Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
ఇంగ్లీష్ మెడిసిన్స్ కు ధీటుగా నేచురల్ టర్మరిక్ మెడిసినే బేష్ ...!
పసుపును కొన్ని వేల సంవత్సరాల నుండి భారతీయులు వాడుతున్నారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు 6000 సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వాడుతున్నారు. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
చిన్నచిన్న గాయాలనుండి క్యాన్సర్ వ్యాధులవరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్ ఫాస్ఫరస్ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్, కాన్సర్ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్ నిరోధించేవి, ట్యూమర్ ఏర్పడకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి. పసుపు దుంపల్లో కర్‌క్యుమిన్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్‌క్యుమిన్ అనే పదార్థం వల్లననే పసుపు సహజమైన పసుపురంగులో ఉంటుంది.
పసుపు పాలలోని అద్భుతమైన బ్యూటీ&హెల్త్ బెనిఫిట్స్
పసుపు అనేక రకాల డ్రంగ్స్(మందులను/మెడిసిన్ )ను రీప్లేస్ చేస్తుందన్న విషయం మీకు తెలుసా? పసుపు టర్మరిక్ టీ, టర్మరింక్ మిల్క్, టర్మరిక్ ఫుడ్స్ మొదలగు రూపంలో తీసుకోవడం వల్ల కొన్ని రకాల మెడిసిన్స్ ను తీసుకొనే అవసరం ఉండదు. అనేక మెడిసిన్స్ కు అల్టర్ నేటివ్ గా పసుపు గ్రేట్ గా పనిచేస్తుంది. కొన్ని మెడిసిన్స్ కు ప్రత్యామ్నాయంగా పసుపును వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ మందుల్లో ఉండే లక్షణాలే పసుపులో కూడా మెండుగా ఉండి, ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కన్వెన్షనల్ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఒకే జబ్బును నయం చేయచేస్తాయి, కానీ మరిన్ని సైడ్ ఎఫ్ క్ట్స్ ను కలిగిస్తాయి. దాంతో మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, ఇలాంటి కమర్షియల్ మందులకు ప్రత్యామ్యాయంగా నేచురల్ రెమెడీస్ అధికంగా ఉన్నాయి.
'టర్మరిక్ టీ’ ! క్యాన్సర్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ పరార్.........
ఈ ఆర్టికల్లో కొన్ని మందులకు ప్రత్యామ్నాయంగా పసుపును ఉపయోగించుకోవచ్చని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది . పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు వివిధ దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఇదివరకే తేలింది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో డంలో, కేన్సర్‌ను నిరోధించడంలో కూడా పసుపు ప్రశస్తంగా పనిచేస్తుందని ఒక తాజా పరిశోధనలో తేలింది. అల్జిమర్స్ డిసీజ్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, జీవక్రియలకు సంబంధించిన వ్యాధులపై పసుపు అద్భుతంగా పనిచేస్తుందని అమెరికాలోని శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. మరి అయితే ఏఏ జబ్బులకు ఉపయోగించే మందులకు ప్రత్యామ్నాయంగా పసుపును వాడుకోవచ్చో ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగింది.

బ్లడ్ ను పచ్చగా మార్చే డ్రగ్స్(బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్)
పసుపు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేస్తుంది. దాంతో హార్ట్ అటాక్ వంటి ప్రాణాపాయ సమస్య నుండి నివారిస్తుంది . పసుపు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది . యాంటీ బ్లడ్ థిన్నింగ్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఆస్పిరిన్ మాత్రకు బదులుగా పసుపును ఉపయోగించుకోవచ్చు.

డిప్రెషన్ కు తీసుకొనే ముందులు(యాంటీడిప్రెజెంట్స్, ఇమిప్రమైన్)
పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అనే ముఖ్యమైన పదార్థం ఉండటం వల్ల మన మైండ్ ను రిలాక్స్ చేస్తుంది మరియు డిప్రెషన్ తగ్గిస్తుంది . యాంక్జైటి మరియు డిప్రెషన్ కు నేచురల్ మెడిసిన్ గా పసుపు గ్రేట్ గా పనిచేస్తుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైనది.

డయాబెటిక్ డ్రంగ్స్(యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, మెట్ఫార్మిన్)
డయాబెటిక్ కు ఒక ఎఫెక్టివ్ మెడిసిన్ పసుపు . ఇది కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు బాడీసెల్స్ కు గ్లూకోజ్ సప్లైని పెంచుతుంది. దాంతో శరీరంలో బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతుంది. కాబట్టి, యాంటీ డయాబెటిక్ డ్రగ్ కు బదులుగా పసుపు మరింత పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

పెయిన్ కిల్లర్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAID'S)
పసుపులో పెయిన్ రిలీఫ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఇంగ్లీష్ మెడిసిన్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను బీట్ చేస్తుందని కొన్ని పరిశోధన ద్వారా నిరూపించారు. నొప్పులు, వాపులు తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన డ్రగ్స్ ఐబ్రూఫిన్, ఆస్పిరిన్, డిక్లోఫినాక్, డిక్సామెథాసోన్, ఆస్పిరిన్, మొదలగు డ్రగ్స్ కంటే పసుపులో మెండైన నివారణ గుణాలున్నాయి.

కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు
మీ శరీరంలో హైబ్లడ్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, రెగ్యులర్ డైట్ లో పసుపు చేర్చుకోవడం ఇప్పుడే ప్రారంభించండి . పసుపు మీద చేసిన కొన్ని పరిశోధనల్లో పసుపులో ఉండే అటోర్వస్టాటిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్ ను గ్రేట్ గా తగ్గిస్తుందని కనుకొన్నారు.

ఐ మరియు స్కిన్ ఇన్ఫ్లమేషన్ కు ఉపయోగించే డ్రగ్స్:
సాధారణంగా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్స్ కు మరియు స్కిన్ డిసీజ్ కు దారితీస్తుంది. ఈ స్కిన్ డిసీజ్ ను నివారించుకోవడానికి డెక్సామెథోసిన్ అనే స్టెరాయిడ్ ను ట్రీట్మెంట్లో భాగంగా తీసుకుంటారు . అయితే యాంటీఇన్ఫ్లమేటర్ డ్రగ్స్ తో పోల్చినప్పడు పసుపులో ఉండే నయం చేసే గుణాలు మెండుగా ఉన్నట్లు కనుగొన్నారు.

క్యాన్సర్ ను నివారించే డ్రగ్స్:
పసుపులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది. కొన్ని పరిశోధనల ద్వారా యాక్సాలిప్లేషన్ (కీమోథెరఫీ డ్రగ్ ) క్యాన్సర్ కిల్లింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొన్నారు.

జీర్ణకోశ సమస్యలకు:
జీర్ణాశయ సమస్యలకు, గ్యాస్ట్రిక్ కు తీసుకొనే యాంటాసిడ్, ఐబ్రూఫిన్, బ్రూఫిన్ వంటి డ్రంగ్స్ కంటే పుసుపు పదింతలు రెట్లు అని నిపుణుల అభిప్రాయం. హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.

టైప్ 2 డయాబెటిస్:
పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థాన్ని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో కలిపినప్పుడు తయారయ్యే ఔషధం టైప్ 2 డయాబెటిస్ కు నివారిణిగా ఉపయోగపడతుందని ఆరోగ్యనిపుణలు జరిపిన పరిశోధల్లో నిర్ధారించారు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్స్ కు ఎక్కువగా అలవాటు పడుతన్న తరుణంలో టైప్ 2 డయాబెటిస్ కు గురి అవుతున్నారు. అలాంటి వారు కుర్యుమిన్ , ఓమేగా ఫ్యాటీస్ విడివిడిగా తీసుకోవడం కంటే రెండు కలిపి తీసుకోవడం చాలా సురక్షితమైనవని, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవని తెలుపుతున్నారు .



Click it and Unblock the Notifications











