Latest Updates
-
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
మెనుష్ట్రువల్ పెయిన్ నివారించడానికి బెస్ట్ హోం రెమడీస్
మహిళలను ముఖ్యంగా వేధించే సమస్య పిరియడ్ ప్రాబ్లమ్... ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా అవస్థపడతారు.. ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి.
యుక్తవయస్సులో అంటే 18 నుంచి 24 సంవత్సరాల వరకూ ఉన్న స్త్రీలలో బహిష్టు సమయంలో కడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ, వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది. డిస్మెనోరియాను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చును. మొదటిది ప్రైమరీ డిస్మెనోరియా, రెండవది సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా యుక్త వయస్సులోని స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. వీరికి బహిష్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి తీవ్రత ఎకువగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా హార్మోనుల అసమతుల్యతే కారణం. సెకండరీ డిస్మెనోరియా వయస్సు మీరిన స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి గర్భాశయ కంతులు, పెల్విక్ ఇన్‌ఫెక్షన్లు ఉండటం కారణం. అలాగే బహిష్టు సమయంలో ఎకండరాల సంకోచాల వల్ల, గర్భకోశ ముఖ ద్వారం వంగి ఉండటం వల్ల, ఒవేరియన్ సిస్టుల వల్ల కూడా బహిష్టు సమయంలో కడుపునొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అందుకు ప్రధాణ కారణం మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, జన్యు లోపాలు.
పీరియడ్స్ లో పొట్ట నొప్పిని పోగొట్టే అద్భుతమైన చిట్కాలు: క్లిక్ చేయండి
ఆ రోజుల్లో పిండిపధార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. అంటే అన్నం, అరటిపండు, అటుకులు, గోధుమ, బ్రెడ్, కార్న్ ప్లెక్స్ ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అందుకోసం పాలు, పళ్ళను కూడావీటికి జతచేయాలి. రక్తస్రావం వల్ల కొంత రక్తం కోల్పోతారు. కాబట్టి మాంసకృత్తులు, ఐరన్, కాల్షియంచ విటమిన్ సి వుండే ఆహారం తీసుకోవాలి. మాసహారం, గుడ్లు, ఆకుకూరలు, నట్స్, డ్రై ప్రూట్స్ ఈ కోవలోకి వస్తాయి. వీటిని తీసుకుంటే కణజాలాభివృద్ది (రక్తస్రావం వల్ల కొంత కణజాలాన్ని కోల్పోతారు ఆ లోటును పూడ్చేందు) కి అవసరమైన ఆహారాన్ని శరీరానికి అందించినట్లవుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆహారాలు..

పాలు:
మీ బ్రేక్ ఫాప్ట్ లో పాలు తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యే క్యాల్షియం అంది, నొప్పికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మీకు పాలు త్రాగడం ఇష్టం లేకపోతే క్యాల్షియం మాత్రలు తినవచ్చు. ముఖ్యంగా రుతుక్రమ సమయంలో ఇవి బాగా సహాయపడుతాయి.

బొప్పాయి
పీరియడ్స్ సమయంలో లేదా పీరియడ్స్ కు ముందు బొప్పాయిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఎంజైమ్స్, పెపైన్, మెనుస్ట్రువల్ పెయిన్ కు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్లడ్ ఫ్లో కూడా స్మూత్ గా మరియు ఈజీగా అవుతుంది.

క్యారెట్:
క్యారెట్ కంటి ఆరోగ్యానికి మాత్రమే కాదు, మరియు ఇది మెనుస్ట్రువల్ పెయిన్ ను నివారిస్తుంది. మెనుస్ట్రువల్ సమయంలో ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్ల మెనుస్ట్రువల్ సమయంలో నొప్పిని నివారించి, సరైన బ్లడ్ ఫ్లోకు సహాయపడుతుందని గైనకాలజిస్ట్ ల యొక్క సలహా.

అలోవెరా
అలోవెరా శరీరంలోని అన్ని అవయవాలకు ఒక దివ్వౌషదం వంటిది మరియు మెనుస్ట్రువల్ పెయిన్ కూడా ఇందులో ఒక బాగమే. ఒక స్పూన్ తేనెను అలోవెరా జ్యూస్ లో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మెనుస్ట్రువల్ క్రాంప్స్, పెయిన్స్ ఉండవు.

ల్యావెండర్:
లావెండర్ లో ఉపశనమం కలిగించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. పీరియడ్స్ సమయంలో లావెండర్ ఆయిల్ ను పొట్ట చుట్టూ అప్లై చేయండ వల్ల మెనుస్ట్రువల్ పెయిన్ ను నివారించవచ్చు.

తులసి
పీరియడ్స్ సమయంలో తులసిని తినడం మంచిది ఇందులో ఉండే కెఫిక్ యాసిడ్, ఇది చాలా పవర్ ఫుల్ అనాలజీసిక్ (పెయిన్ రిలీవింగ్ )లక్షనాలు కలిగినది. హెర్బల్ టీలో దీన్ని ఉపయోగించవచ్చు.

వేడి నీళ్ళ స్నానం:
వేడి నీళ్లతో స్నానం చేయడంవల్ల వెన్ను నొప్పి, ఒంటి నొప్పులను ఎదుర్కొనవచ్చు. ఇదే కాకుండా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వటానికి ఏదైన మంచి చిత్రం చూడటం లేదా ఏదైనా చిక్సిత తీసుకుంటేనొప్పి నుంచి కొంత రిలాక్స్‌నెస్ పొందవచ్చు.

అల్లం:
పీరియడ్స్ సమయంలో అల్లంను పెయిన్ రిలీవింగ్ ఏజెంట్ గా ఉపయోగించవచ్చు. అంతే కాదు ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను రెగ్యులర్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. జింజర్ టీ తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ బెనిఫిట్స్ ఉంటాయి.

సిట్రస్ పండ్లు:
సిట్రస్స్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల మన శరీరంలో కావల్సినంత ఐరన్ పొందుతుంది. ఇది పీరియడ్స్ లో నొప్పిలేకుండా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ యొక్క జ్యూస్ లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

సోంపు
యూట్రస్ బ్లడ్ డివైడ్ చేస్తుంది, కాబట్టి వోవరీస్ లో బ్లడ్ సర్కులేషన్ మెరుగుపచడానికి సోంపు బాగా సహాయపడుతుంది . ఒక గ్లాసు నీటిలో సోంపు వేసి ఉడికించి , తర్వాత వడగట్టి త్రాగడం వల్ల మెనుస్ట్రువల్ క్రాంప్ అండ్ పెయిన్ ను నివారించవచ్చు.

వ్యాయామం:
రెగ్యులర్ వ్యాయామం చాలా ముఖ్యం. చాలా మంది పీరియడ్స్ సమయంలో వ్యాయామాన్నిచేయకుండా ఉండిపోతారు. అయితే ఇది చాలా తప్పు. వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. పెల్విక్ కూడా రక్తప్రసరణ మెరుగ్గా ఉండి నొప్పిని నివారిస్తుంది. కొన్ని యోగా భంగిమలు కమలాసనం, సీతాకోకచిలుక ఆసనం వంటివి పీరియడ్‌వల్ల కలిగేనొప్పిని, అసౌకర్యాన్ని దూరం చేస్తాయి..

న్యూట్రీషియన్ ఫుడ్
కొన్ని సందర్భాల్లో మెనుస్ట్రువల్ పెయిన్ న్యూట్రీషియన్ లోపం వల్ల ఏర్పడుతుంది కాబట్టి బ్యాలెన్స్ డైట్ ను చేర్చుకోవాలి. అందుకు మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, అలాగే వాల్ నట్స్, గుమ్మడి విత్తనాలు వంటివి తీసుకోవడం వల్ల మెనుస్ట్రువల్ క్రాంప్ మరియు పెయిన్ నుండి ఉపశమనం పొందవచ్చు.

జంక్ ఫుడ్ నివారించాలి:
పీరియడ్స్ సమయంలో ఆహారపు అలవాట్లు మీద ప్రత్యేక శ్రద్ద పెట్టడం చాలా అవసరం. ఫ్యాట్ మరియు జంక్ ఫుడ్స్ కు ఖచ్చితంగా చెక్ పెట్టండి. బర్గర్, పాస్తా వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఆల్కాలిక్ మరియుకార్బొనేటెడ్ బెవరేజస్ మరియు కోల్డ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications











