Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.!
ఏ కాలం అయినా ఆ సీజన్‌కి సంబంధించి పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే మామిడిపండ్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక తోట పండ్లు ఎక్కడ కనిపించినా ఎగబడి కొనేస్తారు. అయితే మామిడి కాయలతో పచ్చళ్లు, పప్పులు, చారు చూసి ఉంటాం. పండ్లు అయితే జుర్రుకుని తినేస్తాం, లేదా జ్యూస్ తాగేస్తాం. కానీ ఎప్పుడైనా స్వీట్ చేసుకుని తిన్నారా.? ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఆ రుచి జీవితంలో మరిచిపోలేరు.

మ్యాంగో షీరా తయారీకి కావాల్సిన పదార్థాలు
నెయ్యి- ఒకటిన్నర టీ స్పూన్
బాదం- 10
జీడిపప్పు- 10
కిస్‌మిస్- 10
చిరోంజి- టీస్పూన్
బొంబాయి రవ్వ- ఒక కప్పు
నీళ్లు- ఒక కప్పు
కాచిన పాలు- ఒక కప్పు
కుంకుమ పువ్వు- కొద్దిగా
పంచదార- అర కప్పు
మామిడి పండు- రెండు
ఏలకుల పొడి- అర టీస్పూన్
మ్యాంగో షీరా తయారీ విధానం
ముందుగా ఓ కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, చిరోంజి వేసి దోరగా వేయించుకుని పక్కక పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత అందులో నీళ్లు పోసి కలపాలి. కాస్త ఉడికాక పాలు, కుంకుమ పువ్వు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార వేసి కరిగేవరకు కలుపుతూ ఉండాలి.
మామిడి పండును చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా అయ్యోవరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను రవ్వ కేసరిలో వేసి చిన్న మంట మీద కలియతిప్పుకోవాలి. చివరిగా ఏలకుల పొడి వేసి కలిపాక పై నుంచి వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌ను వేసి మరోసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రవ్వ కేసరికి మామిడిపండు రసం కలిస్తే ఎలా ఉంటుందో ఆ రుచిని ఈ వేసవిలో ఖచ్చితంగా ట్రై చేసి చూడటమే.
మ్యాంగో కోకోనట్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
కొబ్బరి కాయ- ఒకటి
మామిడి పండు- ఒకటి
ఏలకుల పొడి- టీ స్పూన్
పంచదార- రెండు టేబుల్ స్పూన్లు
పాలు- పావు కప్పు
పిస్తా పప్పు- కొద్దిగా
కుంకుమ పువ్వు- కొద్దిగా
మ్యాంగో కోకోనట్ లడ్డూ తయారీ విధానం
ముందుగా పచ్చి కొబ్బరిని తురుముకోవాలి. అందులో సగం సెపరేట్‌గా ఒక పళ్లెంలో వేసుకోవాలి. ఇప్పుడు మామిడి పండును ముక్కలుగా కట్ చేసుకుని అందులో పంచదార, ఏలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన సగం కొబ్బరి తురుమును ఓ బాణలిలో తీసుకుని చిన్న మంట మీద పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి. ఇందులోనే మ్యాంగో పేస్ట్, కుంకుమపువ్వు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా ఉండలుగా చుట్టుకుని ఒక పళ్లెంలో వేసిన కొబ్బరి తురుములో వాటిని ఒకసారి దొర్లించి ఆ పైన పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలను చేసుకోవాలి. అంతే ఎప్పుడూ చేసుకుని రవ్వ లడ్డూలు, బూందీ లడ్డూలు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. సీజనల్ మ్యాంగోతో చేసుకుని ఈ రుచికరమైన లడ్డూలు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం.
మామిడి పండ్లతో పోషకాలు పుష్కలం
ఒక కప్పు తాజా మామిడి ముక్కల్లో సుమారు 165 గ్రాములు పోషకాలు ఉన్నన్నాయి. ఇందులో 99 కిలో కేలరీలు, 24.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 22.6 గ్రాముల సహజ చక్కెరలు, 2.6 గ్రాములు ఫైబర్, 1.4 గ్రాములు ప్రొటీన్‌తో చాలా తక్కువ మొత్తంలో ఫ్యాట్‌ను కలిగి ఉంది. మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ ఏ, కంటి ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు దోహదపడుతుంది. గర్భిణీలు మామిడి పండ్లను తినడం ద్వారా ఫోలేట్ సమృద్ధిగా లభిస్తుంది. ఇందులోని మినరల్స్‌తో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications