Latest Updates
-
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.!
శరీరంలో ఆరోగ్యానికి హాని కలిగించే వ్యర్థాలున్నట్లు గుర్తించడం ఎలా..?
మన శరీరంలో టాక్సిన్స్ (వ్యర్థాలు)ఉంటాయన్న విషయం మీకు తెలుసా?ఈ టాక్సిన్స్ మనం తీసుకొనే ప్రొసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, సాప్ట్ డ్రింక్స్ మరియు ఇతర హానికరమైన ఆహారాల వల్ల శరీరంలోనికి చేరుతాయి. వీటితో పాటు వాతావరణంలోని కాలుష్యం కూడా వాయురూపంలో, ఆహారరూపంలో మన శరీరంలోనికి చేరుతుంది. పొల్యుటెడ్ ఆహారాలను తినడం వల్ల, పొల్యుషన్ గాలిని పీల్చడం వల్ల అవి శరీరంలోని చేరి లోపల తిష్టవేస్తాయి.
అంతవరకూ అయితే పర్వాలేదు కానీ, తిష్టవేసినవి ఊరుకుండుక శరీరంలో ఇన్ఫ్లమేషన్, బరువు పెరగడం, బాడీ హీట్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి . అయితే శరీరంలో చేరిన టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేయడానికి వివిధ మార్గాలున్నాయి . డిటాక్సి ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్ డ్రింక్స్ ను తీసుకోవడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేసుకోవచ్చు.
ఇంకా రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ అండ్ నేచురల్ ఫుడ్స్ ను చేర్చుకోవడం ద్వారా డిటాక్సిఫికేషన్ చాలా ఎఫెక్టివ్ గా జరగుతుంది . శరీరం క్లీన్ గా మరియు హెల్తీ గా ఉండాలంటే అన్ని రకాల ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తో పాటు స్మోకింగ్ ను మానేయాలి. పండ్లు మరియు కూరగాయలను తినడానికి ముందు శుభ్రంగా కడిగి తీసుకోవాలి . ఎందుకంటే వీటిలో కూడా కెమికల్ పెస్టిసైడ్స్ తో నిండి ఉంటాయి .
మన శరీరం వివిధ రకాల టాక్సిన్స్(వ్యర్థాల)తో నిండి ఉందని తెలపడానికి కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ లక్షణాలు కనబడినప్పుడు తప్పనిసరిగా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మరి లక్షణాలేంటో ఒక సారి చూద్దాం....

1. బాడీ హీట్ పెరుగుతుంది:
మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు కాలేయం పనితీరు భారంగా మారుతుంది . అది కాలేయం మీద తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది . దాంతో కాలేయంలో ఎక్కువ వేడి పుడుతుంది. దాంతో శరీరం మొత్తంలో వేడి ఉత్పత్తి అవుతుంది . దాంతో బాడీ హీట్ కు కారణం అవుతుంది.

2. ఫ్యాట్ బెల్లీ:
శరీరంలోని టాక్సిన్స్ వల్ల మెటబాలిజం రేట్ ఆలస్యం అవుతుంది మరియు ఫలితంగా శరీరంలో ఫ్యాట్ చేరుతుంది . ముఖ్యంగా పొట్ట ఉదరంలో ఫ్యాట్ చేరడం వల్ల పొట్ట పెద్దదిగా తెలుస్తుంది. ఫ్యాట్ వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు బ్లడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3. ఎనర్జీ లోపం మరియు అలసట:
శరీరంలో టాక్సిన్స్ చేరినప్పుడు కాలేయం మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది . దాంతో జీవక్రియల పనితీరు తగ్గుతుంది. దాంతో శరీరంలో ఎనర్జి తగ్గతుంది, కారణంగా అలసట, నీరసం వంటి లక్షణాలు కనబడుతాయి . అన్ని సమయాల్లో అలసటగా ఫీలవుతారు.

4. తలనొప్పి:
టాక్సిన్స్ ఒక శరీరానికి మాత్రమే పరిమితం కాకుండా తలలో కూడా వ్యాప్తి చెండం వల్ల, బ్రెయిన్ కు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా మానసిక ఆందోళన , ఏకాగ్రత లోపించడం మరియు తలనొప్పికి కారణం అవుతుంది.

5. బరువు పెరగడం:
శరీరంలోని టాక్సిన్స్ వల్ల తాపజన ప్రతి స్పందన వల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది. జీవక్రియ రేటు పెరగడంతో బరువు మరింత పెరగడానికి దోహదం చేస్తుంది.

6. నిద్రలేమి:
నిద్రతక్కువైనా దాన్ని నిద్రలేమిగా భావిస్తారు. ఇదికూడా శరీరంలో వ్యర్థాలు చేరి ఉండుటకు ఒక లక్షణం గా చెబుతారు. ఈ టాక్సిన్స్ టిష్యులతో నిండి ఉండటం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలిగించి విశ్రాంతి లేకుండా నిద్రలేమికి కారణం అవుతుంది.

7. స్కిన్ ప్రొబ్లమ్స్:
శరీరంలో ఉండే టాక్సిన్స్ చర్మంలో దుష్ప్రభావాలను చూపుతుంది . దాంతో స్కిన్ ఇన్ఫ్లమేషన్, దురద మరియు మొటిమలకు దారితీస్తుంది. టాక్సిన్స్ ను ఫ్లష్ చేయడం వల్ల ఈ సమస్యలను నివారించుకోవచ్చు.

8. నాలుక రంగు మారుతుంది:
నాలుక రంగు ఎల్లో, బ్లష్, లేదా తెలుపు రంగులోకి మారితే , మీ శరీరంలోని రక్తంలో టాక్సిన్స్ ఉన్నట్లు సంకేతం. . రక్తంలో టాక్సిన్ వల్ల లాలాజం ఉత్పత్తిలో మార్పులు మరియు నాలుక రంగులో మార్పులకు కారణం అవుతుంది.

9. పిత్తాశయ సమస్యలు:
శరీరంలోని వ్యర్థాలన్నిటి గ్రహించడంలో మరియు జీవక్రియ ప్రొసెస్ కు ప్రధాన అంగం కాలేయం. కాబట్టి, కాలేయం ఎక్కువ టాక్సిన్స్ చేరడం పిత్త ఆమ్లాలు, జీర్ణ రసాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తాయి.



Click it and Unblock the Notifications
