Latest Updates
-
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
సంతానోత్పత్తిని పెంపొందించేదుకై భ్రమరి ప్రాణాయామం (బీ బ్రీత్)
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఒత్తిడితో ఏదో ఒక విధంగా ఇబ్బందికి గురవుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అందువల్ల ఎంతో మంది అనారోగ్యంతో సతమతమవుతున్నారు. ఈ ఒత్తిడి కేవలం ఆఫీస్ కే పరిమితమైనది కాదు.
వృత్తిపరమైన సమస్యలు ఆఫీస్ కే పరిమితమవకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలను సృష్టించడానికి కారణమవుతున్నాయి. ఒత్తిడి వల్ల సంతానోత్పత్తి సమస్యలతో చికిత్సను కోరుతున్న భార్యాభర్తల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది.
ఒత్తిడి అనేది శరీరం యొక్క సంతానోత్పత్తి సామర్ధ్యతపై దుష్ప్రభావం చూపుతోంది. ఒత్తిడి వల్ల కలిగే ప్రభావం వల్ల గర్భం దాల్చడం కష్టతరంగా మారుతుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలా అని మీరిప్పుడు ఆలోచిస్తున్నారు కదా?
యోగా అనేదే మీ ప్రశ్నలన్నిటికీ సరి అయిన జవాబు. యోగా అనేది మీకు కచ్చితంగా ఈ సమస్య నుంచి సంపూర్ణంగా విముక్తి లభిస్తుందని ఎటువంటి హామీ ఇవ్వలేకపోయినా, మీ మనస్సుకు ప్రశాంతతనివ్వడం ద్వారా ఒత్తిడి వల్ల మీ శరీరానికి కలిగే నష్టాలను తొలగించి గర్భధారణకు మీ శరీరాన్ని అనుకూలంగా తయారుచేయడంలో సఫలమవుతుందని చెప్పవచ్చు.
భ్రమరి ప్రాణాయామం అనే ఈ ఆసనం, మీ మనస్సులోని ఒత్తిడిని తొలగించి ప్రశాంతతను కలిగించడానికి తోడ్పడుతుంది. కోపం మరియు చికాకులను తొలగించుకునేందుకు భ్రమరి ప్రాణాయామమనేది ఒక చక్కటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గా ఉపయోగపడుతుంది.

ఈ ఆసనానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆసనాన్ని మీరు ఎక్కడైనా సాధన చేయవచ్చు. ఒత్తిడిగా అనిపించిన సందర్భాలలో ఈ ఆసనాన్నిసాధన చేయడం ద్వారా ప్రయోజనాలను పొందండి.
సంస్కృత పదం "భ్రమరి" నుంచి ఈ ఆసనానికి 'భ్రమరి ప్రాణాయామం' అనే పేరు వచ్చింది. 'భ్రమరం' అనగా తుమ్మెద. ప్రాణాయామం అనగా శ్వాస ప్రక్రియలు.
ఈ ఆసనంలో శ్వాసను వదుల్తున్నప్పుడు తుమ్మెద ఝుంకారం వంటి శబ్దం వస్తుంది. అందువలన ఈ ఆసనం "భ్రమరి ప్రాణాయామం"గా ప్రసిద్ది.
ఈ ఆసనాన్ని ఎలా సాధన చేయాలో తెలిపే దశలు
1. సౌకర్యమైన స్థానంలో కూర్చొని వెన్నెముకను నిటారుగా ఉంచండి. మీ కన్నులను మూసి చిరునవ్వునుచిందిస్తూ విశ్రాంతిని పొందండి
2. చెవులు, చెంపల మధ్యగానున్న ప్రదేశంలోనున్న కార్టిలేజ్ పై మీ చూపుడు వేళ్ళను ఆనించండి.
3. కార్టిలేజ్ పై సున్నితంగా ఒత్తిడి పెడుతూ శ్వాసను తీసుకుంటూ వదలండి. శ్వాసను వదిలే క్రమంలో తుమ్మెద ఝుంకారం వంటి శబ్దాన్ని చేయండి. శబ్దం ఎంత పెద్దగా ఉంటే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు అంత బాగా ఉంటాయి. అందువల్ల, మీరు ఝుంకార శబ్దంపై ఎక్కువ గురి పెట్టాలి.
4. మీరు సౌకర్యవంతంగా చేయగలిగినంత సేపు ఈ ఆసనాన్ని సాధన చేయండి. చిరునవ్వును చిందిస్తూ ఉపశమనం పొందండి.
ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు
• కోపాన్ని, ఆందోళనని మరియు హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుంది
• మైగ్రైన్ అలాగే తలనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
• ఏకాగ్రతను పెంపొందించుతుంది
• ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది
• బ్లడ్ ప్రెజర్ ను అదుపులో పెడుతుంది
క్రమక్రమంగా మీరు మీ బొటనవేలిని కార్టిలేజ్ లో పెట్టి, చూపుడు వ్రేళ్ళను నుదుటిపైకి అలాగే వెంటనే కనుబొమ్మల మీదకు తీసుకురావచ్చు. ఈ క్రమంలోనే మీ మధ్యవేలిని మీ కల్ల మీదకు తీసుకురావచ్చు. ఉంగరం వేలును ముక్కుపుటాలపై తీసుకువచ్చి చిటికెన వేలును పెదవుల చివరకు తీసుకురావచ్చు.
హెచ్చరిక
ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే ఈ ఆసనాన్నివేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications