Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
జీర్ణసమస్యలన్నింటికి ఉత్తమ ఆసనం: ఏకపాదఉత్తాసనం
ఏక పాద ఉత్తాసనంను ఒక కాలు ఎత్తే యోగ భంగిమ అని పిలుస్తారు. మీ ఉదరం మరియు తొడల యొక్క కండరములను టోన్ చేయటానికి సహాయపడే ఉత్తమ ఆసనాలలో ఇది ఒకటి. అంతేకాక ఈ భంగిమలో ఛాతీ తెరుచుకోవడం వలన అస్తమా ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో మొత్తం శ్వాస వ్యవస్థ ఉత్తేజాన్ని మరియు శరీరం కోల్పోయిన ప్రాంతాలకు తాజా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఈ ఆసనం ఫ్లెక్సిబుల్ గా ఉండటానికి సహాయం చేస్తుంది. మీ హిప్ కండరములను ఎక్కువ ఫ్లెక్సిబుల్ గా మరియు మీ వీపు కింది భాగంను బలోపేతం చేస్తుంది. ఈ భంగిమ తీరును పరిగణనలోకి తీసుకుంటే ఏమి జరుగుతుంది. ఏక పాద ఉత్తాసనం జీర్ణ క్రియ మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. మీ లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన అవయవాలకు నేరుగా మసాజ్ అవుతుంది. మీకు ఒక ఆరోగ్యకరమైన లిబిడో ని ఇవ్వటానికి భరోసా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఋతు లోపాలతో బాధపడుతూ ఉంటే ఈ అసనంను డాక్టర్ సలహాతో వేయండి.

ఈ ఆసనం చేయటానికి స్టెప్స్:
1. మీరు కింద పడుకొని మీ రెండు కాళ్ళను ముందుకు చాచి,రెండు చేతులను మీ పక్కన నేలపై కింద పెట్టాలి.
2. మీ మొత్తం శరీరం ఈ దశలో విశ్రాంతిగా ఉందని నిర్ధారించుకోండి.
3. ఇప్పుడు మొత్తం కాలి కండరాలను బిగించి మీ కుడి కాలిని స్ట్రైట్ గా పైకి ఎత్తాలి.
4. తరువాత,గాలి పీల్చుకోవాలి. అలాగే మీ కాలు ఎత్తటం వలన మీ శరీరం లంబంగా ఉంటుంది. మీరు కాలును కదపకూడదు. ఎందుకంటే మీ వీపు భాగం గాయపడవచ్చు.
5. శ్వాసను బిగబెత్తి 6 సెకనుల పాటు ఈ స్థితిలో ఉండండి.
6. ప్రారంభ స్థానంనకు తిరిగి వెళ్లడానికి నెమ్మదిగా గాలి వదులుతూ మరియు అదే సమయంలో మీ కాలును కిందికి దించాలి. ఆరు శ్వాసల కోసం విశ్రాంతి తీసుకోని,తర్వాత ఎడమ కాలితో కూడా అదే విధంగా వ్యాయామంను చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
