Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై!
ఒత్తిడి వల్ల వ్యక్తి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తాయి?
నిజానికి మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. విద్యార్ధి పరీక్షల్లో విజయం సాధించాలన్నా, క్రీడాకారుడు తన రంగంలో విజయం సాధించాలన్నా... అంతెందుకు మనం నిత్య జీవితంలో ఏ పనిచేయాలన్నా ఒత్తిడి కలుగుతుంది. ఆయా పనులు పూర్తి చేయాలంటే ఎంతోకొంత స్థాయిలో ఒత్తిడి ఉండడం కూడా అవసరమే. ఇప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత, బిపి అందరికీ ఉంటాయి కదా! అవి మనల్ని మనం రక్షించుకోవడం అవసరం. అలాంటిదే ఒత్తిడి కూడా. అయితే, ఈ ఒత్తిడి సాధారణ స్థాయి కన్నా అధికమైతే... అది క్రానిక్‌గా మారితే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది. అందుకే మనలో అధికంగా ఏర్పడే ఒత్తిడిని సమర్ధవంతంగా మనం ఎదుర్కోగలగాలి. ప్రతివ్యక్తిలోనూ ఏదో ఒక సందర్భంలో తరచుగా ఒత్తిడి ఎదుర్కోవడమనేది సాధారణ విషయమే.
సహజంగా ఏర్పడే ఒత్తిడిని జయించే శక్తి సామర్థ్యం శరీరానికున్నా, క్రోనిక్ స్ట్రెస్ ను వదిలించుకోవడం మాత్రం కష్టం అవుతుంది. సహజంగా మనందరం బిజీలైఫ్ స్టైల్లో ఒత్తిడికి గురిఅవుతుంటారు . అయితే ఇలా ఒత్తిడికి గురైనవారు కొంత మంది తేరుకోగలుగుతారు. లేదా ఓర్చుకోగలుగుతారు.
ఒత్తిడి(స్ట్రెస్)తో అధికంగా బాధపడుతున్నారనడానికి సంకేతాలివే:క్లిక్ చేయండి
ఒత్తిడితో బాధపడుతున్నా, ఇతరులకు మాత్రంమీరు ఫర్ ఫెక్ట్ గా ఉన్నట్లు చెబుతూ స్ట్రెస్ ను దాటవేస్తుంటారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముందు ముందు మరింత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, ఒత్తిడి బాధపడే వారిలో ముందుగా వారిలో ఏర్పడే స్ట్రెస్ లక్షణాలను గుర్గించటం ద్వారా ఆరోగ్యానికి మరింత ప్రమాదం జరకుండా కాపాడుకోవచ్చు. మరి ఆ ఒత్తిడి లక్షణాలేంటో ఈ క్రింది విధంగా గుర్గించండి...

బరువు పెరుగుట:
అవును!మీరు అదనపు బరువు పెరగకూడదనుకుంటే, ఒత్తిడిలేని లైఫ్ స్టైల్ ను అలవర్చుకోవాలి. అధికంగా ఒత్తిడికి గురిచేసే హార్మోనుల వల్ల అధికంగా ఫ్యాట్ నిల్వచేరుతుంది . డిప్రెషన్ కు గురైతే శరీరంలో క్యాలరీలు కరగడానికి బదులుగా అధిక క్యాలరీలు చేరుతాయి.

మజిల్ టెన్షన్:
ఒత్తిడగిలో ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోనులు బ్లడ్ ప్రెజర్ ను పెంచడం మాత్రమే కాదు, హార్ట్ రేటును కూడా పెంచుతుంది . మరియు కండరాలు మరింత బిగుపడేలా చేస్తుంది . కూర్చినేటప్పుడు సరైన భంగిమలో కూర్చోకోకపోవడం వల్ల కూడా ఒత్తిడి మరింత పెరుగుతుంది.

కడుపు నొప్పి:
కడుపులు బటర్ ఫ్లైస్ లేదా జిట్టర్స్ వంటివి కడుపులో నెర్వస్ నెస్ ను కలిగించడం మాత్రమే కాదు, అవి ఒత్తిడికి క్లాసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం పొట్ట మరియు బ్రెయిన్ కు మద్య చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు . హార్వార్డ్ మెడికల్ స్కూల్ రిపోర్ట్ ప్రకారం, మలబద్దకం, ఇర్రెస్టిబుల్ బౌల్ సిండ్రోమ్ లేదా ఎసిడిటి వంటి గ్యాస్ట్రో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లైతే అప్పుడు ఒత్తిడి లక్షణాలు మీలో మరింత ఎక్కువగా కనబడుతాయి.

హెయిర్ ఫాల్:
క్రోనిక్ స్ట్రెస్ సెక్స్ హార్మోన్స్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోనులు హెయిర్ ఫోలిసెల్స్ తో కలవడంతో తాత్కాలిక హెయిర్ ఫాల్ కు గురిచేస్తుంది. క్రోనిక్ స్ట్రెస్ కు గురైన 3 నుండి 6 నెలలలోపు ఎప్పుడైనా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు .

మతిమరుపు:
పనిలో గడిచిన కొద్ది రోజుల పనినే మీరు టార్గెట్ ను గుర్తించుకోలేనప్పడు, అప్పుడు మీరు ఖచ్చితంగా స్ట్రెస్ కు గురైనట్లే. కార్టిసోల్ అనే హార్మోన్ ఒత్తిడిలో క్రోనిక్ స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దానివల్ల హిప్పోక్రోమస్(షార్ట్ టర్మ్ మెమరీ)కి గురిచేస్తుంది . మీ మొదడు గుర్తుంచుకొనే శక్తి సామర్థ్యంను తగ్గిస్తుంది . కాబట్టి, మీ ఒత్తిడికి గల ప్రధాన కారణం తెలుసుకొని ఒత్తిడి నుండి బయటపడే మార్గంను తెలుసుకోవాలి.

మెనుష్ట్రులవల్ సమస్యలు:
పిట్యూటరీ గ్రంథులు (ఓవరీలో హార్మోనులు విడుదల చేసే గ్రంథులు: థైరాయిడ్ మరియు అడ్రినల్ గ్రంథులు)మీద ఒత్తిడి పెంచుతుంది. దాని దుష్ప్రభావం వల్ల మహిళల్లో రుతుక్రమంలో వ్యత్యాసం సరిగా పీరియడ్స్ అవ్వకపోవడం, ఓవలేషన్ సమస్యలు, మరియు ఇతర రిప్రొడక్ట్స్ ప్రక్రియలు వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

కనురెప్పలు కొట్టుకోవడం:
కనురెప్పలు కొట్టకోవడం మరియు ఒత్తిడికి దగ్గర సంబంధం ఉంది, మరియు ఖచ్చితమైన అనుబంధం ఏర్పడలేదు . ఎప్పుడైనా మీ కనురెప్పలు కొట్టుకోవడం జరిగితే, వెంటనే మీ కన్నులను మూసుకొని , మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు రాకుండా, ఒక లోతైన శ్వాస తీసుకొని నిధానంగా వదలాలి. తర్వాత రిలాక్స్అవ్వాలి. ఇలా కొన్ని సార్లు చేస్తుండాలి. తర్వాత మీ కనురెప్పలు కొట్టుకోవడంతాత్కాలికంగా నిలిస్తుంది

మొటిమలు:
క్రోనిక్ స్ట్రెస్ వల్ల మొటిమలకు కారణం అవుతుంది. అందుకు మీచర్మం ఏమి మినహాయింపు కాదు . ఆడ్రోజన్స్ అధికంగా విడుదల అవ్వడం వల్ల మొటిమలకు దారితీస్తుంది . మరియు మీరు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు హీలింగ్ ఎబిలిటీ కూడా తగ్గడంవల్ల మొటిమలు అంత త్వరగా పోవు.



Click it and Unblock the Notifications