Latest Updates
-
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
డెస్క్ జాబ్ తో ఆరోగ్య దుష్ప్రభావాలు..!
డెస్క్ జాబ్ అంటే మన దృష్టిలో కూర్చుని చేసే ఉద్యోగమే. మనలో చాలా మంది 9 నుండి 5 గంటల వరకు పనిచేస్తే అది ‘నార్మల్' లేదా మన జీవితంలో మరింత ఎక్కువగా పనిచేయడం అవసరంగా మారుతోంది. బయట తిరగకుండా నీడపట్టున కూర్చుని పనిచేసుకోవచ్చనే పాజిటివ్ యాంగిల్ కూడా డెస్క్ జాబ్‌కి ఉంది. ఆ పాజిటివ్ అంశమే నేడు నెగెటివ్‌గా మారిపోయింది. గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చేసే వ్యక్తుల్లో అనారోగ్యాలు సైతం తిష్టవేస్తున్నాయి.
ఆఫీస్ ఉద్యోగాలు రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారిలో అనేక ఆరోగ్య ప్రమాధాలతో సంబంధం కలిగి ఉన్నాయి. డెస్క్ జాబ్ వల్ల ముఖ్యంగా అనేక క్రోనిక్ హెల్త్ ప్రాబ్లమ్స్: వెన్నునొప్పి, కీళ్ళ నొప్పుల మరియు ఊబకాయం వంటి ప్రధాన సమస్యలకు దారి తీస్తుంది. డెస్క్ జాబ్ వల్ల వచ్చే ఈ హెల్త్ ఎఫెక్ట్స్ చాలా మందిలో చాలా క్రిటికల్ గా ఉంటాయి. చాలావరకూ చదువుకున్న వారు ఆఫీస్ ఉద్యోగాలను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేసుకుంటారు.
డెస్క్ జాబ్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిసినా కూడా, ఈ విషయంలో చదువుకొన్న వారికి అంత కంటే మంచి ఛాయిస్ మరోకటి ఉండదు. అయితే, ఆఫీస్ జాబ్స్ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సహాపడుతుంది. అందువల్ల, ఆ ముందుజాగ్రత్తలు తీసుకోవడానికి కంటే ముందు, డెస్క్ జాబ్స్ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోండి.

లోయర్ బ్యాక్ పెయిన్
లోయర్ బ్యాక్ పెయిన్ ఇది ఎప్పటికీ దీర్ఘకాలిక వ్యాధి కాదు. ఇది చాలా సాధరణ సమస్య. రోజంతా కంపూటర్ చూస్తూ కీబోర్డ్ తో పనిచేసే వారికి ఎదురయ్యే ఒక సాధారణ సమస్య.

ఊబకాయం
సాధారణంగా 8-10గంట సమయం ఆఫీస్ లో కూర్చిని పనిచేయడం ద్వారా, కొంత సమయానికి ఎనర్జీ తగ్గిపోతుంది. దాంతో వర్క్ ప్లేస్ లో తినే ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకొని స్నాక్స్ మీద ఎక్కువ ఆధారపడుట వల్ల ఊబకాయంకు దారితీస్తుంది. పనిచేయని కండరాలు మెటబాలిజం ఫ్యాట్స్ ను విడుదల చేయడం వల్ల ఊబకాయం ఎదుర్కోవలసి వస్తుంది.

హార్ట్ అటాక్
డెస్క్ జాబ్స్ చేసే వారిలో ఒకటి రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. రోజుకు 10గంటలు కుర్చీలో కూర్చొని పనిచేయడం వల్ల, గుండె కండరాలకు ఎటువంటి వ్యాయామం లేకపోవడమే ప్రధాణ కారణం.

భుజాలా నొప్పి
ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అది మీ భుజాలు మరియు మెడ మీద ఒత్తిడి పెంచి నొప్పులకు దారితీస్తుంది. కొన్ని సమయాల్లో ఈ నొప్పులను నివారించడం కష్టం అవుతుంది.

అలర్జీలు
చాలా వరకూ ఆఫీసుల్లో ఎయిర్ కండీషనర్లు ఉంటాయి. ఇది మరో హానికరమైన ఆరోగ్య దుష్ప్రభావం. ఇది చాలా త్వరగా అలర్జీలకు గురిచేస్తుంది. ఆఫీస్ లోపల ఎయిర్ కండీషనర్ యొక్క స్థిరంగా ఉన్న గాలి, అలర్జీలకు ప్రధాన కారణం అవుతుంది.

బ్యాడ్ పోస్చర్(కూర్చొనే భంగిమ)
కూర్చీలో ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం వల్ల, ఇది అన్ని రకాల నొప్పులను మరియు బాధలను కలిగిస్తుంది.

జీర్ణక్రియ సమస్యలు
మీ శరీరం రోజంతా కూర్చోవడానికి సహకరించదు. ఫలితంగా జీవక్రియలు నిధానంగా పనిచేస్తాయి. ఫలితంగా క్రోనిక్ డైజషన్ ను సమస్యలు పెరగుతాయి.

కడుపులో నొప్పి
డెస్క్ జాబ్ వల్ల ఎసిడిటి మరియు అజీర్తి సమస్యలతో పాటు పొట్ట ఉదర భాగంలో నొప్పి కలిగిస్తుంది.

కండరాలు బలహీనంగా మారుతాయి
రోజంతా కూర్చొని పనిచేయడం వల్ల మీ కండరాలు బద్దకిస్తాయి. ముఖ్యంగా మీ కాలు యొక్క కండరాలు బద్దకంగా మారీ అది మీ బరువుకు బలమీనంగా మార్చతాయి.

స్పాండిలైట్స్
రోజంతా కూర్చొని పనిచేయడం వల్ల స్పైనల్ కార్డ్ చాలా చెడుగా ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో వెన్నుముక బెండ్ అవుతుంది. ఫలితంగా వెన్ను పూసల మద్య గ్యాప్ ఏర్పడుతుంది. ఇది క్రోనిక్ సమస్యలకు దారితీసి స్పాండిలైట్స్ సమస్యకు దారితీస్తుంది.

విటమిన్ డి డిఫిషియన్స్
రోజంతా ఆఫీస్ లోపల కూర్చొని పనిచేయడం వల్ల, మనం ఎండ ముఖం చూసే పని ఉండదు. అందువల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఫలితంగా ఎముకలు పెళుసు బారే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి.



Click it and Unblock the Notifications











