Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మనం రోజూతినే ఆహారాలు కొన్ని క్యాన్సర్ కు కారణం అవుతాయి
క్యాన్సర్ ఒక భయంకర ప్రాణాంతక వ్యాధి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే చికిత్సలేని వ్యాధి అని భావించే వారు. కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో చికిత్సపద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా నివారించడం సాధ్యమే అవుతుంది. ప్యాశ్చాత్య పోకడలతో ప్రస్తుత రోజుల్లో సిగరెట్లు, మద్యం, ఫ్యాట్ ఫుడ్స్ , నిద్రలేమి వల్ల ఇటువంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇటుంటి చెడు వ్యసనాల భారీన పడకుండా, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ రిస్క్ ఎంత ఉన్నా దాన్ని చాలా వరకూ జయించినట్లే..
ముఖ్యంగా తీసుకొనే ఆహారం విషయంలో, మార్కెట్లో అనేక ఆహారాలు కలర్ఫుల్ గా కనిపిస్తూ, అనారోగ్యకరమైన ఆహారాలు మనల్ని ఆకర్శిస్తుంటాయి. అలాంటి ఆహారాలు, క్యాన్సర్ కు దారితీసే ఆహారాలు మార్కెట్లో అనేకం ఉన్నాయి. అటువంటి ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ నుండి వెంటనే తొలగించాలి. మనలో ఒక సాధారణ అలవాటు ఒకటుంది. సినిమాకెళ్ళినప్పుడు ఒక చేతిలో పాప్ కార్న్, మరోచేతిలో కలర్ఫుల్ కూల్ డ్రింక్ తీసుకొని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు . మరియు కొన్ని జ్యూసీ ఫ్రూట్ చూసి అవి మనకు ఆరోగ్యంకరం అనుకొంటాం. కానీ, ఇలాంటి కొన్ని ఆహారాలు, క్యాన్సర్ కారకాలని మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీకు ఆశ్చర్యం కలగవచ్చు.
అవుననే చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. మీరు రెగ్యులర్ తీసుకొని ఆహారాలు కొన్ని క్యాన్సర్ కు దారితీసే ఆహారాలు ఇక్కడ లిస్ట్ అవుట్ చేయబడ్డాయి.

ప్రొసెస్డ్ ఫుడ్స్
ఎవరైతే ఎక్కువ రెడ్ మీట్ (బీఫ్, సాసేజ్, బాకన్ మరియు హబర్గర్స్)వంటివి ఎక్కువగా తీసుకుంటారో వారికి బౌల్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.ప్రోసెస్డ్ మీట్ లో వివిధ రకాల కెమికల్స్ ఉపయోగివచడం వల్ల వీటి దుష్ప్రభావం మన శరీరం మీద పడుతుంది.

పొటాటో చిప్స్
చాలా వరకూ ప్రతి ఒక్కరికీ బంగాళదుంప చిప్స్ నచ్చుతాయి, కానీ వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ ప్రయోజనకారే అయినా, మోతాదుకు మించి తీసుకోవడం వల్ల హానికరమైన ప్రభావాలు చూపుతాయి . పొటాటో చిప్స్ లో అనేక ప్రిజర్వేటివ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మరియు కలర్స్ కలిగి ఉంటాయి.

హైడ్రోజనేటెడ్ లేదా వెజిటేబుల్ ఆయిల్
క్యాన్సర్ కు కారణం అయ్యే ఒక ప్రదానమైన ఆహారాల్లో ఈ హైడ్రోజనేటడ్ ఆయిల్ కూడా ఒకటి. వీటిలో కూడా వివిధ రకాలా హానికరమైన కెమికల్స్ ను ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలను, తినే ఆహారాలు నిల్వచేయడానికి తయారు చేసే ఆహారాల తయారీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇటువంటి నూనెలకు దూరంగా ఉండటం ఉత్తమం.

స్మోక్డ్, సాల్ట్ మరియు పికెల్ ఫుడ్స్
అధికంగా ఉప్పును ఉపయోగించి తయారు చేసిన ఆహారాలు, ఊరగాయలు, కాల్చిన పదార్థాలు స్టొమక్ క్యాన్సర్ కు దారితీస్తాయి. ముఖ్యంగా ఇటువంటి ఆహారాలను రెస్టారెంట్స్ లో ఎక్కువగా సర్వ్ చేస్తుంటారు. సాసేజ్, బాకాన్, సలామి మరియు బొలాంగ్నా వంటి వాటిలో సాల్ట్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

ప్రోసెస్డ్ వీట్ ఫ్లోర్
ప్రొసెస్డ్ ఫుడ్స్ లో రిఫైన్ చేసిన పిండి పదార్థాలు మనం ఎక్కువగా, సాధారణంగా ఉపయోగిస్తుంటాం. కానీ, ఈ ప్రొసెస్డ్ ఆహారాల్లో అధిక కార్బోహైడ్రేట్స్ వల్ల 220శాతం బ్రెస్ట్ క్యాన్సర్ ను పెంచుతుంది.

రిఫైండ్ షుగర్స్
రిఫైండ్ షుగర్స్ వల్ల డయాబెటిస్ వస్తుంది. క్యాన్సర్ కు కారణం అయ్యే ఆహారాల పరంగా చూస్తే రిఫైండ్ షుగర్స్ చాలా ప్రమాధకారి. ఈ స్వీట్నర్స్ లో క్యాన్సర్ సెల్స్ ను ఏర్పరిచే ఫ్రక్టోజ్ నిల్వ ఉంటుంది.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్
ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ క్యాన్సర్ కు దారితీసి ఒక ప్రధాన ఆహారం. ఇది పుట్టుకలోపాలను పెంచుతుంది. మరియు వివిధ రకాల క్యాన్సర్ కు దారితీస్తుంది.

డైట్ ఫుడ్స్
కోక్ కంట్ డైట్ కోక్ ఉత్తమమని వారు చెబుతుంటారు. కానీ డైట్ ఫుడ్స్ లో హై డిగ్రీ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి. ఫ్యాక్ చేసిన మరియు ఫ్రోజోన్ ఫుడ్స్ ‘టాగ్ ‘డైట్' లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి.

సోడా పాప్ మరియు కూల్ డ్రింక్స్
సోడాలో పంచదార, ఫుడ్ కెమికల్స్ మరియు కలర్స్ కలపబడి ఉంటాయని చెబుతుంటారు . సోడా శరీరంలో గ్యాస్ ఉత్పత్తికి కారణం అవుతుంది మరియు అలాగే కొద్దిగా తక్కువగా క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ కూడా మీరు దూరంగా ఉండాలి.

క్యాన్డ్ స్టఫ్
శరీరంలో క్యాన్డ్ ఫుడ్స్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఇది డిపెండెంట్ క్యాన్ లోపలి భాగంలో బిస్ ఫినోల్ లైనింగ్ కలిగి వుండి పానియాలతో పాటు ఇవి కరగడం వల్ల మన శరీరంలో చేరి హాని తలపెడుతాయి.



Click it and Unblock the Notifications
