Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కండరాల నొప్పి నివారించే బెస్ట్ హోం రెమెడీస్
ఏదో ఒక దశలో ప్రతివారిలోనూ కండరాల నొప్పి కనిపించడం సహజం. రోజువారీ పనివల్ల లేదా పనిభారం పెరగటం వల్ల వచ్చే కండరాల నొప్పితో సతమతం అవుతున్నవారు ఎందరో ఉన్నారు. అయితే శరీర కదలికలను, అవసరాలను ఏర్పాటు చేసి ముఖ్య అవయవాలను కాపాడే కండరాల నొప్పిని లోపల జరిగే అసమతుల్యత, అనారోగ్య లక్షణాలను తెలియజేసే సూచికలుగా భావిస్తారు.
మానవుని శరీరంలో సుమారు ఆరువందల యాభై కండరాలు ఉంటాయి. ఇవి శరీర బరువులో సగభాగం ఉంటాయి. కండరాలు కట్టలుగా కట్టబడిన కొన్ని పీచునారలు(ఫైబర్)కలిగి ఉంటాయి. వీటివలన కండరాలకు కుదించుకుపోవడం, మళ్లీ తరువాత తమ పూర్వస్థితికి వచ్చే సామర్థ్యం ఉంటుంది. కండరాలు ఎముకలకు టెండాన్స్‌లో కలపబడతాయి. కండరాలు శ్రమించినపుడు లాక్టిక్ యాసిడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనం వలన కండరాలు తొందరగా అలసటకు లోనవుతాయి. కండరాల నొప్పి సాధారణమైన సమస్య. ఇది ఒకటి లేక చాలా కండరాల వలన రావచ్చు. ఈ నొప్పి లిగమెంట్స్, టెండాన్స్, ఎముకలు లేదా శరీరఅవయవాల వలన కూడా రావచ్చు.
కారణాలు: గాయాలు, కండరాలుపై ఎక్కువ ఒత్తిడి ఉదాహరణకు వ్యాయామం, శారీరక శ్రమ అధికంగా ఉండటం. 2. శరీరంలో పొటాషియం, కాల్షియం మోతాదు తగ్గడం. 3. ఏసీఈ ఇన్‌హిబిటర్స్, బి.పి కి వాడే మందులు, కొకైన్, స్టాటిన్స్ అంటే శరీరంలో కొవ్వుని తగ్గించే మందులు వాడటం వలన రావచ్చు. 4 ఇన్‌ఫ్లూయెంజా, మలేరియా, కండరాలపై గడ్డలు, పోలియో వంటి ఇన్‌ఫెక్షన్ల వల్ల రావచ్చు.
5. ఫైబ్రోమయాల్జియా, డెర్మటోమైటోసిస్ వంటి వ్యాధుల వల్ల వచ్చే అవకాశం ఉంది. 6. కండరాల వాపు, నొప్పి, తొందరగా అలసిపోవడం, నిద్రలేమి, తలనొప్పి, ఆకలి మందగించడం, శరీరం సన్నబడటం వంటి లక్షణాలుంటాయి. కదలికలు కష్టంగా మారతాయి.

కండరాల నొప్పికి కారణాలను తెలుసుకోండి:
మజిల్స్ పెయిన్ నొప్పికి హోం రెమడీస్ ఉపయోగించడానికి ముందు, నొప్పిక గల కారణాలను తెలుసుకోవాలి. అప్పుడే వెంటనే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.

తగినంత విశ్రాంతి తీసుకోవాలి:
కండరాల నొప్పితో బాధపడే వారు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అది కండరాల విశ్రాంతి పొందడానికి మరియు రాత్రిల్లో దీర్ఘసమయం తీసుకొనే విశ్రాంతి వల్ల కండారలు విశ్రాంతి పొంది తిరిగి పూర్వస్థితికి చేరుకుంటాయి. మజిల్ పెయిన్ కు కారణం అయ్యే ఏవిషయంలోనైనా సరే దూరంగా ఉంటుంది.

మసాజ్:
కండరాల నొప్పి నివారించడానికి మసాజ్ ఒక బెస్ట్ హోం రెమడీ. ఇది రక్త ప్రవాహాన్ని పెంచతుంది దాంతో త్వరగా ఉపశమనం పొందవచ్చు . నొప్పిగా ఉన్న ప్రదేశంలో కొంచెం ఒత్తిడితో కూడిన మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఐస్ ప్యాక్:
గాయాల వలన కండరాల నొప్పి, వాపు వస్తే ఆ ప్రదేశంలో మొదట ఐస్ పెట్టాలి. దీనివల్ల నొప్పి, వాపు తగ్గుతుంది. ఐస్ ప్యాక్ ను కనీసం 20నిముషాలు పెట్టుకోవాలి. కండరాల నొప్పిని నివారించడానికి ఇది ఒక ప్రభావవంతమైన హోం రెమెడీ.

హీటింగ్:
కండరాల నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఒక ఎఫెక్టివ్ పద్దతి, కండరాలు నొప్పి ఉన్న ప్రదేశంలో హీట్ ను మాయిశ్చరైజ్ చేయడం. హాట్ బాత్ (వేడి నీటి స్నానం)చేయడం లేదా ఉప్పుతో కాచుకోవడం వంటివి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

ఎన్సెన్షియల్ ఆయిల్ :
మజిల్ పెయిన్ నివారించడానికి అనేక నూనెలు ఉపయోగపడుతాయి . కర్రీర్ ఆయిల్(కొబ్బరినూనె లేదా ఇతర వాడకు నూనెలకు) ఒక టేబుల్ స్పూన్ ఎన్సెన్షియల్ ఆయిల్ ను మిక్స్ నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

వేడి నీటి స్నానం:
నాడీకణాలకు కొద్దిగా వేడి తగిలిన వెంటనే చురుకుగా పనిచేసి, పెయిన్ సిగ్నెల్స్ ను అంధించి, నొప్పి నివారించడానికి సహాయపడతుంది. కాబట్టి మీరు తరచూ కండరాల తిమ్మురలతో బాధపడుతుంటే వేడి నీటి స్నానం ఒక ఉత్తం ఇంటి చిట్కా. ఇలా చేస్తే కండరాలు చాలా తర్వాత నొప్పి నుండి ఉపశమనం పొందుతాయి.

కదలిక:
కండాలు పట్టేసినట్లు లేదా నొప్పికి గురి చేస్తుంటే ఒక చిన్న పాటి వ్యాయామాలుగా చిన్నగా కదలికలను మొదలు పెట్టాలి. చిన్న పాటి వ్యాయామాలు వల్ల సమస్య చాలా త్వరగా తగ్గిపోతుంది. మజిల్ పెయిన్ నివారించడానికి రిహబిలేషన్ ఎక్సర్ సైజ్ లు అనేకం ఉన్నాయి.

కంప్రెస్:
మజిల్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇది ఒక ఉత్తమ నివారణ పద్దతి. కోల్డ్ లేదా హాట్ కంప్రెసర్ మజిల్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

స్ట్రెచ్చింగ్(శరీరంను సాగతీత):
మజిల్ పెయిన్ నివారించడానికి స్ట్రెచ్చింగ్ ఒక బెస్ట్ హోం రెమడీ. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడానికి ముందు వైద్యనిపుణులను సంప్రదించాలి.



Click it and Unblock the Notifications
