Latest Updates
-
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
హై ఫీవర్ ను నేచురల్ గా తగ్గించుకోవడం ఎలా?
రోగ నిరోధక శక్తి అంతంతమాత్రంగా ఉన్న బాధితుడు పోలెన్, లేదా దుమ్ము వంటి అలెర్జెన్‌ను లోనికి పీల్చుకున్నప్పుడు అలెర్జిక్ రినైటిస్, లేదా హే ఫీవర్ వస్తుంది. ఇది ఒంట్లో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచేస్తుంది. ఈ యాంటీబాడీలు చాలావరకు హిస్టమైన్లుండే మాస్ట్ కణాలతో బంధం ఏర్పరచుకుంటాయి. పొలెన్, దుమ్ము, హిస్టమైన్ (ఇతర రసాయనాల) ద్వారా ప్రభావితమైనప్పుడు ఈ మాస్ట్ కణాలు విడుదలవుతాయి. ఇది దురద, వాపు, శ్లేష్మం ఉత్పత్తి వంటివాటికి దారితీస్తుంది. ఈ లక్షణాల తీవ్రత వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. బాగా సున్నితంగా ఉండే వ్యక్తుల్లో హైవ్స్, దురద వంటివి కన్పించవచ్చు.
మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 370 లేక 98.60ఉంటే అది నార్మల్ అని అంటారు. శరీర ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉంటే అది జ్వరం అంటారు. సాధారణంగా 37.50 (100 ) వుంటుంది. జ్వరం అన్నది శరీరంలో వున్న ఏదో ఒక వ్యాధి లక్షణము మాత్రమే వ్యాధి ప్రభావము పెరిగే కొద్ది జ్వర తీవ్రత అధికమవుతుంది. 39.50 c లేదా 1030Fకు పైన ఉన్నా తప్పనిసరిగా డాక్టరు సలహా తీసుకోవాలి.
సాధారణ కారణాలు: మలేరియా, టైఫాయిడ్ , క్షయ, రుమాటిక్ జ్వరము, ఆటలమ్మ, గవదలమ్మ, ఊపిరితిత్తులు ఇన్ పెక్షన్, జలుబు, దగ్గు, టాన్సిలైటిస్ , బ్రాంకైటిస్ మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ మొదలైనవి. బ్యాక్టీరియా, వైరస్.

సాధారణ జ్వరం లక్షణాలు: 37.50 C లేదా 1000 F ఆ పైన జ్వరం నమోదు. తలనొప్పి, చలితో కూడిన జ్వరం, కీళ్ళనొప్పులు, నోరు చేదుగా ఉండుట, అకలి తగ్గడం, మలబద్దకం, కొన్ని ప్రత్యేక సమయాలలో కలవరింతలు మొదలైనవి
జ్వరం వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు
1. జ్వరం వచ్చిన వ్యక్తి వున్న వాతావరణం చల్లగా ఉండేటట్లు చూడాలి. సాధారణ ఫ్యాన్ క్రింద పరుండబెడితే కొంత ఉపశమనముంటుంది. పలుచటి దుస్తులు వాడాలి. పలుచటి దుప్పట్లు వాడాలి.

2. గోరువెచ్చని నీళ్ళతో శరీరమంతా తుడవాలి. చల్లని నీళ్ళ తో శరీరము తుడవరాదు. నుదుటి మీద తడిగుడ్డ వేయడం వలన ఉపయోగం లేదు

3. నీళ్ళు ద్రవ పదార్దాలు అధికంగా తీసుకోవాలి. అధికంగా నీరు త్రాగాలి

4. విశ్రాంతి : అధిక జ్వరం ఉన్నప్పుడు బయట ఎక్కువగా తిరగకుండా, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

5. జ్వరం ఉన్నప్పుడు శరీరానికి అధిక కేలరీలు అవసరము అవుతాయి కనుక గ్లూకోజ్, హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి. బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమై య్యే పదార్దాలు ఇవ్వాలి. కాఫీ , టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి. పాలు , రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును. మాంసం, గుడ్డు, వెన్న, పెరుగు, నూనె పదార్దాలు తీసుకోరాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.




Click it and Unblock the Notifications