For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కు మెయిన్ రీజన్స్ ....!!

|

యూటిఐ(యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మనం తరచూ వింటుండే హెల్త్ ప్రాబ్లెమ్. సాధారణంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు ఎక్కువగా మహిళలు గురి అవుతుంటారు.స్త్రీలు ఎదుర్కొనే అత్యంత ఇబ్బందికర సమస్యలో మూత్రాశయ సమస్యలు ప్రధానమైనవి. మూత్ర విసర్జనను నియంత్రించుకోలేకపోవటం, దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌ అవటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసిరావటం ఇలా..స్త్రీలు ఎదుర్కొనే మూత్ర సమస్యలెన్నో!

అయితే ఈ మద్య కాలంలో పురుషుల నుండి కూడా ఈ మాట వినిపిస్తోంది. ఈ సమస్యకు కారణాలు వివిధ రకాలుగా ఉన్నాయి. స్త్రీలలో ఒకరమైన కారణాలుంటే, పరుషుల్లో వేరే విధమైన కారణాలుంటాయి . పురుషుల్లో యుటిఐ ఇన్ఫెక్షన్ కు వివిధ రకాల కారణాలున్నాయి.

పురుషుల్లో యూటిఐ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు, ఫ్రీక్వెంట్ యూరినేషన్, మూత్రంలో మంట, యూరిన్ సమయంలో ఎక్కువ నొప్పి ఉంటుంది. ఫీవర్, చీకాకు మరియు అసౌకర్యం వంటి లక్షణాలు ఎక్కువగా కబనడుతాయని, ముంబాయ్ లోని యూరో ఆన్కాలజికల్ రోబోటిక్ సర్జన్ వెల్లడి చేస్తున్నారు. మరి నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషుల్లో యూటిఐ ఇన్ఫెక్షన్ కు కారణాలేంటో తెలుసుకుందాం...

ఎస్ టిడి ఇన్ఫెక్షన్(సెక్స్యువల్ ట్రాస్మిటర్ డిసీజ్ ):

ఎస్ టిడి ఇన్ఫెక్షన్(సెక్స్యువల్ ట్రాస్మిటర్ డిసీజ్ ):

యవ్వనంలో ఉండే పురుషుల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణం అండర్ లైయింగ్ ఎస్ టిడి ఇన్ఫెక్షన్. ఎస్ టిడి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు ప్రధాన కారణం బ్యాక్టీరియా. ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా చేయడం వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్, బర్నింగ్ సెన్షేషన్, యూరిన్ పాస్ చేసే సమయంలో నొప్పి మరియు ఇతర లక్షణాలు కూడా కనబడుతాయి.

బ్లాడర్ మరియు యురెత్రా ఇన్ఫెక్షన్:

బ్లాడర్ మరియు యురెత్రా ఇన్ఫెక్షన్:

పురుషుల్లో బ్లాడర్ ఇన్ఫెక్షన్ లేదా సిస్టులు, యురెత్ర ఇన్ఫెక్షన్ లేదా యురెథ్రైటిస్ లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వంటి లక్షణాల వల్ల పురుషుల్లో యూటీఐ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

ప్రొస్టేట్ సమస్యలు:

ప్రొస్టేట్ సమస్యలు:

సాధారణంగా 50ఏళ్ళు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్ పొడువగా పెరిగినప్పుడు యూటిఐ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది .ప్రొస్టేట్ లార్జ్ గా అయినప్పుడు ఆ ఒత్తిడి బ్లాడర్ మీద ప్రభావం చూసుతుంది. దాంతో బ్లాడర్ పూర్తిగా కాలీ కాకుండ చేస్తుంది. బ్లాడర్ లో కొద్దిగా యూరిన్ అలాగే మిగిలిపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో యూటీఐ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

కిడ్నీ స్టోన్స్ :

కిడ్నీ స్టోన్స్ :

యవ్వనస్తుల్లో మరియు వయస్సైన వారిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. అందుకు కారణం బ్లాడర్ నుండి మూత్రం సరిగా బయటకు పోకుండా స్టోన్ అడ్డు పడటం వల్ల అక్కడ మూత్ర నిల్వ చేరి బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

డయాబెటిస్:

డయాబెటిస్:

డయాబెటిస్ కారణం వల్ల నేరుగా యుటిఐ మీద ప్రభావం చూపదు. కానీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ మీద ప్రభావం చూపుతుంది. అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారిలో తెలియకుండానే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.

యాంటీబయోటిక్స్ కు ఉపయోగించడం వల్ల :

యాంటీబయోటిక్స్ కు ఉపయోగించడం వల్ల :

కొన్ని రకాల యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల, యూరిన్ మరియు బౌల్లో బ్యాక్టీరియాల పెరగకుండా అంతరాయం కలిగిస్తుంది. దాంతో యూరినరీ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.

మూత్రం ఎక్కువ సార్లు చేయడం

మూత్రం ఎక్కువ సార్లు చేయడం

మూత్ర విసర్జన మంటతో కూడి ఉండుట. పొత్తి కడుపులో నొప్పి రావడం, మూత్రం ఎక్కువ సార్లు చేయడం. మూత్రం రంగు మారడం, వేడిగా, ఎరుపుగా రావటం.

English summary

7 common causes of UTI in men

Men are far less affected by UTI infections than women. However, there could be a number of reasons that could lead to a UTI in men. ‘UTI in men is usually characterized by frequent urination, burning sensation, severe pain during urination, fever, irritability and general discomfort that isn’t easy to express.
Story first published: Monday, July 11, 2016, 16:02 [IST]
Desktop Bottom Promotion