నిద్రలేమి సమస్యను నివారించడం ఎలా?

By Super

మన రోజువారి కార్యక్రమం లేదా డైలీ సైకిల్ లలో ప్రధానమైనవాటిలో ఒకటి నిద్ర. మన జీవితంలో మూడు శాతం నిద్రకు కేటాయిస్తాము. అయినా కూడా ఇప్పటికీ కొందరు నిద్రలేమి సమస్యతో బాధపడుతన్నారు. నిద్రలేమికి కారణాలు వివిధ రకాలుగా ఉన్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మనలో కొంత మంది ఇప్పటికి నిద్రలేమి సమస్య వల్ల రాత్రుల్లో ఎక్కువ సమయం మేల్కొని ఉండటం తర్వాత ఎప్పుడో నిద్రపోవడం జరుగుతుంది.కానీ ప్రతి రోజూ రాత్రుల్లో 7 నుండి 9గంటసేపు గాఢంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రావస్తలో ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని ముఖ్యమైన శారీరక మార్పులు సంభవించిడం జరుగుతుంది. శరీరంలోని జీవక్రియలతో పాటు , శరీరం కూడా విశ్రాంతి పొందుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం నిద్ర మెదడు యొక్క అభివృద్ధికి ప్రధాన పాత్రపోషిస్తుందని గుర్తించబడింది.

నిద్రలేమికి కారణాలు ఏవైనా సరే, మనకు రెగ్యులర్ గా , సమయానుసారం తగినంత నిద్రపొండం చాలా అవసరం. నిద్రలేమి వల్ల మానసికంగాను మరియు శారీరకంగాను అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. నిద్రలేమి సమస్యకు అనేక కారణాలు ఒత్తిడి , జీవనశైలి , శరీరధర్మ రుగ్మత మరియు డైట్ మొదలైనవి నిద్రలేమికి కారణం కావచ్చు. మీరు నిద్ర ఏరకంగా నిద్రపోతున్నారు మరియు ఎంత సేపు నిద్రిస్తున్నారు అన్నవిషయాన్ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఈ నిద్రలేమి సమస్య ధీర్ఘకాలం నుండి కొనసాగుతున్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. నిద్రలేమి సమస్యను దీర్ఘకాలంగా ఉన్నదని తెలుసుకొని వెంటనే చికిత్స తీసుకోకపోతే, ధీర్ఘ కాలిగ ఆరోగయ సమస్యలు ‘వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం, మెమోరీ లాస్, మీ తీర్పు నైపుణ్యం మీద మొదలగునవి ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి నిద్రలేమి సమస్యను నివారించడానికి కొన్ని మార్గాలను ఇక్కడ ఇస్తున్నాం. వాటిని పరిశీలించి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

నిద్రించే ముందు గోరువెచ్చని పాలు త్రాగాలి:

నిద్రించే ముందు గోరువెచ్చని పాలు త్రాగాలి:

మన పెద్దల కాలం నుండి మంచి నిద్ర పొందడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజాదరణ పొందింది. గోరువెచ్చని పాలలో అమినోయాసిడ్స్ కలిగి ఉండటం వల్ల నిద్రకలిగించే గుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిద్రించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలను త్రాగడానికి ప్రాధాన్యత ఇవ్వండి. గాఢనిద్రను పొందండి.

ఆకలి లేకుండా చూసుకోండి

ఆకలి లేకుండా చూసుకోండి

మీకు సరిగా నిద్రపట్టడం లేదంటే, అందుకు ఆకలి కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి, ఒక ఆరోగ్యకరమైన భోజనం ముగించిన తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తుంటే, అటువంటి సమయంలో క్రాకర్స్ లేదా గోధుమలతో తయారు చేసి స్నాక్స్ ను తినవచ్చు.

హెర్బల్ టీ

హెర్బల్ టీ

టీ ఒక పానీయంగా మీరు మరింత చురుకుగా ఉండేట్లు పరిగణిస్తుంటారు, అయితే కొన్ని రకాల హెర్బల్ టీలు నిద్రపట్టేందుకు సహాయపడుతాయి. చమోమైల్, పాసినో ఫ్లవర్ లేదా లెమన్ బామ్ టీ వంటి హెర్బల్ టీలు నిద్రను ప్రోత్సహించే కొన్ని మూలికా మిశ్రమాలున్నాయి.

నడక:

నడక:

ఒక సమయంలో మీ భోజనం తర్వాత , భౌతిక కార్యాచరణ రూపం దాల్చడం వల్ల మీరు బాగా నిద్ర పొందుటకు అవకాశం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత మీ ఇంటి ఆవరణంలో లేదా మీ టెర్రాస్ మీద కొంత నడక సారించడం వల్ల గాఢంగా నిద్రపట్టడంలో మరియు మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

కెఫిన్ తగ్గించాలి :

కెఫిన్ తగ్గించాలి :

రోజులో(పగలు) మీరు పనిలో చురగ్గా ఉండటానికి కాఫీని రెండు మూడు సార్లు త్రాగుతూ ఉండవచ్చు. కానీ, ఒక ఉత్తమ సలహా ఏంటంటే సాయంత్ర సమయాల్లో కెఫిన్ ఉన్నటువంటి పానీయాలు కానీ లేదా కాఫీ, టీలు కానీ త్రాగడం మానుకోవాలి. కెఫిన్ వల్ల గాఢ నిద్రను పొందలేరు.

షెడ్యూల్

షెడ్యూల్

షెడ్యూలింగ్ అనేది మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోడం, నిద్రలేవడం అనేవి అలవాటు చేసుకోవాలి. నిద్రించే ముందు గేమ్స్ చూడటం మంచిదే అయినా, రాత్రుల్లో ఎక్కువ సమయం గేమ్స్ ఆడటం వల్ల గాఢనిద్రను పొందలేరు. మీ నిద్రలో నాణ్యత కోల్పోతుంది.

స్మోకింగ్ మానుకోవాలి:

స్మోకింగ్ మానుకోవాలి:

చాలా మందిలో ధూమపానం కూడా నిద్రలేమి సమస్యకు ఒక ప్రధాన కారణం కావచ్చు. స్మోకింగ్ చేసేవారికి, సిగరెట్లలోని నికోటిన్ పదార్థం నిద్రలేమికి దారితీసేలా మెదడు మీద ప్రభావం చూపుతుంది. ధూమపానం ఆందోళన స్థాయిలను పెంచుతుంది. ఇది కూడా సరైన నిద్రలేకుండా చేస్తుంది.

విశ్రాంతి

విశ్రాంతి

నిద్రించడానికి ముందు, మీలోని ఆందోళనలన్నింటిని పక్కన పెట్టాలి. మనస్సులో ఆందోళనలు ఉన్నప్పుడు నిద్రలేమికి కారణం అవ్వడంతో పాటు, నిద్రల చెడు కలలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన విషయాలు ఆలోచించకుండా మంచి మనస్సుతో నిద్రించడానికి ప్రయత్నించాలి.

శ్వాస తీసుకోవడం

శ్వాస తీసుకోవడం

మీ శరీరం మరియు నరాల ఉధృతిని తగ్గించడానికి కొన్ని బ్రీత్ టేకింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన శ్వాస ప్రక్రియలు మీ హార్ట్ రేట్ ను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు బ్లడ్ ప్రెజర్ తగ్గించి నిద్రను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.

డాక్టర్ ను సంప్రదించాలి :

డాక్టర్ ను సంప్రదించాలి :

నిద్రలేమి సమస్య మిమ్మల్ని అలాగే వెంటాడుతుంటే కనుక మీరు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించినట్లైతే మీకు బాగా నిద్రపట్టేందుకు సహాయపడే సప్లిమెంట్స్ మరియు ఇతర మందులను సూచించవచ్చు. నిద్ర లేమి సమస్యకు మరో చికిత్స లేదా ప్రత్యామ్నాయం థెరపీలు. స్లీప్ థెరపీలు వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యను జయించగలిగారు.

దీర్ఘకాలం నిద్ర లేమి సమస్యత బాధపడేవారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నివారించేందుకు ప్రొఫెషనల్ చికిత్స తీసుకోవల్సి ఉంటుంది.

Desktop Bottom Promotion