Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
హెల్తీగా, యాక్టివ్ గా ఉండటానికి ఫాలో అవ్వాల్సిన సీక్రెట్స్..
మీరు పని, వ్యక్తిగత జీవితంలో సంభవించే విషయాల గురించి ఒత్తిడికి లోనవుతున్నారా? మీ నడుముపై ఉన్న 3 కిలోల అదనపు బరువు కోల్పోవాలి అనుకుంటున్నారా?
ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తే, మీ ఆరోగ్యకరమైన జీవితంలో ఒక గుణపాఠం అవసరం అని చెప్పవచ్చు. సాదారణంగా ఒక వ్యక్తి జీవితంలో మూడు వంతులు పనిలోనే గడుపుతాడు. ఇంటి పని లేదా అన్ని సమయాల్లోనూ పని గురించి ఆలోచిస్తూ ఉంటారు.
మిగతా సమయాన్ని నిద్రకు కేటాయిస్తారు. మితిమీరిన ఒత్తిడిని తొలగించడం అనేది మీ దినచర్య సాధనకు కష్టతరమైన విషయాలలో ఒకటి కావచ్చు.

మరోవైపు అది మీ జీవితం మీద ప్రభావాన్ని చూపుతుంది. ఈ చిన్న విషయానికి బాధ పడకండి. ఇప్పుడు చర్య తీసుకోవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అనుసరించవలసిన సింపుల్ సీక్రెట్స్ తెలుసుకుందాం.
ఒత్తిడి
మీరు ఇప్పటికీ బ్లూస్ ఓడించలేకపోతే, కొన్ని కొవ్వొత్తులను వెలిగించడానికి ప్రయత్నించండి. ఒక రోజు హెల్త్ స్పా, వ్యాయామం లేదా ఒత్తిడిని ఆదికమించటానికి పుస్తకం చదవటానికి ప్లాన్ చేసుకోండి. ఇవి ఒత్తిడి ఉపశమనంనకు సమర్థవంతమైన చర్యలు అని చెప్పవచ్చు.

దూమపానం వదిలేయండి
మీకు పొగ త్రాగే అలవాటు ఉంటే కనుక, ఆ అలవాటును మానేయటానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే చాలా కొద్ది సమయంలోనే ఒత్తిడి తగ్గిపోతుందని అర్ధం చేసుకోవాలి. చివరకు ఇది మీ ఆరోగ్యంపై దీర్ఘకాలిక మంచి ప్రభావాలను చూపుతుంది.

మీ డైట్ ముఖ్యమైనది
ఒక ఆరోగ్యకరమైన, బ్యాలెన్స్ ఆహారంను నిర్వహిస్తే, అది ఆరోగ్యం మీద అద్భుతాలను చేయటమే కాకుండా మొత్తం శక్తిని మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, మాంసం మరియు పాల ఉత్పత్తులను తీసుకోవాలి. అలాగే ఎక్కువ నీటిని కూడా తీసుకోవాలి. అప్పుడు అదనపు పౌండ్ల బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.

వ్యాయామం
బయటకు వెళ్లి వర్క్ అవుట్స్ చేస్తే మంచి అనుభూతి కలుగుతుంది. అంతేకాక వ్యాయామం శక్తిని పెంచుతుంది. అలాగే ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
ఆరోగ్య విద్య
ఆరోగ్య విద్య అనేది ఆరోగ్యంగా ఉండటానికి మరియు కొత్త మార్గాల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం. టెలివిజన్ లో ఆరోగ్య చానెల్స్ చూడటం లేదా మార్కెట్ లో ఒక ఆరోగ్య పత్రికను కొని చదవటం వలన విషయాలను తెలుసుకోవటానికి సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications