Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
జల్జీర శీతల పానీయంలోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
జల్జీర ఒక ఇండియన్ సమ్మర్ డ్రింక్. సమ్మర్ డ్రింక్ మాత్రమే కాదు, ఇందులో పూర్తి పోషకాలు మరియు ఫ్లేవర్ కలిగి ఉంటుంది. జల్జీరలో వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వేసవి సీజన్ లో జల్జీర త్రాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు, జీర్ణక్రియ మరియు డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు.
వేసవిలో జల్జీర పానీయం త్రాగడం చాలా అవసరం. ఎందుకంటే ఈ పానీయం శరీరాన్ని చల్లగా ఉంచతుంది. శరీరంలో ఎక్సెస్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్స్ తగ్గిస్తుంది. వేసవి సీజన్ లో జల్జీర పానీయాన్ని త్రాగడం వల్ల వివిధ రకాల జీర్ణసమస్యలను నివారించుకోవచ్చు. ఈ శీతలపానియాన్ని తీసుకొన్నప్పుడు పొట్టలో టాక్సిన్స్ ను క్లియర్ చేస్తుంది. దాంతో పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. జీరా వాటర్ త్రగడం వల్ల కూడా వేసవి సీజన్ లో శరీరంను రిఫ్రెష్ చేస్తుంది మరియు శరీరంను చల్లగా ఉంచుతుంది. సమ్మర్ హీట్ ను బీట్ చేయాలంటే ఇలాంటి హెల్తీ డ్రింక్ త్రాగాల్సిందే...
అదేవిధంగా ఈ వేసవి కాలంలో మరో ఆశ్చర్యం, మామిడిపండ్ల సీజన్ కాబట్టి, మామిడి కాయతో తయారుచేసిన జల్జీర ను తీసుకోవడం మరింత ఆరోగ్యకరం.
హెల్తీ సమ్మర్ వాటర్ డ్రింక్ అయిన జల్జీరలోని కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా...

1. బరువు తగ్గించడానికి :
జల్జీర యొక్క ఒక ఎఫెక్టివ్ బెనిఫిట్ బరువు తగ్గిస్తుంది . ఈ జీర వాటర్ ను రోజుకు రెండు సార్లు త్రాగితే ఆకలిని కంట్రోల్ చేస్తుంది, అందువల్ల తక్కవుగా తింటారు. దాంతో బరువు తగ్గించుకోవచ్చు.

2. ఎసిడిటి తగ్గిస్తుంది:
జల్జీర జీర్ణ సమస్యలకు చాలా మంచిది. మీరు ఎక్కువ భోజనం చేసినప్పుడు ఒక గ్లాసు జీర వాటర్ కొద్దిగా నిధానంగా తీసుకొంటే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఎసిడిటిని వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

3. మలబద్దకం నివారిస్తుంది:
జల్జీర త్రాగడం వల్ల మలబద్దకం నివారిస్తుంది. వేసవి కాలంలో మలబద్దకానికి గురిఅవుతుంటే జల్జీర వాటర్ ను రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.

4. గ్యాస్ మరియు పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది:
జల్జీర వాటర్ త్రాగడం వల్ల పొట్ట ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలను నయం చేస్తుంది. గ్యాస్ నివారించబడే వారకూ కొద్దిగా కొద్దిగా జీర వాటర్ త్రాగుతుండాలి.

5. వికారం:
జల్జీర వాటర్ యొక్క మరో ఎఫెక్టివ్ హెల్త్ బెనిఫిట్ వికారం తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఈ పానీయం తీసుకోవడం ద్వారా మార్నింగ్ సిక్ నెస్ తగ్గించుకోవచ్చు.

6. డీహైడ్రేషన్:
వేసవి వేడివల్ల ఒంట్లో నీరంతా చెమట రూపంలో బయటకు నెట్టివేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే జల్జీర వాటర్ ను రోజుకి రెండు మూడు సార్లు త్రాగాలి. దాంతో బాడీ హీట్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

7. పొట్టనొప్పి నివారిస్తుంది:
జల్జీర వాటర్ త్రాగడం వల్ల రుతుక్రమంలోని పొట్టనొప్పి పొట్ట తిమ్మెరలను నివారిస్తుంది . నొప్పి తగ్గే వరకూ ఈ వాటర్ ను రోజంతా కొద్ది కొద్దిగా త్రాగుతుండాలి.



Click it and Unblock the Notifications
