మీకు బీపి ఉందా మరి మీకున్న అపోహలు-వాస్తవాలు

వాస్తవం: ఏ వ్యక్తికైనా బీపీ 140/90 మి.మి. కంటే హెచ్చుగా ఉందంటే అది అసాధారనం( అది అధిక రక్తపోటును సూచిస్తుంది) అతనికి ఎలాంటి బీపీ లక్షణాలు కనిపించకపోయినా చికిత్స ప్రారంభించాల్సిందే. ఇటీవలి వైద్య మార్గదర్శకాల ప్రమాణం ప్రకారం 60 ఏళ్ల వయసు వ్యక్తికి బీపీ చికిత్స అవసరాన్ని సడలించారు, అతని బీపీ 150/90 గా నమోదయ్యే వరకు మనం ఎదురు చూడవచ్చు కానీ చిన్న వయసులోనే బీపీ పై మోతాదును మించినట్టయితే వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు.

అపోహా : అధిక రక్తపోటు (హైబీపీ) ఒత్తిడికి దారి తీస్తుంది. తలనొప్పి ఇతర లక్షణాలు కనిపిస్తాయి
వాస్తవం : సాధారణంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోగులు తమకు బీపీ వ్యాది ఉన్న సంగతి తెలియదు. ఎందుకంటే వారికి ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు. ఎప్పుడూనా వారు కిడ్నీ, గుండె పోటు వంటి సమస్యలకు గురయితేనే కానీ తమకు బీపీ లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తారు. కనుకు హై బీపీ గురించి తెలుసుకోవాలనుకునే వారు తరచుగా బీపిపి చెక్ చేయించుకుంటూ ఉండాలి. కుటుంబంలో ఎవరైనా హైబీపీ కలిగిన వారుంటే మీరు 30 ఏళ్ల వయసులోనే బీపీ చెక్ చేయించుకోవడం ద్వారా హైబీపీకి గల కారణాలను తెలుసుకొని చికిత్స మొదలు పెట్టి బీపీని నియంత్రించవచ్చు.

అపోహ: హైబీపీ కి ఒకసారి మందులు వాడడం మొదలుపెడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిటుంది. కాబట్టి మందులు మొదలు పెట్టకపోవడమే మంచిది.
వాస్తవం : వైద్యం చేస్తున్న డాక్టర్లు రోగి అవసరానికి తగిన మందులను చికిత్సవిధానాన్ని నిర్ణయిస్తారు. జీవన విధానంలో మార్పులను అంటే వాకింగ్, యోగా, ఉప్పు వాడకం మొదలైన విషయాలను సూచిస్తారు. ఒక వ్యక్తి రక్తపోటు రెండవ దశకకు చేరిన వ్యక్తి ఎలాంటి ఒత్తిడులు లేదా ఆందోళనలకు గురికాకూడదు అలా జరిగిన పక్షంలో ఆ వ్యక్తికి తాత్కాలికంగా బీపీ పెరగవచ్చు. బీపీ 140 నుంచి 159 ఎంఎం మధ్య ఉంటే సిస్టాలిక్ ప్రెషర్ గారే 90-99 ఎంఎం ల మధ్య ఉంటే డైయాస్టాలిక్ ప్రెషర్‌గా గుర్తిస్తారు.

ఈ దశలో ఉన్న వారికి మందులతో చికిత్స ప్రారంభించడానికి ముందుగా వారి జీవన విధానాన్ని ఆరు వారాల నుంచి మూడు నెలల వరకు పరిశీలించాలి. మనం బీపీకి చికిత్స ప్రారంభించడానికి ముందు మన జీవన శైలిలోని మార్పులు ఎంతో అవసరం అన్న విషయం గ్రహించాలి. అలాజరగని పక్షంలో మందులు ప్రభావవంతంగా పని చేయవు. ఒక్కసారి హైబీపీ సమస్య మొదలైతే ఒక్కసారి మందులు వాడితే తగ్గిపోయే జబ్బు కాదు.

అపోహ : బీపీకి వాడే మందులన్నీ మంచివి కావు వాటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి.
వాస్తవం : ప్రస్తుతం హై బీపీని తగ్గించడానికి సరికొత్త ప్రభావవంతమైన మంచి మందులను మనం వాడుతున్నాం. వీటిని దీర్ఘకాలికంగా వాడినా కూడా సురక్షితంగానే ఉంటారు. అతి తక్కువ కేసుల్లో దుష్ప్రభావాలు కనిపిస్తాయి. వెంటనే డాక్టర్లు మరో రకం మందును మార్చి హైబీపీని సమర్థవంతంగా నియంత్రిస్తారు. మందుల దుష్ప్రభావాల గురించి చింతించాల్సిన అవసరం లేదు.

Myths and Facts about Blood Pressure

నియంత్రణ సాధ్యం కానీ సెకండరీ హైబీపీ వల్ల అవయవాలు దెబ్బతిన కుండా వాటిని కాపాడుకోవడమే మన లక్ష్యం. చాలా మంది చికిత్స పొందుతున్న రోగుల్లో చిన్నచిన్న సైడ్ ఎఫెక్ట్‌ల కన్నా దారుణంగా అవయవాలు దెబ్బతింటుంటాయి.

అపోహ: ఒక్కసారి బీపీ కంట్రోల్‌కు వచ్చిందంటే ఇక మందులు వేసుకునే అవసరం లేదు
వాస్తవం : ఎట్టిపరిస్థితుల్లోనూ మందులు మాన కూడదు. బీపీని కంట్రోల్ చెయ్యడానికి వాడే మందుల ప్రభావం మీరు వాటిని వాడుతున్నంత కాలం ఉంటుంది. ఒక్కసారి మందులు వాడడం మానేస్తే మళ్లీ బీపీ పెరుగుతుంది. కొందరు రోగులకు బీటా బ్లాకర్స్ లాంటి మందు వాడుతున్నపుడు బీపీ సాధారణ వైద్యానికి లొంగనంతగా అనూహ్యంగా పెరిగిపోతుంది. కనుక హైబీపీ తగ్గినా కూడా మందుల వాడకం మానకూడదు. మందులు వినియోగం తగ్గడానికి హైబీపికి గురయిన 90 శాతం రోగులకు దీర్ఘకాలం వైద్య చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉంది.

బీపీ పెరిగి పోయిన గర్భిణులలో కొద్ది మంది ద్వితియ శ్రేణి హైబీపికి గురయిన రోగుల్లో మాత్రం బీపీ సాధారణ లెవల్లోకి చేరగానే ఈ మందుల వాడకాన్ని ఆపడం జరుగుతుంది. సుఖమయ జీవితాన్ని సాగించడానికి ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి పనిచేస్తారో అలాగే బీపిని కంట్రోల్ చేసే వైద్యం విషయంలో కూడా కష్టపడాలి.

అపోహ: ఒక్కసారి మీరు హైబీపి బారిన పడ్డారంటే ఇక జీవితం ముగిసినట్టే, చాలా బలహీనమవుతారు, గతంలోలాగ ఇక జీవన వ్యవహారాలను చేసుకోలేరు
వాస్తవం : రోగికి గల హైబీపీ వ్యాధిని సరైన వైద్య విధానం ద్వారా కంట్రోల్ చేసి అతను తిరిగి తన సాధారణ జీవన వ్యవహారాలను సక్రమంగా నెరవేర్చు కొనేలా చేయవచ్చు. అందుకు గాను అతను చేయవలసిందల్లా క్రమం తప్పకుండా విధిగా మందులను తీసుకోవాలి. మిగతా అంతా యథావిధిగా జరిగిపోతుంది. కేవలం కొద్ది మంది నిర్లక్ష్యం వల్ల తొలి నాళ్లలో తమకు హైబీపీ ఉన్న సంగతి తెలిసుకొనందుకు దురదృష్ట వశాత్తు వారి కిడ్నీలు దెబ్బతినడం, గుండె పోటు లాంటివి సమస్యలు వస్తున్నాయి.

వారికి అవసరమైన చికిత్స ప్రారంభించడానికి ముందు వారి జీవన శైలిలోని అలవాట్లను మార్చల్సి ఉంటుంది. శరీరంలో ఏర్పడిన చెడు మార్పులను, రోగ లక్షణాలను గుర్తించడం మంచిది. అలా చేయడం వల్ల శరీరంలో గుండె రక్త ప్రసార విధానాన్ని, కిడ్నీ పని తీరును క్రమం తప్పకుండా సరైన వైద్య విధానం ద్వారా సరిచేసి ఆ అవయవాలను యథాస్థితికి తేవచ్చు.

అపోహ: బీపి మందులతో పాటు ఇతర మందులను తీసుకోవడం లేదా వ్యాయామం చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి
వాస్తవం : అలాంటిదేమి జరగదు. ఒకపక్క స్టాటిస్ లాంటి కొలెస్ట్రాల్ తగ్గించే మందుల వాడకం హైబీపి రోగులలో గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలను రాకుండా గణనీయంగా నిరోధిస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో నడక తేలిక పాటి వ్యాయామాలుచేయడం వల్ల బీపీని అదుపులో ఉండచమే కాదు శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

ఎవరికైనా షుగర్ లేదా ఇతర సమస్యలు ఉంటే అవసరాన్ని బట్టి ఇతర మందులను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్, సంతాన నిరోధక మాత్రలు లాంటి మందులను తీసుకున్నపుడు మాత్రం అవి బీపీని ప్రభావితం చేసి ఇతర సమస్యలకు కారణమవుతాయి. కనుక ఎలాంటి మందులనైనా వైద్యుల సలహాల ప్రకారమే తీసుకోవాలి,

అపోహ: ఇప్పటికి హైబీపి కి సరైన చికిత్స దొరక మరణిస్తున్నారు
వాస్తవం: అవును ఇది నిజానికి వాస్తవమే. భారి సంఖ్యలో రోగులు హైబీపీ వ్యాధితో బాధ పడుతున్నారు వారి బీపి అదుపులో ఉండడం లేదు. అందుకు గల సాధారణ కారణం వారికి సరైన వైద్య చికిత్స అందకపోవడమే అంతేకానీ మందుల ప్రభావం కాదు. మందులను అందరికి ఆమోదయోగ్యం చెయడం ద్వారా చాలా మంది రోగుల బీపి కంట్రోల్ శాతాన్ని బాగా తగ్గించవచ్చు.

కొంత మంది రోగులు ఒకటి కన్నా ఎక్కువ మందులు వేసుకోవడం వల్ల బీపి స్థాయి తగ్గడం లేదు అలాంటి వారి కోసం రీనల్ డీనర్వేశస్ లాంటి సరికొత్త ఆధునిక వైద్య విధానాన్ని అభివృద్ధి చెయ్యాల్సి ఉంది అది కొందరిలో హైబీపీ తగ్గించడమే కాదు చాలా మంది రోగులు వేసుకొనే మందుల సంఖ్యను కూడా తగ్గిస్తుంది.హైబీపిని అదుపులో ఉంచడానికి డాక్టర్ ఇచ్చిన ఒక చిన్న మందు బిళ్ల ఎంతో ప్రభావ వంతంగా హార్ట్, కిడ్నీ వైఫల్యాన్ని 50 శాతం, బ్రెయిన్ స్ట్రోక్‌ను 33శాతం, హార్ట్ ఎటాక్‌ను 25 శాతం వరకు గణనీయంగా నియంత్రిస్తుంది. క్రమంతప్పకుండా మందులు వాడడం ద్వారా పూర్తి ఆరోగ్యంతో జీవితం గడపవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 24, 2014, 11:49 [IST]
Desktop Bottom Promotion