Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
గార్లిక్ జ్యూస్ లో అద్భుతమైన ప్రయోజనాలు...!
వెల్లుల్లి పాయలను నేరుగా వంటలకు ఉపయోగించడం మాత్రమే కాదు, ఉల్లిపాయను మెత్తగా చేసి, పాలలో కలిపి తాగుతారు. అలాగే నీటిలో మరిగించి, గోరువెచ్చగా ఉదయం పరగడపున తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు.
గార్లిక్ (వెల్లుల్లి) జ్యూస్ అంటే పడనివారు చాలా మంది ఉన్నారు.? గార్లిక్ లో ఉండే ఘాటైన వాసన వల్లే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. వెల్లుల్లిలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అందుకే దీన్ని పురాతన కాలం నుండి అనేక ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. మసాలా వంటలకు వెల్లుల్లి ఘాటు తగిలితేనే వంటలు ఘుమఘులాడుతూ నోరూరిస్తుంటాయి. అంతే కాదు, గార్లిక్ ను రెగ్యులర్ వంటలకు చేర్చడం వల్ల డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది.
సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా? కాదా? అందరినీ వేధించే ప్రశ్న. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు న్యూజెర్సీకి చెందిన వైద్యులు. పరగడుపున చిన్న వెల్లుల్లి ముక్క తింటే ఆరోగ్యవంతులుగా మారడం ఖాయమంటున్నారు. వెల్లుల్లి శాస్త్రీయ నామము " అల్లియమ్ సాటివుమ్(allium sativum) " , వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది. రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర చుట్టం ..అందుకే దాని కన్నా ఔషధ గుణాలు ఎక్కువ .
వంటిట్లో ఉండే ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. ఇది వంటకాలకు రుచిని, గుమగుమలను తెస్తుంది. ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది. వాసన ఘాటుగా ఉంటుందని, తింటే వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ... ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. దాదాపు అన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి వెల్లుల్లి వాడుతారు. ఆయుర్వేద ఔషధాల తయారీలలో కూడా వెల్లుల్లికి డిమాండ్ ఉంది. మరి ఎన్నో ఔషధ గుణాలున్న వెల్లుల్లిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇంకెన్ని లాభాలుంటాయో తెలుసా.
వెల్లుల్లి పాయలను నేరుగా వంటలకు ఉపయోగించడం మాత్రమే కాదు, ఉల్లిపాయను మెత్తగా చేసి, పాలలో కలిపి తాగుతారు. అలాగే నీటిలో మరిగించి, గోరువెచ్చగా ఉదయం పరగడపున తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. వెల్లుల్లి జ్యూస్ తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు...

ఆస్త్మాను నివారిస్తుంది:
ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ జ్యూస్ లో 2 టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ రెగ్యులర్ డైలీ తాగడం వల్ల ఆస్త్మా నివారించబడుతుంది.

గొంతు నొప్పి :
గార్లిక్ జ్యూస్ ను వేడి నీటిలో మిక్స్ చేసి, నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

దగ్గు :
ఒక టీస్పూన్ గార్లిక్ జ్యూస్ ను ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో మిక్స్ చేసి, రెగ్యులర్ గా తాగితే, అన్ని రకాల దగ్గుల(పొడిదగ్గు, డ్రై కఫ్, జలుబు, దగ్గు) నుండి ఉపశమనం పొందుతారు.

మొటిమలు:
వెల్లుల్లి జ్యూస్ ను 5 చుక్కలు మొటిమల మీద మాత్రమే అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రుల్లో పెట్టకోకూడదు. ఈ రెమెడీ బ్రేక్ అవుట్స్ ను నివారిస్తుంది. మొటిమలు కనబడనివ్వకుండా చేస్తుంది.

బట్టతల :
జుట్టు రాలడాన్ని తగ్గించి బట్టతలను నివారిస్తుంది . బట్టతల ఏర్పడిన ప్రదేశంలో కొద్దిగా నిమ్మరసం అప్లై చేయడం వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది. దీన్ని రోజుకు రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. తలకు అప్లై చేసేప్పుడు, కళ్ళమీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

తలలో పేలు :
ఆశ్చర్యమే..! గార్లిక్ జ్యూస్ బట్టతలను నివారించడం మాత్రమే కాదు, తలలో పేలను కూడా నివారిస్తుందిజ ఒక టీస్పూన్ నిమ్మరసంలో 5 చుక్కల వెల్లుల్లి జ్యూస్ మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు తలకు అప్లై చేయాలి. తర్వాత ఉదయం శుభ్రం చేసుకోవాలి. 5 రోజులు క్రమం తప్పకుండా పెడితే పేల సమస్య తగ్గుతుంది.

ఇంపోటెన్స్ :
గార్లిక్ జ్యూస్ ను గోరువెచ్చని పాలతో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే లైంగిక సమస్యలువండవు, మహిళల్లో ఇన్ ఫెర్టిలిటిని జయిస్తుంది.

కీటాకాలు కుట్టినప్పుడు పాయిజన్ నుండి విముక్తి కలుగుతుంది:
కీటకాలు చేతుల మీద, కాళ్ళ మీద కుట్టినప్పుడు, వెల్లుల్లి జ్యూస్ ను ఆ ప్రదేశంలో అప్లై చేసి, నొప్పి, వాపులు తగ్గతాయి.

కొలెస్ట్రాల్ :
వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది పరోక్షంగా హార్ట్ అటాక్ సమస్యలను తగ్గిస్తుంది. వెల్లుల్లి జ్యూస్ ను తాగడం వల్ల ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా పల్చగా మార్చి, రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది

బ్రెస్ట్ సాగకుండా :
గార్లిక్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ సాగకుండా చేస్తుంది. గార్లిక్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే బ్రెస్ట్ హెల్త్ కూడా మంచిది. క్యాన్సర్ , క్యాన్సర్ లక్షణాలు ఉండవు



Click it and Unblock the Notifications











