Latest Updates
-
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.!
కీళ్లవాతం ఉపశమనం కొరకు ఇంటి చిట్కాలు
శరీరం లోపల యూరిక్ ఆమ్లం స్థాయిలు పెరిగితే కీళ్ళవాతం వస్తుంది. యూరిక్ ఆమ్లం స్థాయిలు పెరిగి జాయింట్స్ పొరల్లో మరియు నిరపాయ గ్రంథులలో చిన్న చిన్న స్ఫటికాలుగా పేరుకుపోతుంది.
శరీరంలో అసాధారణ జీవ క్రియా విధానం కారణంగా మోనో సోడియం మూరిక్ ఆమ్ల లవణము యూరిక్ ఆమ్లం పెరగడానికి సహాయపడుతుంది. కీళ్లలో వాపు కారణంగా తెల్ల రక్త కణాలు చుట్టూ మోనో సోడియం మూరిక్ ఆమ్ల లవణము స్పటిక రూపంలో ఉంటుంది.
పురుషులలో 40 సంవత్సరాల వయస్సు మరియు 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో ఈ సమస్య కనపడుతుంది. ఈ సమస్య కారణంగా మూత్రపిండాల పనితీరు తగ్గుట, యూరిక్ ఆమ్లం చర్మం మరియు మూత్రపిండాల్లో రాళ్ల రూపంలో ఉండుట వలన కీళ్ళవాతం వస్తుంది. ఇంకా సెకండరీ కీళ్లవాతం ఇతర ఆరోగ్య పరిస్థితులు లేదా మందులు ఫలితంగా వస్తుంది.

ఈ రుగ్మతలో రెండు ప్రాథమిక కారణాలను గమనించవచ్చు. వాటిలో మోనో సోడియం మూరిక్ ఆమ్ల లవణము ఎక్కువగా ఉత్పత్తి అవటం మరియు యూరిక్ ఆమ్లం తగినంతగా యురిన్ ద్వారా బయటకు పోదు.
వంశపారంపర్య స్థూలకాయం, ఎక్కువగా ఎరుపు మాంసం మరియు నూనె చేపలను తినటం, గాయాలు,ఆకలి,అతిసారం,ముక్కు మరియు గొంతు రుగ్మతలు, ఆపరేషన్ మరియు కీమోథెరపీ వంటి చికిత్సలు కీళ్ళవాతానికి కారణాలుగా ఉన్నాయి.
ఆస్పిరిన్, అల్లోపురినోల్ మరియు ప్రోబెనే ఆమ్లం,నికోటినిక్ యాసిడ్,మలబద్దకం,అధికరక్తపోటు మందుల కారణంగా కూడా కీళ్ళవాతం వస్తుంది.
మగపిల్లలలో, యూరిక్ ఆమ్లం స్థాయిలు యుక్త వయస్సులోనే పెరుగుతాయి. ఆడపిల్లలలో మొనోఫాజ్ సమయంలో పెరుగుతాయి. అమ్మాయిలతో పోలిస్తే పురుషుల్లో కీళ్ళవాతం అభివృద్ధి చిన్న వయస్సులోనే వస్తుంది. అర్థరాత్రి లేదా ఉదయాన్నే మోకాలు, కాలు లేదా చీలమండ నొప్పిగా ఉంటుంది.

కాబట్టి కీళ్ళవాతం త్వరగా తగ్గటానికి కొన్ని ఇంటి నివారణలను తెలుసుకుందాం.
1. ప్రతి రోజు 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను తింటే మంచి పలితం కనపడుతుంది.
2. ప్రతి రోజు 10 నుంచి 12 చెర్రీలను తింటే కీళ్లవాతానికి సంబంధించిన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
3. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనే, 3 నుంచి 4 స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి త్రాగాలి. ఇది కీళ్ళవాతానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

4. విష లక్షణం కలిగిన యూరిక్ ఆమ్లంను తొలగించటానికి ద్రాక్ష సహాయపడుతుంది. వ్యవస్థ నుండి మోనో సోడియం మూరిక్ ఆమ్ల లవణంతో ఏర్పడిన స్పటికాలను తొలగిస్తుంది. ద్రాక్షలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన స్పటిక నిక్షేపాలను తొలగించటంలో సహాయపడుతుంది.
5. ఫ్రెంచ్ బీన్స్ యొక్క రసం కీళ్ళ వాతం కారణంగా వచ్చే నొప్పి మరియు వాపుకు తక్షణ ఉపశమనంను అందిస్తుంది. ఒక స్పూన్ ఆవాల పొడి,ఒక స్పూన్ కొర్రల పొడి కలిపి పేస్ట్ గా చేయాలి. రాత్రి సమయంలో ఈ పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తే ఉపశమనం కలుగుతుంది.
6. వేడి నీటిలో ఎప్సోమ్ ఉప్పు కలిపి నొప్పి ఉన్న ప్రాంతంలో కాపడం పెడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications