతడానికి ప్రయత్నించండి.

విశ్రాంతి చాలా అవసరం:
మీ స్టామినా పెంచుకొనే దిశలో, వ్యాయామాలతో పాటు విశ్రాంతి కూడా అవసరం. మొత్తం శిక్షణా సమయంలో అప్పుడప్పుడు మీరు విశ్రాంతి పొందడానికి సెలవు తీసుకోండి.

ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయాలి:
మీరు మీ ఎత్తుకు తగిన బరువును క్రమంగా నిర్వహించాలి.

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినాలి:
మీ దిన చర్యను హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మొదలు పెట్టండి. ఒక బౌల్ నిండుగా ఓట్స్, గోధుమపిండితో తయారు చేసిన టోస్ట్ వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల మీ కడుపు నిండుగా ఉండేలా మరియు మీ శరీరానికి అవసరం అయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, క్రోమియం, మరియు కాపర్ వంటి అత్యవసర పదార్థాలను శరీరానికి అంధించడానికి సహాయపడుతుంది.

కొవ్వు పదార్థాల
కొవ్వు పదార్థాలను తీసుకోవాలి ఐతే,
మంచి క్రొవ్వులు, చెడు కొవ్వుపదార్థాల మద్య వ్యత్యాసంను తెలుసుకోవాలి. మీ శరీరానికి అవసరం అయ్యే మంచి కొవ్వులను అందించాలి. అందుకు ఫ్లాక్ సీడ్స్, ఫిష్ ఆయిల్ వంటివి మీ డైట్ లో చేర్చుకోవాలి ఇవి మీ పనితీరును మరియు నాడులు మెరుగుపరచడానికి మరియు స్టామినా పెంచడానికి సహాయపడుతాయి .

ప్రోటీనులు అవసరం:
మీరు శరీరానికి అవసరం అయ్యే మంచి మన్నికైన ప్రోటీనులను తీసుకోవడానికి నిర్ధారించుకోండి. ఎగ్ వైట్, లోఫ్యాట్ మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్, చేపలు, చికెన్ వంటివి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.



Click it and Unblock the Notifications











