Latest Updates
-
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
పిరియడ్ సమయంలో రాష్ లేకుండా ఉండటానికి చిట్కాలు
అనేక మంది మహిళలకు పీరియడ్స్ సమయం అనేవి చాలా సున్నితమైన సమయం అని చెప్పవచ్చు. ఆ సమయంలో మహిళలకు బాడి పెయిన్స్,అపరిమితమైన కడుపు నొప్పి మరియు పొత్తి కడుపు నొప్పి ఉంటాయి. కొన్నిసార్లు తేమ మరియు రక్త ప్రవాహం కారణంగా తొడలు మరియు యోని ప్రాంతాల్లో భౌతిక రాష్ ఉంటుంది. ఈ రాష్ ఎరుపు మరియు అలాగే ఆ ప్రాంతంలో పెరగవచ్చు. ఈ దద్దురులు చాలా బాధాకరంగా ఉంటాయి.
దద్దురులు దురదతో నిండిన భావాలకు కారణమవుతుంది.అప్పుడు మీకు అసౌకర్యంగా మరియు విరామం లేకుండా ఉంటుంది. మీరు దద్దుర్లు పొందిన ప్రాంతంలో గట్టిగా ఉన్నప్యాడ్స్ ధరించకూడదు. మీరు ఉపయోగిస్తున్న ప్యాడ్ ఒక మంచి నాణ్యత మరియు మంచి కంపెనీ కాకపోతే దద్దురులు వచ్చే అవకాశం ఉండవచ్చు.మీరు సుదీర్ఘ కాలం ఒకే వస్త్రం ఉపయోగిస్తే కూడా దద్దుర్లు రావచ్చు.

ప్రతి స్త్రీకి ప్రతి నెల పీరియడ్స్ రావటం జరుగుతుంది. మీరు సరిగా పట్టించుకోకపోతే దద్దుర్లు మరియు వ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. క్రింద దద్దుర్లు తగ్గటానికి అనుసరించవలసిన కొన్ని చిట్కాలు ఉన్నాయి: -
1. క్రమం తప్పకుండా శుభ్రపరచండి
మీరు మీ పీరియడ్స్ కాలంలో క్రమం తప్పకుండా యోని ప్రాంతంలో శుభ్రపరచడం అనేది దద్దుర్లు రాకుండా ఉండటానికి ఒక ఆరోగ్య చిట్కా అని చెప్పవచ్చు. మీరు శుభ్రం మరియు సమాన కాల వ్యవధిలో యోని ప్రాంతంను కడగడం చేయాలి. నీరు ఎక్కువగా ఉపయోగించి పూర్తిగా కడగడం మరువకండి. దద్దుర్లు మరియు అంటువ్యాధులను కలిగించే బాధ్యతను బాక్టీరియా మరియు ఇతర జెర్మ్స్ తీసుకుంటాయి. అందువలన పిరియడ్ సమయంలో ఆ ప్రాంతం శుభ్రంగా ఉంచటానికి పరిశుభ్రతా చర్యలు తీసుకోవాలి.
2. క్రమం తప్పకుండా మార్చండి
పిరియడ్ సమయంలో క్రమం తప్పకుండా మీరు ఉపయోగించే సానిటరీ ప్యాడ్ లేదా వస్త్రాన్ని మార్చండి. ఒకే సానిటరీ ప్యాడ్ లేదా రుమాలును 8-9 గంటలకుపైగా ఉపయోగించడం అనారోగ్యముగా భావించవచ్చు. ఎక్కువ సేపు అదే ప్యాడ్ ఉపయోగించటం వలన అంటువ్యాధులు లేదా దద్దుర్లకు కారణం కావచ్చు. అందువలన ఎల్లప్పుడూ పీరియడ్స్ కాలంలో దద్దుర్లు నివారించేందుకు మీ సానిటరీ ప్యాడ్ లేదా వస్త్రాన్ని మార్చడానికి ఆలస్యం చేయకూడదు.
3. యాంటి సెప్టిక్ ఉపయోగించండి
దద్దుర్ల ప్రాంతంలో ఉపశమనానికి మార్కెట్లో అనేక మంచి యాంటీ సెప్టిక్ క్రీములు మరియు జెల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు పీరియడ్స్ కాలంలో దద్దుర్లు నివారించేందుకు ఉపయోగించవచ్చు. మీరు మీ సానిటరీ ప్యాడ్ లేదా వస్త్రాన్ని మార్చినప్పుడల్లా ఈ క్రీములను రాయవచ్చు. ఏదైనా క్రీమ్ లేదా జెల్ ను ఉపయోగించే ముందు ఒక వైద్యుడుని సంప్రదించండి. సరైన జాగ్రత్తలు తీసుకోని మాత్రమే సున్నితమైన ప్రాంతాల్లో క్రీమ్ ను స్ప్రెడ్ చేయాలి. మీ చర్మం మీద క్రీమ్ లేదా జెల్ ను ఉపయోగించిన తరువాత మంట వస్తే అప్పుడు వెంటనే ఆ ప్రాంతం కడగి మళ్లీ ఆ క్రీమ్ లేదా జెల్ ను ఉపయోగించకూడదు.
4. ఒక మంచి సానిటరీ ప్యాడ్ ఉపయోగించండి
గతంతో పోలిస్తే ఈ రోజుల్లో మహిళలు చాలా బిజీగా ఉంటున్నారు. అందువలన పీరియడ్స్ కాలంలో నాప్కిన్ మరియు వస్త్రంను ఉపయోగించడం మానుకోండి.ఎందుకంటే తొడ మరియు ఇతర యోని ప్రాంతంలో వ్యతిరేకంగా వస్త్రాన్ని రుద్దడము వలన దద్దుర్లు మరియు అంటువ్యాధులకు దారితీయవచ్చు. అలాగే మీరు మృదువుగా మరియు తేలికపాటి సానిటరీ ప్యాడ్ ను ఉపయోగించాలని నిర్ధారించుకోండి.మంచి నాణ్యత గల ప్యాడ్ వాడటం వలన దద్దుర్లు తగ్గించుకోవటానికి సహాయపడుతుంది.
5. పౌడర్ ను ఉపయోగించండి
మీరు ఒక సానిటరీ ప్యాడ్ ధరించటానికి ముందు పౌడర్ ను రాయండి. ఇది యోని ప్రాంతంలో పొడిగా ఉంచడానికి సహాయపడుతుంది. తొడలు మరియు యోని చుట్టూ ప్రక్కల ప్రాంతంలో శుభ్రంగా ఉంటే దద్దుర్లు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒక యాంటి సెప్టిక్ పౌడర్ ను ఉపయోగించండి. లేనిచో సాధారణ కాస్మెటిక్ ఆధారిత పౌడర్ ను ఉపయోగించండి. ఎక్కువ పౌడర్ ఉపయోగించడానికి నిర్ధారించుకోండి. అలాగే యాంటి సెప్టిక్ క్రీములు మరియు జెల్స్ కూడా వాడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications