Latest Updates
-
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
పొట్ట ఉదర భాగంలో మసాజ్ చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు
పొట్ట ఉదరం(Abdominal) మసాజ్ ను పురాతన కాలం నుండి అనుసరిస్తున్నారు. ఇలా పొట్ట ఉదరంలో మాసజ్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది . మరియు ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది మరియు డైజెస్టివ్ ట్రాక్ జీవక్రియను మెరుగుపరుస్తుంిది.
బెల్లీ మసాజ్ వల్ల హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు . బెల్లీ మసాజ్ ను మీరు రెగ్యులర్ గా ప్రతి రోజూ చాలా సులభంగా మానసికంగా మరియు శారీరకంగా చేసుకోవచ్చు .
READ MORE: బాడీ మసాజ్ వల్ల పొందే ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు
పొట్ట ఉదరం మసాజ్ చేసుకోవడానికి ముందుగా వెల్లకిలా క్రింద మ్యాట్ మీద లేదా బెడ్ మీద పడుకోవాలి. తర్వాత పొట్ట ఉదరం భాగంలో దుస్తులు తొలగించడం వల్ల చేత్తో సున్నితమైన మసాజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు చేతులను మర్దన చేయాలి. 30 సెకండ్లు మర్దన చేయడం వల్ల చేతుల్లో వేడి పుడుతుంది.
ఇప్పుడు, చేతి వేళ్ళను నావల్(బొడ్డు)మీద ఉంచి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. సర్కులర్ మోషన్ లో మర్దన చేయడం లేదా సున్నితంగా నావల్ చుట్టూ మసాజ్ చేయాలి.
READ MORE: బాడీ మసాజ్ కు ఉపయోగించే 10 బెస్ట్ ఆయిల్స్
మూడు నిముషాల్లో 30 నుండి 40 సార్లు సర్కులర్ మోషన్ లో మర్దన చేయడం వల్ల మీరు గోరువెచ్చగా మరియు విశ్రాంతి పొందుతారు మరియు మనస్సు మీద ఏకాగ్రత పెరుగుతుంది. అంతే మీ అబ్డామినల్ మసాజ్ పూర్తి అయ్యింది.
ఇలా 3 నిముషాల ఆబ్డామినల్ మసాజ్ ఒక వారం పాటు చేస్తుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఆ ప్రయోజనాలేంటో ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకుందాం...

వెయిట్ లాస్:
పొట్ట ఉదరం మసాజ్ చేయడం వల్ల కేవలం పొట్టఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆరోగ్యం మొత్తం మీద మంచి ఫలితాన్ని సూచిస్తుంది . మెటబాలిక్ రేట్ పెరగడం మరియు మంచి జీర్ణక్రియ వేగవంతం అవ్వడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు . ఎవరైతే బరువు తగ్గించుకొనే క్రమంలో బాధపడుతున్నారో..వారికి ఇది ఒక ఎఫెక్టివ్ వెయిట్ లాస్ చిట్కా.

పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది:
అజీర్ణం వల్ల పొట్ట ఉబ్బరం మరియు పొట్టలో గ్యాస్ ఏర్పడటం జరుగుతుంది . ఈ ప్రొసెస్ లో ఆబ్డామినల్ మసాజ్ చాలా చక్కగా సహాయపడుతుంది. సరిగా జీర్ణం అవ్వడం వల్ల పొట్టలో గ్యాస్ చేరదు . మీ పొట్టలో గ్యాస్ చేరకుండా నివారిస్తుంది.

మలబద్దకం నివారిస్తుంది:
కొన్ని పరిశోధనల ప్రకారం, ఆబ్డామినల్ మసాజ్ మలబద్దంక మరియు పొట్ట ఉదరంలో నొప్పి వంటి సమస్యల నుండి సహజంగానే ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి రోజూ పొట్ట ఉదరంలో మాసాజ్ చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఉన్న మలబద్దక సమస్యను నివారిస్తుంది. ముందు ముందు ఇలాంటి సమస్య రాకుండా అరికడుతుంది.

ఉదరంలో నొప్పి:
పొట్ట ఉదరంలో మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి అన్ని రకాల పొట్ట సమస్యలను నివారిస్తుంది. మరియు ఇది పొట్ట ఉదరంలో నొప్పిని కూడా నివారిస్తుంది.

గ్యాస్ట్రో ఇన్టెస్టినల్ హెల్త్:
రెగ్యులర్ గా టమ్మీ మాసజ్ చేయడం వల్ల గ్యాస్ట్రో ఇన్టెస్టినల్ హెల్త్ ను దీర్ఘంకాలంలో కాపాడుకోవచ్చు. దీర్ఘకాలంలో మలబద్దకం మరియు కడుపు ఉబ్బరం సమస్యలుండవు. మీ ఆబ్డామినల్ పెయిన్ ఉండదు.ఆబ్డామినల్ మసాజ్ వల్ల రక్తప్రసరణ జరుగుతుంది. మరియు ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.

ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది:
పొట్ట ఉదరంలో మసాజ్ చేయడం వల్ల పొట్ట ఉదరం ఆరోగ్యంగా ఉండుటకు సహాయపడుతుంది. మీ మనస్సును ప్రశాతం పరుస్తుంది మరియు విశ్రాంతి కలిగిస్తుంది. ఇది మానసికంగా విశ్రాంతి కలిగిస్తుంది. మరియు ఒత్తిడి తగ్గిస్తుంది.

స్లిమ్ గా మారవచ్చు:
పొట్ట ఉదరంలో మసాజ్ చేసుకోవడం వల్ల పొట్ట ఉదరంలో మరియు నడుము వద్ద కొవ్వును కరిగించుకోవచ్చు. మీకు కావల్సిన శరీర ఆకారంను పొందవచ్చు . పొట్ట ఉదరంలో మసాజ్ చేయడం వల్ల టమ్మీని టైట్ చేస్తుంది మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఆబ్డామినల్ మసాజ్ ను ఎప్పుడు చేయకూడదు:
ప్రెగ్నెన్సీ, గాల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, పునరుత్పత్తి అవయవాల వాపు లేదా సమస్యలు, మరియు అల్సర్ మరియు ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఈ మసాజ్ ను చేయకూడదు.

రుతుస్రావ లక్షణాలను మెరుగుపరుస్తుంది:
పొట్ట ఉదరంలో లవంగాలు, ల్యావెండర్, మరియు దాల్చిన చెక్క నూనెతో మసాజ్ చేయడం వల్ల, మెనుస్ట్రువల్ క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఎవరైతే రుతుస్రావ సమయంలో ఉదరపొట్ట సమస్యలతో బాధపడుతుంటారో వారికి ఇది మసాజ్ చాలా ఎఫెక్టిగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications