ఆరోగ్యానికి ఒక మెడిసిన్ లా పనిచేసే వంటగదిలోని పదార్థాలు

By Super

ఆరోగ్యపరంగా రోజులు గడిచే కొద్ది, నేచురల్ పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ కంటే, నేచరల్ పదార్థాలతో తయారుచేసిన హోమియోపతి మందులకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అందుకు ప్రధానణ కారణం వాటిలో ఎటువంటి రసాయనాలను కలుపకపోవడం. సహజసిద్దంగా మనకు లభించి మూలికలు, వేర్లు, కొన్ని ఔషధగుణాలు కలిగి కొన్నిమూలికలతోనే అనారోగ్య సమస్యలను నుండి ఉపశమనం పొందుతున్నారు. ఒక్క మూలికలు మాత్రమే కాదు, మన వంటగదిలోనే పదార్థాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

నిత్యం మనం తయారుచేసే ఆహార పదార్థాలను రుచిగా మార్చడం మాత్రమే కాదు, వీటి ద్వారా ఆరోగ్య పరంగా చిన్న మరియు పెద్ద సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. హోం ట్రీట్మెంట్ ద్వారా సమయం ఆదా అవుతుంది, చవకైనవి మరియు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మన ఆరోగ్య సమస్యలను నివారించుకోవడంలో మందుల వలే పనేచేసి 10 వంటగది వస్తువులను ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిచయం చేస్తున్నాము.

పసుపు:

పసుపు:

పసుపు పురాతన కాలం నుండి మన వంటలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే ఔషధగుణాలు, యాంటీ సెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ ఆన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల పసుపును ఒక ఉత్తమ హోం రెమెడీగా వివిధ రకాల జబ్బులకు ఉపయోగిస్తుంటారు. తెగిన చిన్న గాయలు మరియు కాలిన గాయల మీద వెంటనే పసుపు చల్లడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇది సాధారణ జలుబు, కీళ్ళ నొప్పులు, ఆర్ధరైటిస్, స్కిన్ బర్న్, మొటిమలు, మచ్చలు, కడుపుకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను నివారిస్తుంది.ఇంకా ఇది ఆల్జైమర్స్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లేదా రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ లక్షణాలను నివారిస్తుంది. పసుపు వాడకం వల్ల వివిధ రకాల క్యాన్సర్ సెల్స్ (బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ మరియు లుకేమియా వంటి క్యాన్సర్)ను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

అల్లం

అల్లం

అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అదే సమయంలో, ఇందులో పవర్ ఫుల్ నేచురల్ అనాల్ జెసిక్ లేదా పెయిన్ కిల్లర్స్ గా పనిచేస్తుంది. అల్లంలో పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్, ఫాస్పరస్, జింక్, మరియు విటమిన్ ఎ, సి, ఇ, మరియు బికాంప్లెక్స్ ను కూడా కలిగి ఉంటుంది.అల్లంను స్టొమక్ అప్ సెట, అజీర్ణం, హార్ట్ బర్న్, వికారం మరియు మోషన్ సిక్ నెస్, బాడీ పెయిన్ మరియు ఆర్థరైటిస్ పెయిన్, జలుబు, దగ్గు, ఇతర శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలను, ఫీవర్ మరియు పీరియడ్స్ లో తిమ్మెర్లను నివారించడానికి సహాయపడుతుంది .

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్మినేటివ్, మరియు యాంటీ ఫ్లంచుల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు, ఈ మసాలా దినుసులో మినిరల్స్, పొటాషియం, మ్యాంగనీస్, ఐరన్, జింక్ మరియు కాపర్ వీటితో పాటు విటమిన్ ఎ, నియాసిన్ మరియు పైరిడాక్సిన్ కూడా ఎక్కువగా ఉంటుంది.దాల్చిన చెక్కను రెగ్యులర్ వంటల్లో ఉపయోగించడం లేదా దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ త్రాగడం వల్ల ఇది సాధారణ జలుబు, అపానవాయువు, అజీర్ణం, హార్ట్ బర్న్, వికారం, డయోరియా, ఆర్థరైటిస్, మరియు పీరియడ్స్ లో నొప్పిని నివారిస్తుంది.దాల్చిన చెక్కను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది, దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అదనంగా, ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.మరియు ఇతర రకాల హార్ట్ డిసీజ్ ప్రమాధాలను ఎదుర్కొంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిని ఒక సూపర్ ఫుడ్ గా, ఉద్దీపన, స్వేద వర్ధనము, మూత్రవిసర్జన, కఫహరమైన, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా వెల్లుల్లిలో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్(ప్రోటీన్స్, పొటాషియం, క్యాల్షియం, జింక్ మరియు ఇతర ఔషధగుణాలను కూడా కలిగి ఉన్నాయి.వెల్లులి దగ్గు, శ్వాసనాళముల వాపు, గొంతునొప్పి, హార్ సెన్స్, సైనస్ సమస్యలు, ఆస్తమా, చెవి ఇన్ఫెక్షన్, అజీర్ణం, పొట్టనొప్పి, రింగ్ వార్మ్, పంటినొప్పి, బగ్ బిట్స్ వంటి జబ్బుల నివారణకు ఉపయోగించవుకోవచ్చు.ఇది ఇంకా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు స్ట్రోక్ ను నివారిస్తుంది. ఇందులోని గాటైన వాసన వివిధ రకాల క్యాన్సర్స్ మరియు హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాధినిరోధకతను పెంచే శక్తి ఇందులో ఎక్కువగా ఉంటుంది. మరియు ఇందులో ఎక్కువగా పోషకాలు విలువలు విటమిన్ సి మరియు ఫొల్లేట్ వంటివి ఉన్నాయి.నిమ్మరసంలో బహుముఖ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇది తలనొప్పి, గొంతు నొప్పి, అజీర్ణం, మలబద్దకం, దంత సమస్యలను, చుండ్రు, క్రిములకు కుట్టినప్పుడు, కీళ్ళ నొప్పులు, అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలను నివారిస్తుంది.దీన్ని బరువు తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తుంటారు. అధిక రక్తపోటును నివారిస్తుంది. మరియు కిడ్నీలో రాళ్ళను పోగొడుతుంది. నిమ్మరసంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది స్ట్రోక్, కార్డియో వాస్కులర్ వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి జబ్బులను నివారిస్తుంది. అంతే కాదు, జుట్టు మరియు చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తుంటారు

తేనె

తేనె

తేనెలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, మరియు యాంటీ పారాసిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇందులో వివిధ రకాలు విటమిన్స్ మరియు మినిరల్స్ (మెగ్నీసియ, పొటాసియం, క్యాల్షియం, సోడియం, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, సల్ఫర్, జింక్ మరియు ఫాస్ఫేట్ వంటి లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.తేనె దగ్గు, గొంతునొప్పి,స్వరపేటిక వాప, ఎక్జిమా, తమార, వికారం, మరియు కడుపు పూతలను నివారిస్తుంది అంతే కాదు ఇది చర్మం అంటువ్యాధులను మరియు చిన్న గాయాలను మరియు కాలిన గాయాలు వంటి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.అదనంగా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కలిగిన ఒక గొప్ప నేచురల్ పదార్థం. అథ్లెటిస్ లో కండరాల నొప్పులను నివారిస్తుంది.తేనె పురుషుల్లో సామర్థ్యంను మరియు మేల్ ఫెర్టిలికి ఉపయోగపడుతుంది.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయలో గొప్ప యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ కలిగి ఉన్నాయి. ఇంకా ఇందులో విటమిన్ సి, బి1, బి6 మరియు కె, బయోటిన్, క్రోమియం, క్యాల్సియం, ఫోలిక్ యాసిడ్ మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.ఉల్లిపాయ సాధారణ జలువు, దగ్గు, శ్వాసనాళపు వాపు, ప్ల్యూమోనియ, అధిక జ్వరం, ఆస్తమా వంటి జబ్బునలు నివారిస్తుంది. మరియు చాలా ఎఫెక్టివ్ గా పొట్ట సమస్యలను, వికారం, డయేరియాను నివారిస్తుంది.ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ పవర్ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది. వివిధ రకాల క్యాన్సర్స్ ను నివారిస్తుంది.మరియు ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. ఉల్లిపాయ రసంను తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది.

లవంగాలు

లవంగాలు

లవంగాల్లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, గుణాలున్నాయి . ఇంకా వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.వివిధ రకాల హెల్త్ కండీషన్స్ ను నివారించడానికి, దంతాలనొప్పి, ఓరల్ క్యాన్సర్, గొంతు నొప్పి, కీళ్ళ నొప్పులు, వాపులు, కండరాల నొప్పులు, బాడీ పెయిన్, అజీర్ణం, వికారం, వాంతులు, గ్యాస్టిక్, కలరా వంటి సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది

యాలకలు:

యాలకలు:

ఆరోమాటిక్ మసాలా దినుసు ‘క్వీన్ ఆఫ్ స్పైసి' అని కూడా పిలుస్తారు. ఇందులో కార్మినేటివ, యాంటీఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీస్పాస్మోడిక్, డ్యూరియాటిక్ మరియు ఎక్స్ పెక్టొరేట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. యాలకల్లో మినిరల్స్, పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఐరన్ మరియు మెగ్నీషియం కూడా అధికంగా ఉన్నాయి.యాలకుల చెడు శ్వాసను మరియు మౌత్ అల్సర్ ను నివారిస్తుంది. అదనంగా పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను, అజీర్ణం, హార్ట్ బర్న్, వికారం, పొట్టలో తిమ్మెర్లను తగ్గిస్తుంది.ఈ మసాలా దినుసు ఆస్తమా, బ్రొక్కైటిస్, శ్వాసనాళ సంబంధిత అలర్జీలను కూడా తగ్గిస్తుంది. యాలకలు, ఆకలిని, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. కండరాల వాపును కూడా తగ్గిస్తుంది.

జీలకర్ర

జీలకర్ర

జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్మినేటివ్, యాంటీ ఫ్లంచ్యులెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది . ఈ విత్తనాల్లో డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ుంటుంది. మినిరల్స్, ఐరన్, కాపర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం మరియు జింక్ కూడా అధికంగా ుంటుంది . ఇది అజీర్నం, అపానవాయు, డయేరియా, ఎసిడిటి, స్టొమక్ పెయిన్, మార్నింగ్ సిక్నెస్, సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, మరియు నిద్రలేమిని నివారిస్తుంది.

Desktop Bottom Promotion