Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
కడుపుబ్బరం నుండి తక్షణ ఉపశమనం కలిగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
కడుపు ఉబ్బరం మిమ్మల్ని గర్భణీలా కనబడేలా చేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కడుపు ఉబ్బుకొని పైకి కనబడుతుంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మీ కడుపు నిండుగా ఉన్నట్లు మరియు అన్ని సమయాల్లో టైట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం వల్ల ఉదరభాగం బిగదీసుకు పోయి పట్టేసినట్లు ఉండి, అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన, ఒళ్లు నొప్పులు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి వివిధ లక్షణాలు అన్నీ కాని, లేదా వీటిలో కొన్ని కాని ఉంటాయి.
ఇలా అనిపించడానికి ప్రధానకారణం కడుపు ఉబ్బరం. మరియు మీకు అనిపించవచ్చు ఎందుకు ఇలా కడుపు ఉబ్బరంగా ఉందని? కడుపు ఉబ్బరం అంటే కడుపులో ఎక్సెసీవ్ గ్యాస్, ఉడటం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. మలబద్దకం, ఎక్కువగా తినటం, చెడు ఆహారపు అలవాట్లు, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు గాలి మింగడం, చీకాకు పెట్టే పేగు వ్యాధి మరియు pms(బహిష్టకు పూర్వ లక్షణంతో)కడుపు ఉబ్బరానికి సాధారణ కారణాలు.
కడుపు ఉబ్బరాన్ని నియంత్రించుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఉదాహరణకు కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు తీసుకొనే ఆహారం బాగా నమిలి తినాలి. అలాగే కాఫీ మరియు టీలు మానేయాలి . భోజనం చేసేప్పుడు నిధానంగా నమిలి తినడం , ప్రతి రోజూ వ్యాయామం చేయడం వంటివి చేయాలి. అలాగే బీన్స్, లెంటిల్స్, క్యాబేజ్ మరియు క్యారెట్ వంటివి రెగ్యులర్ డైట్ నుండి తగ్గించడం వల్ల కూడా కడుపుబ్బరాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
కడుపుబ్బరానికి ఇంట్లోనే చికిత్సనందివొచ్చు. ఈ క్రింది తెలిపిన కొన్ని సింపుల్ హోం రెమెడీస్ కడుపుబ్బరంతో పాటు, లక్షణాలను కూడా నివారిస్తాయి...

అల్లం:
అల్లంతో నియంత్రణ: యాసిడ్ రిఫ్లెక్షన్ కు అల్లం ఒక ఉత్తమ ఆహారం. అల్లంను యాంటీఇన్లమేటరీ మరియు జీర్ణకోశ వ్యాధులకు కొరకు పురాతన కాలం నుండి చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే జింజరాల్ మరియు షోగోల్స్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి . పొట్ట ఉదరభాగంలో గ్యాస్ చేరకుండా నివారిస్తుంది.

మింట్ టీ:
పుదీనా ఆకులు: కొద్దిగా పుదీనా ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి బాగా మరగ కాచి, ఆ నీటిని గోరువెచ్చగా భోజనం తర్వాత తాగాలి. ఇలా చేస్తుంటే బ్లోటింగ్ మరియు క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. నరాలను బలోపేతం చేసి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గుమ్మడి:
డైలీ డైట్ లో గుమ్మడిని చేర్చుకోవడం వల్ల కడుపుబ్బరం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు . కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ రిలీవ్ అవుతుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

సోంపు:
కడుపు ఉబ్బరంను నయం చేసే లక్షణాలు సోంపులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే భోజనం చేసిన వెంటనే సోంపు నములుతుంటారు కొందరు. ఇది ప్రేగులో గ్యాస్ ను మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి.

కొత్తిమీర:
కొత్తిమీర మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ . కడుపుబ్బరాన్ని క్షణాల్లో పోగొడుతుంది. ఒక కప్పు కొత్తిమీర టీ త్రాగడం వల్ల కడుపుబ్బరం తగ్గతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది . పొట్టనొప్పి తగ్గిస్తుంది.

తులసి:
పొట్టలో గ్యాస్ ను విచ్చిన్నం చేసే అద్భుతమైన లక్షణాలు తులసిలో దాగి ఉన్నాయి. ఇది పొట్టలకు ప్రశాంతతను అందిస్తుంది.

పెరుగు:
పెరగులో ఒక మంచి ల్యాక్టో బాసిల్లస్ ఉండి, ఇది ప్రొబయోటిక్ గా పనిచేస్తుంది. ఇది డీస్ట్రెస్సింగ్ స్టొమక్ బ్లోటింగ్ ను తగ్గిస్తుంది. పాలలాగ ఇది అపానవాయువుకు కారణం కాదు. మరియు అసౌకర్యానికి గురిచేయదు.

కారవే సీడ్స్:
కొన్ని కారవే సీడ్స్ ను నోట్లో వేసుకొని నమలడం ద్వారా ఉపశమనం కలుగుతుంది . చాలా త్వరగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది . కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ మార్గం.

నిమ్మరసం:
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, కొంత మంది ద్రవాలు త్రాగడాన్ని నిరాకరిస్తుంటారు. కాబట్టి, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని ద్రావాలను కొద్దిగా కొద్దిగా త్రాగడం చాలా అవసరం. ముఖ్యంగా, గోరువెచ్చని నీటికి నిమ్మరసం మిక్స్ చేసి త్రాగడం వల్ల ఒక అద్భుత మ్యాజిక్ చేస్తుంది. త్రాగిన 30నిముషాల్లోనే మీరు ఫలితాన్ని గమనించవచ్చు. ఈ డ్రింక్ ను మీరు ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం మొదలు పెడితే మరింత ఉత్తమ ఫలితాలను పొందచ్చు.



Click it and Unblock the Notifications
